News November 18, 2024

పవన్ కళ్యాణ్‌పై MIM కార్యకర్త ఫిర్యాదు

image

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై MIM కార్యకర్త ‘X’లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారంటూ పవన్ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. HYDలో 2దశాబ్దాలుగా మతపరమైన గొడవలు జరగలేదని, పవన్‌ తాజా వ్యాఖ్యలు అవమానకరమని రాసుకొచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సమాధానమిచ్చారు.

News November 18, 2024

GREAT: కంటిచూపు లేకపోయినా గ్రూప్-4 జాబ్

image

ఖమ్మం జిల్లా కారేపల్లి(M) చీమలవారిగూడెంకు చెందిన మానస అంధురాలు. టెన్త్ వరకు గ్రామంలో, అనంతరం ఫ్రెండ్స్ సాయంతో కారేపల్లికి 4KM నడిచి వెళ్లి ఇంటర్, డిగ్రీ చదివారు. ఇంటి వద్దే ప్రిపేరై 2022లో బ్యాంక్ జాబ్ సాధించిన మానస.. సహాయకురాలి చేయూతతో గ్రూప్-4 పరీక్ష రాశారు. తన కృషికి ఫలితాల్లో జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. తపన ఉంటే లక్ష్యసాధన కష్టం కాదని మానస నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

News November 18, 2024

అది మంచి పద్ధతి కాదు: RBI గవర్నర్ వార్నింగ్

image

బ్యాంకులు తప్పుడు లేదా అరకొర సమాచారంతో కస్టమర్లకు ప్రొడక్ట్స్ విక్రయించడంపై RBI గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఈ విధానంతో షార్ట్ టర్మ్‌లో లాభపడినా లాంగ్‌టర్మ్‌లో నష్టపోతారని హెచ్చరించారు. KYC వెరిఫికేషన్ కాకుండా అకౌంట్లు తెరవడం, మిస్ సెల్లింగ్ వంటి అనైతిక పద్ధతులను అడ్డుకోవాలన్నారు. వీటికి తావులేకుండా స్టాఫ్ ఇన్సెంటివ్స్‌ను రూపొందించాలని సూచించారు.

News November 18, 2024

లగచర్ల ఘటనలో పంచాయతీ సెక్రటరీ సస్పెండ్

image

TG: లగచర్ల ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు, రైతులను రెచ్చగొట్టారని దౌల్తాబాద్(M) సంగయ్యపల్లి పంచాయతీ సెక్రటరీ రాఘవేందర్‌ను వికారాబాద్ కలెక్టర్ సస్పెండ్ చేశారు. దాడి సమయంలో ఇతను కీలకంగా ఉన్నట్లు పోలీసుల వద్ద ఆధారాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాఘవేందర్ రిమాండ్‌లో ఉండగా, మరిన్ని కేసుల నమోదుకు అవకాశం ఉంది. ఈ కేసులో A1 పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కాగా, A2 సురేశ్ పరారీలో ఉన్నారు.

News November 18, 2024

ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీకి అర్హత.. కారణం ఇదే

image

AP: గత మూడు దశాబ్దాల్లో జనాభా నియంత్రణకు తీసుకున్న చర్యలతో సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోయిందని ప్రభుత్వం తెలిపింది. 2001లో 2.6 నుంచి 1.5కు తగ్గిందని.. జనన, మరణాల నిష్పత్తిలో ఏపీ బాగా వెనుకబడిందని పేర్కొంది. ఇదే సమయంలో వృద్ధుల జనాభా రేటు ఎక్కువగా ఉందని తెలిపింది. అందుకే తాజాగా స్థానిక ఎన్నికల్లో <<14644385>>ఎంత మంది పిల్లలు<<>> ఉన్నా పోటీకి అర్హత కల్పిస్తున్నట్లు వివరించింది.

News November 18, 2024

వామ్మో.. రోజూ 40 సిగరెట్ల కాలుష్యాన్ని పీలుస్తున్నారు

image

ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం కలవరపెడుతోంది. అక్కడ ఒక్కో వ్యక్తి రోజూ సగటున 40 సిగరెట్లు తాగినంత పొల్యూషన్‌ను పీలుస్తున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. ఆ తర్వాత హరియాణా(29), బిహార్(10), UP(9.5), రాజస్థాన్‌, బెంగాల్, ఒడిశా(7.5), MP(5.5) ఉన్నాయి. లద్దాక్, లక్షద్వీప్ 0, ఈశాన్య రాష్ట్రాలు, J&K, కర్ణాటక, హిమాచల్, కేరళ 0.5-1, AP, TG ప్రజలు రెండు సిగరెట్ల కాలుష్యాన్ని పీలుస్తున్నారు.

News November 18, 2024

కొత్తగూడెం, రామగుండం ఎయిర్‌పోర్టులకు లైన్ క్లియర్

image

TG: ఏడాదిలోగా వరంగల్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తామని, కొత్తగూడెం, రామగుండం ఎయిర్‌పోర్టులకు లైన్ క్లియర్ అయినట్లు మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్- వరంగల్ రోడ్డు విస్తరణకు కేంద్రం అంగీకారం తెలిపిందని చెప్పారు. ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి వరకు ఉన్న ఫ్లై ఓవర్ పనులను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. ఉప్పల్- మేడిపల్లి ఫ్లైఓవర్ పనులు మరో ఏడాదిలో పూర్తవుతాయని సెక్రటేరియట్‌లో చెప్పారు.

News November 18, 2024

మరో 500 SBI బ్రాంచీలు: నిర్మల

image

FY25 చివరికి మరో 500 SBI బ్రాంచీలను ప్రారంభిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఆ సంఖ్య 23,000లకు చేరుకుంటుందని తెలిపారు. దేశంలో SBIకి 50crకు పైగా కస్టమర్లు ఉన్నారని, మొత్తం డిపాజిట్లలో 22.4% వాటా ఉందని చెప్పారు. రోజుకు 20cr UPI లావాదేవీలను నిర్వహిస్తోందన్నారు. ముంబైలోని SBI ప్రధాన కార్యాలయం వందో వార్షికోత్సవం సందర్భంగా రూ.100 స్మారక నాణెంను ఆమె ఆవిష్కరించారు.

News November 18, 2024

గుడ్‌న్యూస్: టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు తేదీని విద్యాశాఖ మరోసారి <>పొడిగించింది.<<>> ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 26 వరకు చెల్లించవచ్చు. రూ.50 ఫైన్‌తో DEC 2 వరకు, రూ.200 జరిమానాతో DEC 9 వరకు, రూ.500 అదనపు రుసుముతో DEC 16 వరకు అవకాశం ఉంది. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125, 3 సబ్జెక్టుల లోపు రూ.110, ఒకేషనల్ స్టూడెంట్స్ రూ.60 అదనంగా చెల్లించాలి.

News November 18, 2024

అరెస్టులకు భయపడేవారు లేరిక్కడ: KTR

image

TG: రాష్ట్రంలో ప్రశ్నిస్తే సంకెళ్లు, నిల‌దీస్తే అరెస్టులు చేస్తున్నారని రేవంత్ ప్రభుత్వంపై KTR మండిపడ్డారు. ‘నియంత రాజ్యమిది, నిజాం రాజ్యాంగ‌మిది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొణతం దిలీప్‌ను అరెస్ట్ చేశారు. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావు. నీ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవరూ లేరిక్కడ’ అని KTR ట్వీట్ చేశారు.