News April 30, 2024

నేడు టెన్త్ ఫలితాలు..

image

TG: నేడు టెన్త్ రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. WAY2NEWS యాప్‌లో రిజల్ట్స్‌ను ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్‌ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. వాటిని ఈజీగా షేర్ చేసుకోవచ్చు. #ResultsFirstOnWay2News

News April 30, 2024

నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ

image

TG: నేడు రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మెదక్(D) ఆందోలు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధాని మహారాష్ట్రలోని లాతూర్ నుంచి మధ్యాహ్నం 3:20కి బయలుదేరి సాయంత్రం 4:20 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. సభ తర్వాత 5:55 గంటలకు దుండిగల్ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు.

News April 30, 2024

తెలుగు సాహిత్యపు దిశను మార్చిన కవి

image

విప్లవ రచయితగా, అభ్యుదయ వాదిగా తెలుగు సాహిత్యపు దశను, దిశను మార్చిన కొద్ది రచయితల్లో శ్రీశ్రీ ఒకరు. కవితలతో మాత్రమే కాకుండా సినీ గీతాలతోనూ ఆలోచింపజేసిన మహాకవి. ఆయన కలం నుంచి జాలు వారిన ‘తెలుగు వీర లేవరా’ పాటకు జాతీయ అవార్డు దక్కింది. శ్రీశ్రీ రచించిన ‘మహాప్రస్థానం’ కవితా సంకలనం ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోతుంది. తక్కువ అక్షరాలతోనే అనల్పార్థాన్ని సృష్టించడంలో ఆయన మేటి. ఇవాళ శ్రీశ్రీ జయంతి.

News April 30, 2024

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం ప్రచారం

image

AP: సీఎం జగన్ ప్రచార పర్వం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మూడు నియోజకవర్గాల్లో సీఎం పర్యటిస్తారని వైసీపీ ప్రధాన కార్యదర్శి రఘురాం తెలిపారు. ఉదయం 10 గంటలకు కొండేపి నియోజకవర్గంలో, మధ్యాహ్నం 12:30 గంటలకు కడప(D) మైదుకూరు నియోజకవర్గంలో, మధ్యాహ్నం 3 గంటలకు పీలేరు నియోజకవర్గంలో జరిగే సభల్లో ఆయన ప్రసంగిస్తారని తెలిపారు.

News April 30, 2024

ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు

image

రుణాలపై వడ్డీల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలంటూ RBI నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. లోన్ అగ్రిమెంట్ జరిగిన రోజు నుంచి కాకుండా పంపిణీ జరిగిన రోజు నుంచి వడ్డీని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. పలు బ్యాంకులు, NBFCలు వడ్డీ వసూలు చేసే విషయంలో పారదర్శకంగా లేవని ఆందోళన వ్యక్తం చేసింది. అదనపు వడ్డీ, ఇతర ఛార్జీలు వసూలు చేసిన సంస్థలు తిరిగి కస్టమర్లకు చెల్లించాలని ఆదేశించింది.

News April 30, 2024

యమపాశాలుగా హైవేలపై పార్కింగ్(1/2)

image

TG: రాష్ట్రంలో హైవే రోడ్లపై పార్కింగ్ ఏటా 120 మందికి పైగా ప్రాణాలకు బలి తీసుకుంటుంది. హైస్పీడ్ జోన్లుగా ఉన్న రహదారులపై పార్కింగ్ చేసిన వాహనాలు మరణాలకు ఉచ్చులుగా మారుతున్నాయి. 2018 నుంచి 2022 మధ్య కాలంలో జరిగిన ప్రమాదాల్లో 600 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. 2022లోనే 331 ప్రమాదాలు జరగగా.. 128 మంది చనిపోయారు. ముఖ్యంగా తెల్లవారుజామున ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

News April 30, 2024

యమపాశాలుగా హైవేలపై పార్కింగ్(2/2)

image

TG: రోడ్లపై పార్కింగ్, నివారణ చర్యలు లేకపోవడం, ఓవర్ స్పీడ్, డ్రైవర్లు అలసిపోవడం ఈ ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. హైవే పెట్రోలింగ్ వాహనాలు ఇలాంటి పార్కింగ్‌ల పట్ల చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా ఏమైనా సమస్య వచ్చి వాహనాలు రోడ్లపై నిలిచిపోతే ఇతర వెహికల్స్‌ను అలర్ట్ చేసేందుకు సెఫ్టీ ట్రయాంగిల్‌ను ఉపయోగించాలని రోడ్డు భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.

News April 30, 2024

ఫైన్ వేస్తారేమోనని సెలబ్రేషన్ ఆపేశాడు

image

ఢిల్లీతో మ్యాచులో KKR బౌలర్ హర్షిత్ రాణా చాకచక్యంగా వ్యవహరించారు. ఢిల్లీ బ్యాటర్ పొరెల్ వికెట్ తీసిన సమయంలో తనదైన శైలిలో ఫ్లైయింగ్ కిస్ సెలబ్రేషన్స్‌కు సిద్ధమయ్యారు. అయితే అంతకుముందు SRHతో మ్యాచులో ఇలాగే చేసినందుకు జరిమానాకు గురైన విషయం గుర్తొచ్చి ఆగిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

News April 30, 2024

ఆరో విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల

image

దేశంలో ఆరో విడత లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆరు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతంలోని 57 స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. నిన్నటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. చివరిదైన ఏడో దశలోనూ 57 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.

News April 30, 2024

అంతిమ బరిలో ఎంత మంది నిలిచారంటే?

image

TG: లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల విత్ డ్రా గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 625 మంది నామపత్రాలు సమర్పించగా.. 100 మంది విత్ డ్రా చేసుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో 525 మంది నిలిచారని అధికారులు తెలిపారు. ఇక అత్యధికంగా సికింద్రాబాద్ స్థానం నుంచి 45 మంది, మెదక్ నుంచి 44 మంది బరిలో ఉన్నట్లు తెలిపారు. కాగా 17 ఎంపీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి.