News August 23, 2024

13 ఏళ్లుగా అతను భార్య కోసం వెతుకుతున్నాడు

image

సునామీలో కొట్టుకుపోయిన భార్య కోసం ఓ వ్యక్తి గ‌త 13 ఏళ్లుగా సముద్రాన్ని జ‌ల్లెడ‌ప‌డుతున్నాడు. జ‌పాన్‌కు చెందిన యసువో తకమట్సు భార్య యుకో 2011 జ‌పాన్ సునామీలో కొట్టుకుపోయింది. భార్య అవశేషాలు ఇక దొరకవని తెలిసినా ఆమె మీద ప్రేమ‌తో అలుపెర‌గ‌ని అన్వేషణ చేస్తూనే ఉన్నాడు. డీప్ డైవర్స్ ద్వారా ఈత‌లో శిక్ష‌ణ పొంది మరీ త‌న వెతుకులాట‌ను కొన‌సాగిస్తుండడ‌ంతో అంద‌రూ అత‌నిపై సానుభూతిని ప్ర‌క‌టిస్తున్నారు.

News August 23, 2024

ఐదు పథకాల పేర్ల మార్పు

image

AP: రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలోని 5 పథకాల పేర్లు మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. ‘అమ్మ ఒడి’ని ‘తల్లికి వందనం’, ‘జగనన్న విద్యా కానుక’ను ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’గా ‘జగనన్న గోరుముద్ద’ను ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’గా, ‘నాడు-నేడు’ను ‘మన బడి-మన భవిష్యత్’గా, ‘స్వేచ్ఛ’ పేరును ‘బాలికా రక్ష’గా, ‘ఆణిముత్యాలు’ని ‘అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం’గా మార్చింది.

News August 23, 2024

ప్రభాస్‌పై విమర్శలు.. అర్షద్‌పై CINETAAకి MAA ఫిర్యాదు

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన <<13885603>>విమర్శలను<<>> మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలతో తెలుగు సినీ అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయని అధ్యక్షుడు మంచు విష్ణు ముంబైకి చెందిన CINETAAకి ఫిర్యాదు చేశారు. మనమంతా ఒకే కుటుంబమని, వార్సీ తోటి నటీనటులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, మానుకుంటే మంచిదని లేఖలో సూచించారు.

News August 23, 2024

ఆ సినిమా రీమేక్‌కు సిద్ధం: స‌ల్మాన్ ఖాన్‌

image

బాలీవుడ్‌ ట్రెండ్ సెట్ట‌ర్ షోలే సినిమా రీమేక్‌లో న‌టించ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్టు సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ తెలిపారు. తండ్రి స‌లీమ్, ర‌చ‌యిత జావెద్ ద్వ‌యంపై తెర‌కెక్కిన ‘యాంగ్రీ యంగ్ మెన్’ ప్ర‌మోష‌న్స్‌లో ఆయ‌న మాట్లాడారు. షోలేలో జై-వీర్‌-గ‌బ్బ‌ర్ పాత్రల్లో ఏదైనా సరే తనకు ఓకే అంటూ బాలీవుడ్ ఎవర్ గ్రీన్ ఫిల్మ్ రీమేక్‌పై సల్మాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

News August 23, 2024

కమలా హారిస్ తల్లి శ్యామల గురించి మీకు తెలుసా?

image

తమిళనాడుకు చెందిన శ్యామలా గోపాలన్ 1958లో హయ్యర్ స్టడీస్ కోసం కాలిఫోర్నియా వెళ్లారు. 25 ఏళ్ల వయసులో డాక్టరేట్ పూర్తి చేశారు. రొమ్ము క్యాన్సర్‌పై రీసెర్చ్ చేశారు. 1963లో జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్‌ను పెళ్లాడారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. 2009లో శ్యామల క్యాన్సర్‌తో చనిపోయారు. ఆ తర్వాతి ఏడాది కమలా హారిస్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు.

News August 23, 2024

మూగజీవాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం శోచనీయం: హరీశ్ రావు

image

TG: మూగజీవాల సంరక్షణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. ‘ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందులు లేని దుస్థితి ఉంది. 9 నెలలుగా మందులు లేక పశువులు వ్యాధుల బారిన పడుతున్నాయి. 1962 పశువైద్య సంచార వాహనాల నిర్వహణను గాలికొదిలేశారు. వెంటనే ఈ సమస్యల్ని పరిష్కరించాలి. 1962 వాహనాల్లో విధులు నిర్వర్తించే వారికి సకాలంలో జీతాలు ఇవ్వాలి’ అని CM రేవంత్‌ను డిమాండ్ చేశారు.

News August 23, 2024

రాష్ట్ర ప్రభుత్వానికి YS జగన్ డెడ్‌లైన్

image

AP: అచ్యుతాపురం ఘటనకు సంబంధించి బాధితులకు ఇంకా పరిహారం అందలేదని YS జగన్ ఆరోపించారు. 2-3 వారాల్లోగా బాధితులకు పరిహారం అందించాలని ఆయన డెడ్‌లైన్ విధించారు. ‘నేను ఇచ్చిన గడువులోగా పరిహారం ఇవ్వకుంటే బాధితుల తరఫున వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం. అవసరమైతే నేను కూడా ధర్నాలో పాల్గొంటా’ అని జగన్ స్పష్టం చేశారు. ఈ ఘటనలో 17 మంది మరణించగా, ప్రభుత్వం రూ.కోటి పరిహారం ప్రకటించింది.

News August 23, 2024

ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలి: పవన్

image

AP: గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ‘ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలి. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించం. అవసరమైతే గూండా యాక్ట్ తీసుకొస్తాం. గ్రామాల్లో కాలేజీలు, క్రీడా మైదానాలు లేవు. ప్రభుత్వ స్థలాలుంటే నిర్మాణాలు చేసుకోవచ్చు. దాతలు ముందుకొస్తే నేను కూడా నిధులు తీసుకొస్తా. క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తా ‘ అని పేర్కొన్నారు.

News August 23, 2024

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ.220 తగ్గి రూ.72,650కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.200 తగ్గి రూ.66,600 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.300 తగ్గి రూ.91,700గా ఉంది.

News August 23, 2024

అనిల్ అంబానీకి షాక్ ఇచ్చిన సెబీ

image

నిధుల మళ్లింపు కేసులో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్(RHFL) మాజీ ఉద్యోగులు, 24 సంస్థలపై సెబీ నిషేధం విధించింది. ఐదేళ్లపాటు సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనవద్దని ఆదేశించింది. అనిల్ అంబానీపై రూ.25 కోట్ల ఫైన్ వేసింది. లిస్టెడ్ కంపెనీల్లో ఎలాంటి కీలక హోదాల్లో కొనసాగకూడదని స్పష్టం చేసింది. ఉద్యోగుల సాయంతో RHFL నిధులను అనిల్ అనుబంధ సంస్థలకు రుణాలుగా మళ్లించినట్టు సెబీ తెలిపింది.