News May 16, 2024

టెట్ హాల్‌టికెట్ల విడుదలలో జాప్యం.. నేడు అందుబాటులోకి

image

TS TET హాల్ టికెట్లు నేడు అందుబాటులోకి వస్తాయని అధికారులు <>వెబ్‌సైట్‌లో<<>> పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం నిన్న విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల జారీ చేయలేదని తెలుస్తోంది. హాల్ టికెట్ల కోసం రాత్రి వరకు అభ్యర్థులు పడిగాపులు కాశారు. విడుదల చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. కాగా టెట్ పరీక్షలు ఈనెల 20 నుంచి జూన్ 2 వరకు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి.

News May 16, 2024

నేటి మ్యాచ్: గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు SRH

image

నేడు ఉప్పల్ స్టేడియంలో గుజరాత్‌ జట్టుపై SRH గెలిస్తే 16 పాయింట్లు దక్కించుకుంటుంది. కేకేఆర్, ఆర్ఆర్ ఇప్పటికే క్వాలిఫై అయ్యాయి. ప్లే ఆఫ్స్‌‌లో స్థానం కోసం పోరాడుతున్న మిగతా జట్లలో కేవలం సీఎస్కే మాత్రమే 16 పాయింట్లకు చేరగలదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఈరోజు గెలిచి సునాయాసంగా ప్లే ఆఫ్స్‌ వెళ్లాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడిన SRHకు 14 పాయింట్లు ఉన్నాయి.

News May 16, 2024

ఏపీ ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు

image

AP: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో పందేలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుంది? నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల వారీగా ఏ పార్టీకి ఎంత లీడ్ వస్తుంది? అన్న అంశాలపై జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. కొంత మంది సర్వే నివేదికలను రివ్యూ చేసుకుని పందేల్లో పాల్గొంటున్నారు.

News May 16, 2024

నేటి నుంచి EAPCET.. రూల్స్ ఇవే..

image

AP: నేటి నుంచి ఈ నెల 23 వరకు ఈఏపీసెట్ జరగనుంది. రోజూ ఉ.9 నుంచి మ.12 వరకు, మ.2.30 నుంచి సా.5.30 వరకు రెండు సెషన్లలో ఎగ్జామ్స్ ఉంటాయి. *విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పర్మిషన్ ఉండదు.
*సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. అవి దొరికితే డిబార్ చేస్తారు.
*బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవద్దు.
*160 ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కులు లేవు.

News May 16, 2024

రాజస్థాన్‌ అలా.. ఆర్సీబీ ఇలా..!

image

నిన్న రాత్రి పంజాబ్‌పై ఓటమితో కలిపి RR జట్టు వరుసగా 4 మ్యాచులు ఓడింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో తొలి అర్ధభాగంలో ఓటమే లేని ఆ జట్టు ఇలా పరాజయాలపాలవ్వడం ఆశ్చర్యమే. అటు RCB జట్టుది మరో కథ. భారీ ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఆ జట్టు 5 వరుస విజయాలతో ఇప్పుడు ఏకంగా ప్లే ఆఫ్స్‌పై కన్నేసింది. ఆసక్తికరమేంటంటే.. SRHపై ఓటమి అనంతరం RR మళ్లీ గెలవలేదు. SRHపై గెలుపు తర్వాత RCB ఓడలేదు!

News May 16, 2024

బీజేపీకి మళ్లీ అధికారమంటే ఆ వర్గాలకు ద్రోహమే: ఖర్గే

image

బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమంటే దళితులు, గిరిజనులు, పేదలు, రైతులకు ద్రోహం చేసినట్లేనని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. ‘ప్రజలకు ఆహారం, ఉద్యోగాలు దొరకడం లేదు. కానీ ప్రధానికి తన పదవి తప్ప ఇంకేం పట్టవు. సోనియమ్మ తృణప్రాయంగా వదిలేసిన ఆ అధికారంపైనే బీజేపీ వాళ్ల చూపు ఉంది. అలాంటివారిని మళ్లీ అధికారంలోకి తీసుకురాకూడదు’ అని రాయబరేలిలో తేల్చిచెప్పారు.

News May 16, 2024

చైనాకు చేరుకున్న పుతిన్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం చైనాకు చేరుకున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధంతో పాటు వివిధ అంశాల్లో చైనా మద్దతును కోరుతూ ఆయన ఈ పర్యటన చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇది పుతిన్ చేపట్టిన తొలి పర్యటనే కాక గడచిన 6 నెలల్లో చైనాకు రెండో పర్యటన కావడం గమనార్హం. ఆయన 2రోజుల పాటు పర్యటిస్తారని, ఇరు దేశాల మైత్రిని ఇది మరింత బలోపేతం చేస్తుందని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి.

News May 16, 2024

సీఎం క్యాంప్ ఆఫీస్‌గా లేక్‌వ్యూ గెస్ట్ హౌస్?

image

TG: రాజ్‌భవన్ రోడ్డులోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌ను సీఎం రేవంత్ క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. సీఎం అయినప్పటి నుంచీ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచే రేవంత్ పాలన సాగిస్తున్నారు. సమావేశాలకు ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుండటంతో ‘లేక్‌ వ్యూ’ని వాడాలని ఆయన యోచిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జూన్ 2 తర్వాత ఆ భవనాన్ని ఏపీ నుంచి రాష్ట్ర సర్కారు స్వాధీనం చేసుకోనుంది.

News May 16, 2024

భారత్‌లో పట్టణ నిరుద్యోగం తగ్గింది: NSSO

image

భారత పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ శాతం గత ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంతో(6.8శాతం) పోలిస్తే ఈ ఏడాది అదే కాలవ్యవధికి(6.7శాతం) తగ్గిందని జాతీయ శాంపిల్ సర్వే(NSSO)లో తేలింది. పురుషులు, మహిళల్ని విడిగా చూస్తే.. మహిళల నిరుద్యోగం అప్పుడు 9.2శాతం నుంచి ఈ ఏడాది 8.5శాతానికి దిగిందని పేర్కొంది. పురుషుల విషయంలో మాత్రం అప్పుడు 6శాతం నుంచి ఏడాది 6.1 శాతానికి పెరిగిందని వివరించింది.

News May 16, 2024

ఇక శ్రీలంకలోనూ ఫోన్ పే!

image

యూపీఐ లావాదేవీ సంస్థ ఫోన్ పే శ్రీలంకలో సేవల్ని ప్రారంభించింది. శ్రీలంకలోని భారత హైకమిషన్ ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించింది. అక్కడికి వచ్చే భారతీయులకు ఇది మరింత సౌలభ్యాన్ని కల్పిస్తుందని తెలిపింది. శ్రీలంకలోని లంకాపేతో కలిసి తాము ఆపరేట్ చేస్తున్నట్లు ఫోన్ పే ప్రకటించింది. భారతీయులు వారి ఫోన్ పే యాప్‌తో లంకాపే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పే చేయొచ్చని, నగదును వెంటే తీసుకెళ్లనక్కర్లేదని పేర్కొంది.