India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తనకు సొంత ఇల్లు లేకున్నా దేశంలోని 4కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చానని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. యూపీలోని భదోహీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. యూపీ అభివృద్ధికి బీజేపీ నిరంతర కృషి చేస్తోందన్నారు. తాము ‘ఒకే జిల్లా.. ఒకే ప్రొడక్టు’ నినాదంతో పని చేస్తుంటే.. SP ‘ఒక జిల్లా ఒక మాఫియా’ కోసం పని చేస్తోందన్నారు. ఎన్నికల అఫిడవిట్లో తనకు సొంత ఇల్లు లేదని మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ వచ్చే నెలలోగా పూర్తిచేసేలా డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేశారట. ఇది పూర్తికాగానే బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘RC16’ షూటింగ్లో చరణ్ పాల్గొననున్నారు. మొదటి షెడ్యూల్లోనే సాంగ్స్ చిత్రీకరణ పూర్తిచేయనున్నట్లు టాక్. కాగా, మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ కెరీర్లో రెగ్యులర్ షూట్ ప్రారంభంకాకముందే మూడు సాంగ్స్ రికార్డ్ చేయడం ఇదే మొదటిసారి.
గుజరాత్ వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆ రాష్ట్రానికి నాడు సీఎంగా ఉన్న మోదీకి సాయపడినట్లు NCP(SP) చీఫ్ శరద్ పవార్ వెల్లడించారు. ‘వ్యవసాయ పద్ధతులు తెలుసుకునేందుకు ఇజ్రాయెల్లో పర్యటించాలని అనుకుంటున్నట్లు కోరితే వెంట తీసుకెళ్లాను. ఇప్పుడు మోదీ చేసే వ్యాఖ్యలను నేను పట్టించుకోను’ అని తెలిపారు. కాగా కేంద్ర వ్యవసాయ మంత్రిగా పవార్ ఏం చేయలేదని మోదీ ఇటీవల విమర్శించారు.
AP: చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి ఘటనలో నిందితులకు తిరుపతి ఏడీజే కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో మొత్తం 13మందిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా వారందరికీ 14 రోజులు రిమాండ్ విధించింది. నిందితులను పోలీసులు చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. ఈ నెల 14న పద్మావతి యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన నానిపై దాడి జరిగిన విషయం తెలిసిందే.
AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజులు వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, కృష్ణా, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పింది.
ఏపీలో ఇసుక తవ్వకాలపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘కేంద్ర పర్యావరణ శాఖ తరచూ తనిఖీలు చేపట్టాలి. ఆ సమాచారం రాష్ట్ర అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మైనింగ్ ప్రదేశాల్లో కలెక్టర్లు తనిఖీ చేయాలి. నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’ అని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 15కి వాయిదా వేసింది.
పాకిస్థాన్ నుంచి సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి భారత్లోకి చొరబడాలని ప్రయత్నించిన ఉగ్రవాదుల కుట్రను సైన్యం అడ్డుకుంది. కుప్వారా జిల్లాలోని తాంగ్ధర్ సెక్టార్ వద్ద చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ముష్కరులను సైన్యం మట్టుపెట్టింది. మరోవైపు ఆ ప్రాంతంలో జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. చుట్టపక్కల ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ హన్సల్ మెహతా మరో కొత్త వెబ్ సిరీస్ ప్రకటించారు. సహారా ఫౌండర్ సుబ్రతా రాయ్ కథ ఆధారంగా ‘స్కాం 2010’ తెరకెక్కించబోతున్నట్లు వెల్లడించారు. గతంలో ఈయన భారత స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టించిన హర్షద్ మెహతా కథ ఆధారంగా తీసిన ‘స్కాం 1992’ సూపర్ హిట్టయింది. ఆ తర్వాత స్టాంప్ పేపర్ల మోసాలపై ‘స్కాం 2003’ తీశారు. అది కూడా మంచి పేరు తెచ్చుకుంది.
హైదరాబాద్లో వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండ కాయగా.. మధ్యాహ్నానికి నగరాన్ని మబ్బులు కమ్మేశాయి. కొండాపూర్, కూకట్పల్లి, నిజాంపేట్, బాచుపల్లి, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. హైదరాబాద్ శివారు వికారాబాద్లో మోస్తరు వర్షం కురుస్తోంది.
AP: అధికార పార్టీ కోసం పనిచేసిన అధికారులు, పోలీసులకు శిక్ష తప్పదని టీడీపీ నేత వర్ల రామయ్య హెచ్చరించారు. కొన్ని పోలీస్ స్టేషన్లలో FIRలు, కేసు ఫైళ్లు తగలబెడుతున్నారని ఆరోపించారు. అనుభవజ్ఞుడి పాలన కోసం ప్రజలంతా ఓటు వేశారని, మార్పు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే అన్నీ సమీక్ష చేయిస్తామని తెలిపారు. తప్పులు చేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయొద్దన్నారు.
Sorry, no posts matched your criteria.