India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్ మంగళవారం వెల్లడించారు. అయితే కచ్చితమైన తేదీలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పుతిన్ పర్యటన దోహదపడనుంది. ఇటీవల బ్రిక్స్ సదస్సు కోసం మోదీ రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే.

TG: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని BJP MP ఈటల రాజేందర్ విమర్శించారు. వరంగల్‌లో ప్రభుత్వం జరుపుకుంటున్న ఏడాది సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. హామీల అమలుపై చర్చకు రేవంత్ సవాల్ స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ చర్చకు ప్రధాని అవసరం లేదని, ఎక్కడికి రావాలో చెబితే తాను వస్తానని చెప్పారు.

AP: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు దానిని మళ్లీ నిర్మించాలంటే రూ.990 కోట్లు అవసరమని చెప్పారు. ‘గతంలో మేం అధికారంలో ఉన్నప్పుడు 72 శాతం పనులు చేశాం. కానీ వైసీపీ ఐదేళ్లలో 3.8 శాతం పనులే చేసింది. పోలవరమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

TG: కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. వారిని రెగ్యులరైజ్ చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.16ను హైకోర్టు కొట్టేసింది. వారి రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. దీంతో ఇకపై వారంతా తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగే అవకాశం ఉంది. విద్య, వైద్య శాఖల్లో వేలాది మంది ఉద్యోగులు రెగ్యులరైజ్ కాగా, హైకోర్టు తీర్పుతో వారిలో ఆందోళన నెలకొంది.

TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, A2గా ఉన్న సురేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడిని కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఇప్పటికే A1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు పరిగి DSPపై బదిలీ వేటుతో పాటు పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేశారు.

AP: పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఓ గేమ్ ఛేంజర్ అని CM చంద్రబాబు అన్నారు. ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి వెన్నెముక, జీవనాడి అని చెప్పారు. ‘నదుల అనుసంధానం రాష్ట్రానికి ముఖ్యం. గతంలో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాను గోదావరికి అనుసంధానం చేశాం. దీని ద్వారా మిగులు జలాలను రాయలసీమకు తరలించాం. 7 మండలాలు APలో కలపకపోయి ఉంటే పోలవరం ఎప్పటికీ కష్టమే. అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు’ అని పేర్కొన్నారు.

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో నిర్వహించాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం వీడలేదు. ఆ దేశంలో ఆడేందుకు బీసీసీఐ నో చెప్పగా, హైబ్రిడ్ విధానంపై పాక్ బోర్డ్ మౌనం పాటిస్తోంది. దీనిపై స్పష్టత తెచ్చేందుకు రంగంలోకి దిగిన ఐసీసీ, ఈవెంట్ జరగాల్సిన పాకిస్థాన్‌తో పాటు మిగతా జట్ల బోర్డులతో చర్చలు జరుపుతోంది. ఈ వారంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌పై క్లారిటీ వస్తుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరి 40 నిమిషాల్లో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగారు. అంతకుముందు ఉదయం సెన్సెక్స్ 1,000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్ల లాభంతో దూసుకుపోయాయి. అయితే, చివర్లో అనూహ్యంగా పెరిగిన అమ్మకాలతో సెన్సెక్స్ కేవలం 239 పాయింట్ల లాభంతో 77,578 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 23,518 వద్ద స్థిరపడ్డాయి.

మంచి బిజినెస్ ఐడియా ఉంది. కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసేంత డబ్బు లేదు. అయినా, అతనేం ఊరుకోలేదు. బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఇన్వెస్టర్ కోసం వెతకడం మొదలుపెట్టారు. ‘హాయ్ ప్యాసింజర్స్. నా పేరు సామ్యూల్ క్రిస్టీ. నేను గ్రాడ్యుయేట్‌ని. నా స్టార్టప్ బిజినెస్ కోసం ఫండ్ రైజ్ చేస్తున్నా. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడండి’ అని ఆటోలో పోస్టర్‌లో అంటించారు. ఇది ఫొటో తీసి ఓ నెటిజన్ పోస్ట్ చేయగా వైరలవుతోంది.

AUS గడ్డపై కోహ్లీ విజయవంతమైన ప్లేయర్ అని ఆ టీమ్ మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ చెప్పారు. 13 టెస్ట్ మ్యాచ్‌లలో 6 సెంచరీలు చేశారని గుర్తుచేశారు. ‘అతను పరుగుల దాహంతో ఉన్నారు. ఈసారి BGTలో మెరుగ్గా రాణిస్తారని భావిస్తున్నా. ఒక ఆస్ట్రేలియన్‌గా కోహ్లీని సైలెంట్(త్వరగా ఔట్ చేయడం)గా ఉంచాలని కోరుకుంటా. అతను తొలి గేమ్‌లో రన్స్ సాధిస్తే సిరీస్ అంతా ప్రభావం చూపుతారు. విరాట్‌కు పోరాటం ఇష్టం’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.