News May 16, 2024

IPL నుంచి ఢిల్లీ ఎలిమినేట్

image

SRH ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడంతో ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు 14 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. టాప్ 4లో ఉన్న KKR, RR, SRH, CSKకు 14కుపైనే పాయింట్లు ఉన్నాయి. అలాగే ఈ జట్లకు తలో మ్యాచ్ మిగిలి ఉంది. దీంతో ఢిల్లీ నాకౌట్ రేసు నుంచి తప్పుకుంది. మరోవైపు ఈనెల 18న CSKతో మ్యాచ్‌లో RCB 18 పరుగుల తేడాతో లేదా 18.1 ఓవర్లలో 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తేనే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.

News May 16, 2024

సలార్-2లో విలన్‌గా టామ్ చాకో?

image

దసరా సినిమాలో విలక్షణ నటనతో ఆకట్టుకున్న షైన్ టామ్ చాకోను సలార్-2లో మరో విలన్ పాత్రకు మేకర్స్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పిన కథకు ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రభాస్‌ను నేరుగా ఢీకొనేలా చాకో పాత్ర ఉంటుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందట. కాగా ఈ సినిమాకు నీల్ యూనివర్స్‌లో మరో చిత్రానికి కనెక్షన్ ఉంటుందని పృథ్వీరాజ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

News May 16, 2024

BREAKING: మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్‌కు SRH

image

ఇవాళ ఉప్పల్ వేదికగా జరగాల్సిన SRH-GT మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. సాయంత్రం నుంచి కొనసాగిన వాన ఎంతకీ తగ్గకపోవడంతో టాస్ వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇరు జట్లకూ చెరో పాయింట్ దక్కింది. దీంతో మరో లీగ్ మ్యాచ్ మిగిలి ఉండగానే 15 పాయింట్లతో SRH నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. GT ఇప్పటికే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

News May 16, 2024

BIG ALERT: తెలంగాణలో రేపు భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో 5 రోజులపాటు భారీ వర్షాలు కొనసాగుతాయని IMD వెల్లడించింది. రేపు మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, హైదరాబాద్, గద్వాల్, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40-50KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మిగతా రోజుల్లో వానలు కురిసే జిల్లాల జాబితాను పైన ఫొటోల్లో చూడగలరు.

News May 16, 2024

FY25లో విమాన ప్రయాణికులు 418 మిలియన్లు: ఇక్రా

image

దేశంలో 2023-24లో విమాన ప్రయాణికుల సంఖ్య 376.4 మిలియన్లకు చేరిందని రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా’ వెల్లడించింది. 2024-25లో ఆ సంఖ్య 8-11% వృద్ధితో 407-418 మిలియన్లకు చేరొచ్చని అంచనా వేసింది. దేశీయంగా కొత్త గమ్యస్థానాలకు కనెక్టివిటీని పెంచడం, అంతర్జాతీయ ప్రయాణాల్లో పెరుగుదల కలిసొస్తుందని పేర్కొంది. గ్లోబల్ ప్యాసింజర్ ట్రాఫిక్ 2019లో 3.8 శాతం ఉండగా, 2023లో 4.2 శాతానికి చేరిందని తెలిపింది.

News May 16, 2024

పుష్ప-2 నుంచి తప్పుకున్న ఎడిటర్?

image

సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప-2 మూవీ నుంచి ఎడిటర్ ఆంటోనీ రూబెన్ తప్పుకున్నట్లు సమాచారం. ముందస్తు కమిట్‌మెంట్స్ ఉండటంతో స్నేహపూర్వకంగానే బయటికొచ్చినట్లు తెలుస్తోంది. అతని స్థానంలో నవీన్ నూలిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మిగతా వర్క్‌ను ఇతనే పూర్తి చేస్తారట. ధ్రువ, నాన్నకు ప్రేమతో, రోమియో, గోవిందుడు అందరివాడేలే తదితర చిత్రాలకు నవీన్ పనిచేశారు.

News May 16, 2024

చేతికి బదులు నాలుకకు సర్జరీ చేశారు

image

కేరళలోని వైద్యులు నిర్లక్ష్యంతో చేతికి చేయాల్సిన సర్జరీని నాలుకకు చేశారు. చేతికి ఉన్న ఆరో వేలు తొలగింపు కోసం నాలుగేళ్ల చిన్నారి ప్రభుత్వాసుపత్రిలో చేరారు. సర్జరీ తర్వాత చిన్నారి నోటికి ప్లాస్టర్ చూసి ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు ఇదేంటని ప్రశ్నించడంతో మరో పాపకు చేయాల్సిన సర్జరీ ఈ చిన్నారికి చేశామని, పొరపాటు జరిగిందని వైద్యులు ఒప్పుకున్నారు. ఈ ఘటనపై ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు.

News May 16, 2024

పన్ను ఎగవేతలపై కఠినంగా ఉండాలి: రేవంత్

image

TG: రాష్ట్ర ఆదాయం పెరిగేలా సంస్కరణలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మద్యం అమ్మకాలు పెరిగినా ఆదాయం మాత్రం పెరగలేదని తెలిపారు. ‘పన్ను ఎగవేతలపై కఠినంగా వ్యవహరించాలి. జీఎస్టీ ఎగవేతదారులను ఉపేక్షించవద్దు. జీఎస్టీ రిటర్న్స్‌లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. నెలవారీ లక్ష్యాలు పెట్టుకుని రాబడులు సాధించాలి. మద్యం అక్రమ రవాణా, పన్ను ఎగవేతలు లేకుండా చేయాలి’ అని సీఎం ఆదేశించారు.

News May 16, 2024

‘వార్ 2’లో మరో బాలీవుడ్ హీరోయిన్?

image

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘వార్ 2’ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ స్పెషల్ సాంగ్‌ కోసం మూవీ టీమ్ ఆమెను సంప్రదించినట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఆగష్టు 14న మూవీ విడుదల కానుంది.

News May 16, 2024

టెన్త్‌లో 99.70% మార్కులు సాధించిన బాలిక మృతి

image

గుజరాత్‌లోని మోర్బీకి చెందిన హీర్ గెతియా(16) టెన్త్‌లో 99.70 శాతం మార్కులతో స్టేట్ టాపర్లలో ఒకరిగా నిలిచారు. అయితే ఆమె తల్లిదండ్రులకు ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మెదడులో రక్తస్రావం కారణంగా గెతియా కన్నుమూశారు. ఆపరేషన్ చేయించినా ఫలితం లేకపోయిందని కుటుంబసభ్యులు తెలిపారు. ‘ఆమె డాక్టర్ కావాలనుకుంది. ఆమె మరణించినా ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు శరీరాన్ని ఆస్పత్రికి డొనేట్ చేశాం’ అని తండ్రి వెల్లడించారు.