News November 20, 2024

నేడు వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయన పలు కీలక విషయాలపై మాట్లాడతారని తెలుస్తోంది. పోలవరం, రుషికొండ వంటి పలు అంశాలపై ఆయన మీడియాకు వివరించనున్నట్లు సమాచారం. అలాగే కూటమి సర్కార్‌కు ఆయన పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 11, 2024

యంగ్ డైరెక్టర్‌తో గోపిచంద్ మూవీ?

image

‘విశ్వం’ తర్వాత గోపీచంద్ నటించే మూవీపై అప్‌డేట్ రాలేదు. తాజాగా, ఆయన ‘ఘాజీ’ ఫేం సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల డైరెక్టర్ ఓ కథ చెప్పగా అది గోపిచంద్‌కు నచ్చి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ కథ విభిన్నమైందని, చిట్టూరి శ్రీనివాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

News December 11, 2024

నేటి నుంచి శివ దీక్షా విరమణ ప్రారంభం

image

AP: శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక‌మాస శివ దీక్షా విరమణ ప్రారంభం కానుంది. 15వ తేదీతో ముగిసే ఈ కార్యక్రమానికి పాతాళగంగా మార్గంలోని శిబిరాల్లో ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు చెప్పారు. గత నెల 2న మండల దీక్ష, 21న అర్ధమండల దీక్ష స్వీకరించిన భక్తులు విరమించవచ్చన్నారు. ఇవాళ ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో ఆశీనులను చేసి విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News December 11, 2024

బ్యాంకుల్లో మొండి బాకీలపై కేంద్ర మంత్రి ప్రకటన

image

ప్రభుత్వరంగ బ్యాంకులిచ్చిన రుణాల మొండి బాకీలు 3.09% ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. గత సెప్టెంబర్ 30 నుంచి బ్యాంకులు మంజూరు చేసిన దాని విలువ రూ.3.16లక్షల కోట్లు అని రాజ్యసభలో వెల్లడించారు. అటు, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు రూ.1.34లక్షల కోట్లు ఉన్నట్లు తెలిపారు. అది 1.86%కి సమానమన్నారు. ప్రభుత్వ రంగం(3.09%)తో పోలిస్తే ఇది తక్కువ అని స్పష్టం చేశారు.