News November 19, 2024

ఆఖ‌రి 40 నిమిషాల్లో కూల్చేశారు

image

దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగ‌ళ‌వారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివ‌రి 40 నిమిషాల్లో ఇన్వెస్ట‌ర్లు భారీగా అమ్మ‌కాలకు దిగారు. అంత‌కుముందు ఉద‌యం సెన్సెక్స్ 1,000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్ల లాభంతో దూసుకుపోయాయి. అయితే, చివర్లో అనూహ్యంగా పెరిగిన అమ్మ‌కాల‌తో సెన్సెక్స్ కేవ‌లం 239 పాయింట్ల లాభంతో 77,578 వ‌ద్ద‌, నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 23,518 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి.

Similar News

News December 6, 2024

పుష్ప-2 డైలాగ్స్.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు

image

అల్లు రామలింగయ్య, మెగాస్టార్ కుటుంబాలు రెండు కాదు ఒక్కటేనని ఏపీ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చెప్పారు. వాళ్లు స్వయంకృషితో ఎదిగారు తప్ప కుటుంబం పేరు వాడుకోలేదన్నారు. ఇప్పుడు పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగులకు పెడార్థాలు తీసి అభిమానుల్లో అగ్గి రాజేసే పనిలో వైసీపీ శ్రేణులు, పెయిడ్ ఎనలిస్టులు ఉన్నారని ఆరోపించారు. సినిమాను సినిమాగానే చూడాలని, వారి ట్రాప్‌లో పడొద్దని సూచించారు.

News December 6, 2024

అంబేడ్కర్ కీర్తిని చాటేందుకు కృషి చేశాం: KCR

image

TG: అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా BRS అధినేత KCR ఆయన సేవలను స్మరించుకున్నారు. ‘సమసమాజ నిర్మాణ దార్శనికుడు అంబేడ్కర్. వివక్షకు వ్యతిరేకంగా జీవితకాలం పోరాడారు. ఆయన కీర్తిని ప్రపంచానికి చాటేందుకు కృషి చేశాం. అణగారిన వర్గాలకు సమన్యాయం దక్కేలా అంబేడ్కర్ చేసిన కృషి మరువలేనిది. ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 తెలంగాణ ఏర్పాటుకు మార్గం చూపింది’ అని KCR గుర్తుచేసుకున్నారు.

News December 6, 2024

ఐశ్వర్య-అభిషేక్.. విడాకుల వార్తలకు ఫుల్‌స్టాప్?

image

తాము విడిపోనున్నామని వస్తున్న వార్తలకు బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ తాజాగా ఫొటోలతో జవాబిచ్చారు. గురువారం రాత్రి జరిగిన ఓ పార్టీలో పలు సెల్ఫీలతో ఆ రూమర్లకు వారు ఫుల్‌స్టాప్ పెట్టినట్లైంది. ఐశ్వర్య, అభిషేక్ 17 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అభిషేక్ మరో నటితో సన్నిహితంగా ఉంటున్నారని, ఐష్ నుంచి విడిపోనున్నారని గత కొంతకాలంగా బీటౌన్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి.