India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: సీతారాం ఏచూరిని కోల్పోవడం సమాజానికి తీరని నష్టం అని సీఎం రేవంత్ అన్నారు. HYDలో జరిగిన ఏచూరి సంస్మరణ సభలో మాట్లాడుతూ ‘జమిలి ఎన్నికల ముసుగులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్ర చేస్తోంది. దేశాన్ని కబళించాలని చూస్తోంది. సీతారాం ఏచూరి స్ఫూర్తితో జమిలి ఎన్నికల అంశంపై పోరాడాలి. ఈ సమయంలో ఆయన లేకపోవడం దేశానికి నష్టం’ అని వ్యాఖ్యానించారు.
AP: గత ప్రభుత్వం వల్ల తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని CM చంద్రబాబు అన్నారు. ‘లడ్డూ అపవిత్రం కావడంపై లోతుగా విచారణ జరగాలి. రూ.320కే కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది? జగన్ పాలనలో అనేక దుస్సాహసాలు జరిగాయి. రివర్స్ టెండరింగ్ పేరుతో సర్వనాశనం చేశారు. అన్ని దేవాలయాల్లో తనిఖీలు చేస్తున్నాం. తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై పండితులతో చర్చిస్తున్నాం’ అని మీడియాతో చిట్ చాట్‌లో వ్యాఖ్యానించారు.
బాలీవుడ్ నటుడు పర్విన్ దాబాస్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ముంబైలో ఈ ఉదయం అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పర్విన్ ‘మాన్సూన్ వెడ్డింగ్’, ‘మైనే గాంధీ కో నహీ మారా’, ‘ది పర్ఫెక్ట్ హజ్బెండ్’ ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ లాంటి సినిమాల్లో నటించారు. ‘తమ్ముడు’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రీతి జింగ్యానీని పర్విన్ 2008లో పెళ్లి చేసుకున్నారు.
రోజుకు 8Hrs, వారానికి 5 రోజుల పనివేళలకు MP శశి థరూర్ మద్దతిచ్చారు. దీంతోపాటు Govt, Pvt కంపెనీల్లో ఫిక్స్‌డ్ వర్క్ క్యాలెండర్‌కు చట్టబద్ధత అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానన్నారు. 4 నెలలు వీకాఫ్ లేకుండా రోజుకు 14Hrs పనిచేస్తూ గుండెపోటుతో చనిపోయిన యంగ్ CA అన్నా సెబాస్టియన్ కుటుంబాన్ని పరామర్శించారు. ‘8Hrs మించి పనిచేయిస్తే శిక్షించేలా చట్టం తేవాలి. వర్క్‌ప్లేస్‌లో మానవ హక్కులు ఆగకూడద’ని అన్నారు.
AP: లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. ఆలయం సంప్రోక్షణతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో ఆధిక్యం 514 పరుగులకు చేరాక భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. శుభమన్ గిల్ సెంచరీ(119)తో నాటౌట్‌గా నిలిచారు. రాహుల్ సైతం వేగంగా పరుగులు(19 బంతుల్లో 22 రన్స్) చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్, రానా చెరొకటి, మిరాజ్ రెండు వికెట్లు తీశారు. టెస్టులో ఇంకా రెండు రోజులు మిగిలున్నప్పటికీ బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం కూడా కష్టమే.
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 18న ఆరంభించిన NPS వాత్సల్య స్కీమ్‌కు మంచి స్పందనే లభిస్తోంది. తొలిరోజే 9,705 మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఇందులో 2,197 అకౌంట్లు e-NPS పోర్టల్ ద్వారా ఓపెన్ చేయడం విశేషం. ఈ అకౌంట్లను PFRDA పర్యవేక్షించే సంగతి తెలిసిందే. స్కీమ్ లాంచింగ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్‌కు 15,723 వ్యూస్ వచ్చాయి. పిల్లల భవిష్యత్తు కోసం NPS తరహాలో ఇన్వెస్ట్ చేసేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది.
AP: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేనలో చేరనున్నారు. రేపు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు గుంటూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు కూడా జనసేనలో జాయిన్ కానున్నారు. కిలారి రోశయ్య 2019లో పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
చరిత్రలో తొలిసారి సిక్కు యాక్టివిస్టులు, వేర్పాటువాదుల(ఖలిస్థానీ)తో అమెరికా NSA సమావేశం అయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ముంగిట వైట్‌హౌస్ అధికారులు వారిని కలవడం గమనార్హం. అమెరికా గడ్డపై విదేశీ దూకుడు చర్యల నుంచి రక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు సిక్కు నేత ప్రిత్పాల్ సింగ్ అన్నారు. ‘నిరంతర నిఘాతో సిక్కుల ప్రాణాల్ని కాపాడిన ఫెడరల్ గవర్నమెంటుకు థాంక్స్’ అని ఆయన ట్వీట్ చేశారు.
Jr.NTR ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.135 వరకూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.60 వరకూ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అలాగే రిలీజ్ రోజున(SEP 27) 12AM నుంచి మొత్తం 6షోలు, 28వ తేదీ నుంచి 9 రోజులపాటు రోజుకు 5షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Sorry, no posts matched your criteria.