India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో హోంగార్డులకు భారీ ఊరట లభించింది. తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా వారికి దేహదారుఢ్య, తుది రాత పరీక్షలకు అనుమతించాలని APSLPRBని కోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

AP: సోషల్ మీడియా పోస్టుల విషయంలో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు 41-A నోటీసులు అంటించారు. విచారణకు రావాలని పేర్కొంటూ నోటీసులిచ్చేందుకు వెళ్లగా ఆయన అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం రాఘవరెడ్డి కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. వర్రా రవీంద్రా రెడ్డి కేసులో ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వివేక్‌లకు నోటీసులు జారీ చేశారు.

ఒక్కరు కాస్త నలుగురం అయ్యామని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఒకరు WPLకు, మరొకరు IPLకు పనికి వస్తారని కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇవాళ రోహిత్-రితిక దంపతులకు మగ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరికి కూతురు సమైరా ఉన్నారు.

నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో బరువు కోల్పోతున్నారని ఆందోళనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోదసిలో ఉండేవారు ఎంత తింటారన్న ప్రశ్నకు నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటంటే.. రోదసిలో గురుత్వాకర్షణ లేమి కారణంగా కండరాలు, ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. దీన్ని తట్టుకునేందుకు వ్యోమగాములు రోజూ 4వేల క్యాలరీలుండే డైట్ తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది.

TG: ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడి మరణంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. అలాగే వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అటు ఏపీ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేశ్, అచ్చెన్నాయుడు, నారాయణ, సవిత కూడా రామ్మూర్తినాయుడి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తమిళ హీరో ధనుష్ తనకు <<14626837>>లీగల్<<>> నోటీసులు పంపడంపై హీరోయిన్ నయనతార చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరలవుతోంది. ఆమె చేసిన పోస్ట్‌పై ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీమణులు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, రియా, అంజు కురియన్, ఐశ్వర్య లక్ష్మి, నజ్రియా, గౌరి జీ కిషన్ ఆమె పోస్ట్‌ను లైక్ చేశారు. నటి పార్వతి ఆ పోస్ట్‌ను తన ఇన్‌స్టా స్టోరీగా షేర్ చేశారు. కాగా, ఇందులో కొందరు ధనుష్‌తో నటించినవారున్నారు.

జీవితంలో గుర్తుంచుకోవాల్సిన 4 విషయాలు అంటూ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఓ వీడియోను ట్వీట్ చేశారు. అవి.. నువ్వు కరెక్ట్ అయితే, దానిని ఇతరులకు నిరూపించేందుకు సమయాన్ని వేస్ట్ చేయకు. నువ్వు తప్పు అయితే, కరెక్ట్ అని అనిపించుకునేందుకు ప్రయత్నించకు. ఒకవేళ నీకు ఏదైనా అవసరం ఉంటే సహాయం అడిగేందుకు సమయాన్ని వృథా చేయకు. ఎప్పుడూ గుర్తుంచుకో, జీవితం చాలా చిన్నది.. బాధ, నెగటివిటీపై ఉన్న సమయాన్ని వృథా చేయకు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డట్లు తెలుస్తోంది. ఇండియా-ఏతో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా స్లిప్‌లో క్యాచ్ పడుతుండగా అతడి వేలికి గాయమైనట్లు సమాచారం. గాయం తీవ్రత వల్ల NOV 22 నుంచి జరగనున్న BGT తొలి టెస్ట్‌కు గిల్ దూరమయ్యే అవకాశం ఉందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తెలిపింది. దీనిపై BCCI అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోకి తనను అనుమతించకపోవడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసహనం చెందారు. తమ నేత రాహుల్‌గాంధీకీ నిన్న ఇలాగే జరిగిందన్నారు. తమ ఇద్దరికీ క్యాబినెట్ హోదా ఉందన్నారు. టాయిలెట్‌నూ PM మోదీకే రిజర్వు చేస్తారా అని ప్రశ్నించారు. ఏ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారో మాత్రం ఆయన చెప్పలేదు. నేడు ఖర్గే, HM అమిత్‌షా ఝార్ఖండ్‌లో పర్యటిస్తున్నారు. షా వస్తున్నారనే తనను అడ్డుకున్నట్టు ఖర్గే ఆరోపణ.

ఓపెన్ ఏఐపై టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ దావా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ దావాలోకి మైక్రోసాఫ్ట్‌ను, వెంచర్ క్యాపిటలిస్ట్ రీడ్ హాఫ్‌మ్యాన్‌ను చేర్చారు. ఒకప్పుడు ఆ సంస్థలో ఉన్న మస్క్ 2018లో బయటికొచ్చేశారు. తర్వాత మైక్రోసాఫ్ట్ అందులో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అయితే, తమ పోటీ ఏఐ యాప్‌లలో పెట్టుబడి పెట్టకుండా ఇన్వెస్టర్లను చాట్ జీపీటీ అడ్డుకుంటోందంటూ మస్క్ కోర్టుకెక్కారు.
Sorry, no posts matched your criteria.