News November 18, 2024
లగచర్ల ఘటనలో పంచాయతీ సెక్రటరీ సస్పెండ్
TG: లగచర్ల ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు, రైతులను రెచ్చగొట్టారని దౌల్తాబాద్(M) సంగయ్యపల్లి పంచాయతీ సెక్రటరీ రాఘవేందర్‌ను వికారాబాద్ కలెక్టర్ సస్పెండ్ చేశారు. దాడి సమయంలో ఇతను కీలకంగా ఉన్నట్లు పోలీసుల వద్ద ఆధారాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాఘవేందర్ రిమాండ్‌లో ఉండగా, మరిన్ని కేసుల నమోదుకు అవకాశం ఉంది. ఈ కేసులో A1 పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కాగా, A2 సురేశ్ పరారీలో ఉన్నారు.
Similar News
News December 10, 2024
పొద్దున్నే లెమన్ వాటర్ తాగుతున్నారా..
పరగడపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని సేవించడం చాలామందికి అలవాటు. దానిని తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. కాపర్, అల్యూమినియం గ్లాసుల్లో దీనిని తీసుకోవద్దు. పులుపు ఆ లోహాలను కరిగిస్తుంది. దాంతో అవి రక్తంలో కలవొచ్చు. చర్మ సమస్యలుంటే పుల్లని పానీయాలు తీసుకోవద్దు. ఎసిడిటీ ఉంటే అది మరింత ఎక్కువ కావొచ్చు. లెమన్ వాటర్‌ను వెంటనే తాగకపోతే విటమిన్-సి తగ్గిపోవచ్చు.
News December 10, 2024
మా కుటుంబ సమస్యలకు త్వరలోనే పరిష్కారం: మంచు విష్ణు
తమ కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయని, త్వరలోనే అన్నీ పరిష్కారం అవుతాయని మంచు విష్ణు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదని అన్నారు. మోహన్ బాబు, మనోజ్ మధ్య వివాదం జరగగా, ఇరువురూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో <<14837635>>కేసులు నమోదైన<<>> సంగతి తెలిసిందే.
News December 10, 2024
షమీని వెంటనే ఆస్ట్రేలియాకు పంపండి: పాక్ మాజీ క్రికెటర్
భారత జట్టుకు మహ్మద్ షమీ సేవలు ఎంతో అవసరమని పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ అన్నారు. వెంటనే ఆయనను ఆస్ట్రేలియా పంపాలని సూచించారు. ‘షమీని ఆడించాలనుకుంటే దయచేసి ఇప్పుడే పంపండి. మూడో టెస్టులోనే ఆయనను ఆడించండి. నాలుగో టెస్టుకు ఆడిస్తే లాభం ఉండదు. భారత పేసర్ల బృందాన్ని ముందుండి నడిపిస్తారు’ అని ఆయన పేర్కొన్నారు. కాగా BGTలో చివరి రెండు టెస్టులకు షమీ ఎంపికవుతారని టాక్.