India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్ర ప్రభుత్వ ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ చర్యలను నిలిపేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ చీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ‘ఈ నెల 17 నుంచి 25 వరకు ఈ-ఆఫీస్ మూసివేతపై మాకు కొన్ని అనుమానాలున్నాయి. కొత్త ప్రభుత్వం వస్తున్న వేళ ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ అవసరం లేదు. ఫైల్స్, నోటీస్ ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలి. అన్ని హెచ్‌ఓడీ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఈ సారి SRH ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు లేవని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘తదుపరి 2 మ్యాచ్‌లలో SRH ఓడిపోవచ్చు. ఐపీఎల్‌లో ఏదైనా జరగొచ్చు. కేకేఆర్, రాజస్థాన్, సీఎస్కే, ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్లొచ్చు’ అని ఆయన చెప్పారు. కాగా హర్భజన్ వ్యాఖ్యలపై SRH ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అపశకునపు మాటలు మాట్లాడుతున్నారంటూ భగ్గుమంటున్నారు. కమిన్స్ బృందాన్ని తక్కువ అంచనా వేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
TG: హైదరాబాద్ ICFAI యూనివర్సిటీ విద్యార్థిని లేఖ్యపై యాసిడ్ దాడి జరిగింది. ఆమె స్నానం చేసేందుకు వెళ్లగా.. అప్పటికే బకెట్లో ఆగంతకులు యాసిడ్ పోసి పెట్టారు. నీళ్లనుకొని విద్యార్థిని అందులో చేయి పెట్టడంతో కాలింది. లేఖ్య రెండు చేతులతో పాటు కాలిపై యాసిడ్ పడటంతో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసుల విచారణ చేపట్టారు.
తాను ఊహించినట్లుగానే ఏపీలో అధికార మార్పిడికి ముందు రక్తపాతం జరిగిందని నటుడు నరేశ్ ట్వీట్ చేశారు. ‘ఏపీలో ఎన్నికల పోరు ముగిసింది. ఓటర్లు తీర్పు ఇచ్చారు. ప్రజలకు అత్యంత ఇష్టమైన నాయకులు గెలవాలని, శాంతి నెలకొనాలని కోరుకుంటున్నా’ అని రాసుకొచ్చారు. ఈయన పలు సందర్భాల్లో కూటమికి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఏపీలోకి అధికార మార్పిడికి ముందు రక్తపాతం జరుగుతుందని <<12974799>>గతంలో<<>> ట్వీట్ చేశారు.
TG: హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. సుమారు గంట నుంచి ఏకధాటిగా వాన పడుతోంది. దీంతో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ప్రజల కోసం GHMC టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. GHMC-DRF సహాయం కోసం 040-21111111 లేదా 9000113667కు ఫోన్ చేయాలని పేర్కొంది. వర్షం వేళ అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించింది.
తాను బతికున్నంత వరకు దేశంలో మతపరమైన రిజర్వేషన్లను అమలు కానివ్వనని ప్రధాని మోదీ అన్నారు. ‘రాజ్యాంగానికి విరుద్ధమైన ఈ విధానంపై నేను పోరాడతాను. ఒకప్పుడు మతం ఆధారంగా దేశాన్ని విడగొట్టారు. ఇప్పుడు గుర్తింపు కోసం ఇలా చేస్తున్నారు. ఇది సరికాదు. ప్రజలకు దీనిపై నేను అవగాహన కల్పించేందుకు సిద్ధం’ అని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను దేశం కోసం పనిచేస్తానని ఓట్ల కోసం కాదని తెలిపారు.
హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మణికొండ, షేక్‌పేట, గచ్చిబౌలి, ఖైరతాబాద్, దిల్‌సుఖ్‌నగర్, లక్డీకపూల్, పంజాగుట్ట తదితర ఏరియాల్లో వాన పడుతోంది. దీంతో నగరంలోని రోడ్లు నీటితో నిండిపోయాయి. ఫలితంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చంద్రుడిపై రైల్వే స్టేషన్ ఏర్పాటుకు ‘ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ <<13221265>>ఆన్<<>> ఏ ట్రాక్’ అనే ప్రత్యేక వ్యవస్థను నాసా అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం ‘మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ’ని వినియోగించనుంది. జాబిల్లిపై దుమ్ము, ధూళి ఎక్కువగా ఉండటంతో ఈ టెక్నాలజీ 3-ఫేజ్ రైలు ట్రాక్‌పై ఫ్లోట్ రోబోట్‌లు తేలియాడుతూ ప్రయాణించేందుకు మార్గం సుగమం చేస్తుంది. చంద్రుడిపై ఫ్లోట్ రోబోలు సెకనుకు 0.5 మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
తనకు సొంత ఇల్లు లేకున్నా దేశంలోని 4కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చానని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. యూపీలోని భదోహీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. యూపీ అభివృద్ధికి బీజేపీ నిరంతర కృషి చేస్తోందన్నారు. తాము ‘ఒకే జిల్లా.. ఒకే ప్రొడక్టు’ నినాదంతో పని చేస్తుంటే.. SP ‘ఒక జిల్లా ఒక మాఫియా’ కోసం పని చేస్తోందన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో తనకు సొంత ఇల్లు లేదని మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ వచ్చే నెలలోగా పూర్తిచేసేలా డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేశారట. ఇది పూర్తికాగానే బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘RC16’ షూటింగ్‌లో చరణ్ పాల్గొననున్నారు. మొదటి షెడ్యూల్‌లోనే సాంగ్స్ చిత్రీకరణ పూర్తిచేయనున్నట్లు టాక్. కాగా, మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ కెరీర్‌లో రెగ్యులర్ షూట్ ప్రారంభంకాకముందే మూడు సాంగ్స్ రికార్డ్ చేయడం ఇదే మొదటిసారి.
Sorry, no posts matched your criteria.