News May 15, 2024

తారక్ బర్త్ డే.. ‘దేవర’ నుంచి సాంగ్ రిలీజ్?

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అభిమానుల్లో జోష్ నింపేందుకు ‘దేవర’ మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బర్త్ డే గిఫ్ట్‌గా సినిమా టైటిల్ సాంగ్‌ లేదంటే టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఎక్కువ శాతం సాంగ్ రిలీజ్‌కే మేకర్స్ మొగ్గుచూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అనిరుధ్ అందించిన మ్యూజిక్‌కు సాంగ్ అదిరిపోతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. NTR సరసన జాన్వీకపూర్ నటిస్తున్నారు.

News May 15, 2024

రేపు మహారాష్ట్రకు చంద్రబాబు

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు మహారాష్ట్రకు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం షిరిడి సాయిబాబాను దర్శించుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

News May 15, 2024

అల్లర్లు సృష్టించిన వారిని గుర్తించాం: ముకేశ్

image

ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌ల వద్ద అల్లర్లు సృష్టించిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సీసీ కెమెరాల్లో అంతా రికార్డయిందని, దాడులు చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. తాడిపత్రి, నరసరావుపేటలో ఘర్షణ వాతావరణం నెలకొందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 715 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామన్న ముకేశ్ కుమార్.. నాలుగు చోట్ల 144 సెక్షన్ విధించామన్నారు.

News May 15, 2024

అత్యధిక పోలింగ్ నమోదైన నియోజకవర్గం ఇదే..

image

AP: దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91 శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ‘తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32 శాతం నమోదైంది. 3500 కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. కొన్నిచోట్ల అర్ధరాత్రి 2 వరకు పోలింగ్ కొనసాగింది. పార్లమెంట్‌కి 3,33,40,560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు’ అని తెలిపారు.

News May 15, 2024

పోలింగ్.. దేశంలోనే AP టాప్: ముకేశ్ కుమార్

image

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన 4 దశల పోలింగ్‌లో దేశంలోనే అత్యధిక ఓటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో నమోదైందని సీఈవో ముకేశ్ కుమార్ మీనా అన్నారు. రాష్ట్రంలో మొత్తం 81.86శాతం ఓట్లు పోలైనట్లు ఆయన వెల్లడించారు. ఈవీఎంల ద్వారా 80.66శాతం, మిగితా ఓట్లు బ్యాలెట్ పేపర్ల ద్వారా పడినట్లు తెలిపారు. 2014లో 78.41%, 2019లో 79.77% పోలింగ్ నమోదైందన్నారు.

News May 15, 2024

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు సెబీ ఊరట

image

కేవైసీ నమోదుపై మ్యూచువల్ ఫండ్‌ పెట్టుబడిదారులకు SEBI ఊరట కల్పించింది. కేవైసీ నమోదుకు పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరని గతంలో ఉన్న నిబంధనను తొలగించింది. గతంలో ఈ రెండూ లింక్ కాకుంటే కేవైసీ రిజిస్ట్రేషన్ హోల్డ్‌లో ఉండేది. అయితే తాజా మినహాయింపుతో కేవైసీ రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతుందని, ‘కేవైసీ వ్యాలిడేటెడ్’ స్టేటస్ రావాలంటే ఆధార్-పాన్ లింక్ చేయాల్సిందేనని నిపుణులు తెలిపారు.

News May 15, 2024

తిరుమలలో చిరుత కలకలం

image

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో ఇవాళ తెల్లవారుజామున భక్తుల కారుకు చిరుత అడ్డుగా వచ్చింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన టీటీడీ భద్రతా సిబ్బందిని అలర్ట్ చేసింది.

News May 15, 2024

కేంద్రమంత్రికి మాతృవియోగం

image

కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తల్లి మాధవీరాజే సింధియా మృతి చెందారు. న్యుమోనియాతో బాధపడుతోన్న ఆమె 3 నెలలుగా ఢిల్లీలోని AIIMSలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ X ద్వారా వెల్లడించారు. కాగా సింధియా మధ్యప్రదేశ్‌లోని గునా పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

News May 15, 2024

మోదీVsరాహుల్.. ఎవరు రిచ్?

image

LS ఎన్నికల్లో పోటీ చేస్తున్న మోదీ, రాహుల్ గాంధీ తమ ఆస్తుల వివరాలు వెల్లడించారు. మోదీ ₹3.02కోట్ల ఆస్తులున్నాయని, సొంతకారు, ఇల్లు లేదని తెలిపారు. మరోవైపు తనకు ₹20కోట్ల ఆస్తులున్నట్లు రాహుల్ వెల్లడించారు. తనకు సొంతిల్లు లేదని, రూ.49.7లక్షల అప్పుందన్నారు. మోదీ గుజరాత్ యూనివర్సిటీ నుంచి 1983లో మాస్టర్స్ పూర్తి చేయగా.. రాహుల్ 1995లో కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ నుంచి డెవలప్‌మెంట్ స్టడీస్‌లో ఎంఫిల్ చేశారు.

News May 15, 2024

గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర

image

తిరుపతిలో జరిగే తాతయ్యగుంట గంగమ్మ జాతర ఇవాళ ప్రారంభమైంది. 900 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ జాతరను ఏటా 7 రోజులపాటు నిర్వహిస్తారు. ఈసారి మే 15 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నారు. కైకాల వంశస్థులు జాతరను చాటింపుతో ప్రారంభించడం ఇక్కడ ఆనవాయితీ. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మను భక్తులు తిరుమల శ్రీవారి చెల్లెలిగా కొలుస్తారు. వివిధ వేషాల్లో దేవతను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. జాతర టైమ్‌లో ఊరు విడిచి ఎటూ వెళ్లరు.