News May 1, 2024

భారత జట్టులో నటరాజన్ ఉండాల్సింది: నటుడు శరత్ కుమార్

image

T20 WC కోసం BCCI ఎంపిక చేసిన భారత జట్టుపై నటుడు శరత్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘దేశమన్నా, భారత జట్టన్నా మాకు ఎప్పుడూ ఇష్టమే. కానీ తమిళ పేర్లు లేకపోవడం నిరుత్సాహం కలిగించింది. నటరాజన్ బౌలింగ్ వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం. డెత్ ఓవర్లలో అతడు అద్భుతమైన యార్కర్లు సందిస్తాడు. అతడిని తిరిగి జట్టులోకి తీసుకునేందుకు ఆలస్యం చేయవద్దు’ అంటూ ట్వీట్ చేశారు.

News May 1, 2024

‘పుష్ప-2’ నుంచి మరో పోస్టర్

image

హీరో అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మూవీ నుంచి మేకర్స్ మరో పోస్టర్ విడుదల చేశారు. ఎర్రచందనం దుంగల మధ్య నిలబడ్డ అల్లు అర్జున్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మూవీ నుంచి మేకర్స్ వరుస అప్‌డేట్స్‌ ఇస్తూ అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతున్నారు. ఇక ‘పుష్ప పుష్ప’ అంటూ సాగే పాట ఇవాళ సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. ఈ సాంగ్ సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు.

News May 1, 2024

జనసేన ఉన్నచోట వేరేవారికి ‘గాజు గ్లాసు’ ఇవ్వం: EC

image

AP: స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ఎన్నికల సంఘం స్పందించింది. జనసేన పోటీ చేసే స్థానాల్లో ఇండిపెండెంట్ MP, MLA అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయించట్లేదని హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. గాజు గ్లాసు గుర్తును కొందరు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంపై జనసేన పార్టీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. EC తాజా స్పందనతో విచారణ ముగిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

News May 1, 2024

విరాట్ బాలీవుడ్‌కి అల్లుడు: షారుఖ్

image

విరాట్ కోహ్లీ తమ హిందీ చిత్ర పరిశ్రమకు అల్లుడు వంటివారని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానించారు. ‘విరాట్ అంటే నాకు చాలా ఇష్టం. మా పరిశ్రమకు అల్లుడిగా అభివర్ణిస్తుంటాను. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే తనతోనే నాకు పరిచయమెక్కువ. ఎక్కువ సేపు కలిసి టైం పాస్ చేస్తుంటాం. అనుష్కతో నటిస్తున్న సమయంలో వారి డేటింగ్ గురించి తెలిసింది. నా సినిమాల్లో కొన్ని స్టెప్పులు విరాట్‌కు నేర్పిస్తుంటా’ అని తెలిపారు.

News May 1, 2024

ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్‌కి కష్టమే!

image

IPL ప్లేఆఫ్స్‌లో చోటు కోసం జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున ఉన్న RCB, MI టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే కనిపిస్తోంది. పదేసి మ్యాచ్‌లు ఆడిన ఈ జట్లు చెరో 3మ్యాచుల్లో గెలిచాయి. ఆరేసి పాయింట్లున్నాయి. చెరో 4 మ్యాచులు మిగిలి ఉన్నాయి. 4/4గెలిచినా.. 14 పాయింట్లే అవుతాయి. ప్లేఆఫ్స్‌కి 16పాయింట్స్ కావాలి. రన్‌రేట్ కూడా తక్కువగా (MI: -0.272, RCB: -0.415) ఉంది.

News May 1, 2024

ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

image

ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. వివిధ అరెస్టై జైళ్లలో ఉన్న నాయకులు వర్చువల్ పద్ధతిలో ఎన్నికల ప్రచారం చేయడం కుదరదని తేల్చి చెప్పింది. అత్యంత సాహసోపేతమైందిగా దీన్ని వర్ణించింది. అరెస్టైన నేతలు లోక్‌సభ వర్చువల్‌గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఇలా స్పందించింది. అయితే.. ఈ పిల్ ఎవరు వేశారనేది తెలియరాలేదు.

News May 1, 2024

సీఎం జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ

image

AP: CM జగన్‌కు PCC చీఫ్ వైఎస్ షర్మిల లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. ‘28 పథకాలను ఎందుకు నిలిపేశారు? SC, ST పునరావాసం, దళితులకు భూమి ఇచ్చే కార్యక్రమం ఎందుకు ఆగింది? SC, ST సబ్ ప్లాన్ నిధులు ఎందుకు దారి మళ్లించారు? విదేశీ విద్యకు అంబేడ్కర్ పేరు ఎందుకు తీసేశారు?డ్రైవర్‌ను చంపిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు? స్టడీసర్కిళ్లకు ఎందుకు నిధులు ఇవ్వలేదు? అని ఆమె నిలదీశారు.

News May 1, 2024

మా ఓటమికి అదే కారణం: హార్దిక్

image

తమ ఓటమికి త్వరగా వికెట్లు కోల్పోవడమే ప్రధాన కారణమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నారు. ‘బంతిని సరిగ్గా అంచనా వేయలేక వికెట్లు చేజార్చుకున్నాం. ఈ సీజన్‌లో ఇలానే చాలాసార్లు ఓడిపోయాం. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం. నేహాల్ వధేరా అద్భుత ఆటగాడు. కానీ అతడికి మరిన్ని ఛాన్స్‌లు ఇవ్వలేకపోయాం. భవిష్యత్‌లో వధేరా కచ్చితంగా టీమ్ ఇండియాకు ఆడతారు’ అని ఆయన పేర్కొన్నారు.

News May 1, 2024

ఢిల్లీలో వంద స్కూళ్లకు బాంబు బెదిరింపులు!

image

ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపిన నేపథ్యంలో మరో సంచలన విషయం బయటపడింది. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) పరిధిలోని దాదాపు 100 స్కూళ్లకు ఇలా బెదిరింపులు వచ్చాయట. యాజమాన్యాలకు ఈ-మెయిల్స్ పంపి దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారట. ఇవి రష్యా నుంచి వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా సోమవారం ఢిల్లీలోని పలు ఆస్పత్రులకు సైతం ఇలాగే మెయిల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు.

News May 1, 2024

వడగాలులతో ద్రవ్యోల్బణానికి రెక్కలు!

image

భానుడి ప్రతాపం దేశ ఆర్థిక స్థితిపైనా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వడగాలులతో వ్యవసాయ దిగుబడులు తగ్గొచ్చని, ద్రవ్యోల్బణం 30-50 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో జూన్ వరకు ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుందన్నారు. గ్రామీణ రైతుల ఆదాయం, ఆహార ద్రవ్యోల్బణం, ప్రజల ఆరోగ్యంపై ఈ వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు.