News November 16, 2024
టీ20ల్లో మూడో ఫాస్టెస్ట్ 200 స్కోర్
సౌతాఫ్రికాతో చివరి మ్యాచ్‌లో భారత్ రికార్డ్ సృష్టించింది. టీ20 చరిత్రలో మూడో ఫాస్టెస్ట్ 200 స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 14.1 ఓవర్లలోనే 200 రన్స్ చేసింది. ఈ ఏడాది HYDలో బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో IND 13.6 ఓవర్లలో ఈ ఘనత సాధించింది. అయితే 13.5 ఓవర్లలోనే వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా ఫాస్టెస్ట్ 200 రన్స్ చేసి తొలి స్థానంలో ఉంది.
Similar News
News December 9, 2024
తెలంగాణ అసెంబ్లీ ఈనెల 16 వరకు వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 16కు వాయిదా పడ్డాయి. శాసన మండలిని కూడా 16వ తేదీ వరకు వాయిదా వేశారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో అసెంబ్లీ సమావేశాల తదుపరి కార్యకలాపాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
News December 9, 2024
విచిత్రం.. ఇక్కడ పడమరన సూర్యుడు ఉదయిస్తాడు!
సూర్యుడు తూర్పున ఉదయించడం, పడమరన అస్తమించడం కామన్. అయితే, పడమరన ఉన్న పసిఫిక్ సముద్రంలో సూర్యుడు ఉదయించి తూర్పున ఉన్న అట్లాంటిక్ సముద్రంలో అస్తమించడం మీరెప్పుడైనా చూశారా? ఇలా చూడగలిగే ఏకైక ప్రదేశం పనామా. ఇది సెంట్రల్ అమెరికాలోని ఓ దేశం. ఇక్కడి ఎత్తైన ప్రదేశం వోల్కానో బారుపై నుంచి చూస్తే ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడొచ్చు.
News December 9, 2024
‘పుష్ప-2’పై రోజా ప్రశంసలు
‘పుష్ప-2’ సినిమాపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఐకాన్ స్టార్.. మీ పుష్ప-2 చిత్రం అంచనాలకు మించింది. పుష్పతో తగ్గేదేలే అన్నారు. Pushpa2తో అస్సలు తగ్గేదేలే అనిపించారు. మా చిత్తూరు యాస వెండితెరపై పలికిన తీరు హాల్‌లో ఈలలు వేయిస్తోంది. మీ నటన అద్భుతం, యావత్ దేశాన్నే మీ మాస్ ఇమేజ్‌తో పుష్పా అంటే ఫ్లవర్ కాదు ఫైర్.. వైల్డ్ ఫైర్ అని పూనకాలు పుట్టించారు’ అని ట్వీట్ చేశారు.