India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇష్టమైనవారి పేర్లు పచ్చబొట్టు వేయించుకోవడం కామనే. కానీ యూపీకి చెందిన అభిషేక్ గౌతమ్ అనే వ్యక్తి 631మంది అమరవీరుల ఫొటోలు, పేర్లను పచ్చబొట్టు వేయించుకుని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. మహాత్మా గాంధీ, ఛత్రపతి శివాజీ సహా భారత జవాన్లు, స్మారక చిహ్నాల ఫొటోలు వీటిలో ఉన్నాయి. గత ఏడాది లద్దాక్ వెళ్లినప్పుడు ఓ జవాను తమను రక్షించారని, అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నానని గౌతమ్ తెలిపారు.
AP: జనాభా తగ్గిపోవడం ప్రమాదకరమని గుడివాడ సభలో CM చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈమధ్య ఒకే బిడ్డను కనాలనుకుంటున్నారు. కొంతమంది అసలు బిడ్డలే వద్దనుకుంటున్నారు. ఇది ప్రమాదకరం. ముసలివాళ్లు పెరిగి, యువత తగ్గిపోతోంది. దీని వల్ల సంపాదన కూడా తగ్గుతోంది. ఎంతమంది పిల్లలుంటే అంత సంపాదించే శక్తి మీకు వస్తుంది. ఒకప్పుడు జనాభా తగ్గించుకోమని నేనే చెప్పాను. కానీ ఇప్పుడు జనాభా పెరగాలి’ అని పిలుపునిచ్చారు.
నీరజ్ చోప్రా వంటి ఒలింపిక్ అథ్లెట్లూ కొత్త NCAను ఉపయోగించుకోవచ్చని BCCI కార్యదర్శి జైషా అన్నారు. ఇందులో అధునాతన వసతులు ఉంటాయన్నారు. వారణాసిలో స్టేడియం, జమ్ము- ఈశాన్య రాష్ట్రాల్లో 7 NCAలు నెలకొల్పుతామని ప్రకటించారు. బెంగళూరు NCAలో ప్రపంచ స్థాయి మైదానాలు, 45 ప్రాక్టీస్, ఇండోర్ క్రికెట్ పిచ్‌లు, ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, అద్భుతమైన ట్రైనింగ్, రికవరీ, స్పోర్ట్స్ సైన్స్ సౌకర్యాలు ఉంటాయి.
కస్టమర్లకు SBI షాకిచ్చింది. రుణాల వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర సవరించింది. పెరిగిన వడ్డీరేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తాయంది. వరుసగా మూడో నెల బ్యాంకు వడ్డీరేట్లను పెంచడం గమనార్హం. తాజా సర్దుబాటుతో MCLR రేట్లు పెరుగుతాయి. దీంతో వేర్వేరు కాల వ్యవధుల్లో తీసుకొనే రుణాల ఖర్చు, వడ్డీ భారం అధికమవుతాయి. యూకో, కెనరా, బరోడా సహా పబ్లిక్ బ్యాంకులు కొన్ని రోజుల ముందే MCLR రేట్లను పెంచడం గమనార్హం.
AP: ఆకలితో అలమటించే పేదలకు 15 రూపాయలకే మూడు పూటలా ఆహారం అందించే బృహత్తరమైన కార్యక్రమం ‘అన్న క్యాంటీన్’ పథకమని సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ క్యాంటీన్ల ద్వారా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ లభించనుంది. ఆదివారం క్యాంటీన్‌కు సెలవు. ఏ రోజు ఏ ఆహారం అనే వివరాలు పైన ఫొటోలో చూడొచ్చు.
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నా ఆయన హాలీవుడ్ సినిమాలవైపు వెళ్లలేదు. దానికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ‘భారత్‌లో నా ఫ్యాన్స్ నాకు ఓ స్థాయిని ఇచ్చారు. హాలీవుడ్ నుంచి ఆ స్థాయికి తగ్గ పాత్ర ఎప్పుడూ రాలేదు. కేవలం అక్కడ నటించాలన్న ఆశ కోసం వారిచ్చిన స్థాయిని చిన్నది చేయలేను. ఆ స్టేటస్‌ను అందుకునే పాత్ర ఉంటే కచ్చితంగా చేస్తాను’ అని వివరించారు.
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన అమన్ సెహ్రావత్‌కు రైల్వే శాఖ ప్రమోషన్ ఇచ్చింది. నార్తర్న్ రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(OSD) హోదాను కల్పించింది. భారత్ తరఫున ఒలింపిక్ మెడల్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా(21 ఏళ్లు) అమన్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. రెజ్లింగ్‌లో 57 కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో అమన్ కాంస్యం గెలిచి భారత్‌కు ఆరో మెడల్ సాధించిపెట్టారు.
TG: పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లో మోస్తరు వాన పడే ఛాన్స్ ఉందంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకు వర్షం విస్తరించొచ్చని తెలిపింది.
AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు IPSలు వ్యవహరించారని నిఘా విభాగం గుర్తించినట్లు సమాచారం. విచారణను తప్పుదోవ పట్టించేలా, YCPకి అనుకూలంగా ప్రయత్నాలు చేసినట్లు DGPకి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెయిటింగ్‌లో ఉన్న IPSలకు <<13850500>>మెమోలు<<>> జారీ చేశారని, రోజూ ఉ.10 నుంచి సా.5 వరకు హెడ్‌క్వార్టర్‌లో ఉండాలని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి.
AP: కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు దంపతులు ప్రారంభించారు. స్వయంగా పేదలకు అన్నం వడ్డించారు. అనంతరం అక్కడ వసతులను పరిశీలించి తాము కూడా ఆహారాన్ని రుచి చూశారు. రేపటి నుంచి మరో 99 క్యాంటీన్‌లను ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఆరంభించనున్నారు. రూ.5కే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి డిన్నర్ అందజేస్తారు.
Sorry, no posts matched your criteria.