News November 23, 2024

ఝార్ఖండ్ రిజల్ట్స్.. సీఎం ముందంజ

image

ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బర్హత్‌ నుంచి బరిలో ఉన్న JMM చీఫ్, సీఎం హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నారు. ఓవరాల్‌గా చూస్తే ఎన్డీఏ లీడింగ్‌లో కొనసాగుతోంది. 9 స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో ఉండగా ఇండియా కూటమి 3 చోట్ల ఆధిక్యం కొనసాగిస్తోంది.

News November 23, 2024

చేతికీ చెయ్యిస్తారా? ఉద్ధవ్ ఠాక్రేపై కాంగ్రెస్ డౌట్!

image

శివసేన UBTని కాంగ్రెస్ నమ్మడం లేదని తెలుస్తోంది. ఒకవేళ MVA గెలిచినా CM పదవి ఇవ్వకపోతే ఉద్ధవ్ ఠాక్రే హ్యాండ్ ఇస్తారేమోనని అనుమానిస్తోందని సమాచారం. ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచి ఠాక్రే, సంజయ్ రౌత్ మాట్లాడుతున్న విధానం వారిని కలవరపెడుతోందని విశ్లేషకులు అంటున్నారు. 2019లో CM పదవి కోసమే ఆయన BJPని కాదని కాంగ్రెస్, NCP పంచన చేరడాన్ని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడూ అలా చేయరన్న గ్యారంటీ ఏంటంటున్నారు.

News November 23, 2024

ఆధిక్యంలో ఎన్డీయే

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఓట్ల కౌంటింగ్‌ మొదలైంది. ఎర్లీ ట్రెండ్స్‌లో రెండు చోట్ల ఎన్డీయే ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో మహాయుతి 8 చోట్ల, మహా వికాస్ అఘాడీ 6 చోట్ల లీడింగ్‌లో ఉన్నాయి. ఝార్ఖండ్‌లో ఎన్డీఏ 6, ఇండియా కూటమి 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.

News November 23, 2024

చంద్రబాబు, పవన్ న్యాయం చేయాలి: వాలంటీర్లు

image

AP: తమ ఉద్యోగం తిరిగి తమకు ఇవ్వాలని CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్‌ను వాలంటీర్లు వేడుకున్నారు. తక్షణమే తమను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. ‘గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం విధుల్లోకి తీసుకుని రూ.10 వేల వేతనం ఇవ్వాలి. మాకు రాజకీయ రంగు పూయకండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆదేశాల ప్రకారమే పని చేస్తాం. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి’ అని వారు విజ్ఞప్తి చేశారు.

News November 23, 2024

అవకాశం.. 72 గంటలే!

image

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. అయితే ఫలితాలు వచ్చిన 72 గంటల్లోనే గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నవంబర్ 26తో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. ఈనేపథ్యంలోనే మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటములు సైతం ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఫలితాలు BJP నేతృత్వంలోని మహాయుతికే అనుకూలంగా రావొచ్చని సర్వేలు చెప్పాయి.

News November 23, 2024

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జలవివాదం

image

ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి జల వివాదం చెలరేగింది. KC (కర్నూల్, కడప కెనాల్) కాలువకు కృష్ణా జలాలను వాడుకునేందుకు అనుమతించాలన్న AP సర్కార్ ప్రతిపాదనను TG వ్యతిరేకించింది. కేసీ కెనాల్‌కు తుంగభద్ర నుంచి కేటాయింపులు ఉన్నాయని, కృష్ణా నీటిని ఎలా వాడుకుంటారని ప్రశ్నించింది. AP ప్రతిపాదనకు బోర్డు అనుమతిస్తే తాము నష్టపోతామని పేర్కొంది. తుంగభద్ర బోర్డు భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది.

News November 23, 2024

ఓట్ల లెక్కింపు ప్రారంభం

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు సహా దేశంలోని 48 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల బైపోల్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. అవి పూర్తయిన తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఎర్లీ ట్రెండ్స్ వెలువడనున్నాయి. మధ్యాహ్నం లోపు రిజల్ట్స్‌పై క్లారిటీ రానుంది.

News November 23, 2024

త్వరలోనే BC కమిషన్‌కు ‘జాగృతి’ నివేదిక: కవిత

image

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ జాగృతి BC కమిషన్‌కు త్వరలో సమగ్ర నివేదిక సమర్పిస్తుందని MLC కవిత వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరైన కుల సర్వే నిర్వహించి, అణగారిన వర్గాల అవసరాలను తీర్చి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయమే దేశ సామాజిక స్వరూపాన్ని బలోపేతం చేస్తుందని ఆమె అన్నారు.

News November 23, 2024

BJP, కాంగ్రెస్‌కు 50+ స్ట్రైక్‌రేట్ భయం!

image

మహారాష్ట్రలో ఏ కూటమి అధికారం చేపట్టాలన్నా ప్రధాన పార్టీలు 50+ స్ట్రైక్‌రేటుతో సీట్లను గెలవాల్సి ఉంటుంది. 288 స్థానాలున్న ఇక్కడ BJP148 కాంగ్రెస్ 103 సీట్లలో పోటీ చేశాయి. అంటే మహాయుతి గెలుపోటములు పూర్తిగా BJP పైనే ఆధారపడ్డాయి. వాళ్లు కనీసం 80 సీట్లైనా గెలవాల్సిందే. ఇక MVAలో కాంగ్రెస్‌తో పాటు చెరో 85+ సీట్లలో పోటీచేస్తున్న శివసేన UBT, NCP SP సైతం 50+ స్ట్రైక్‌రేట్ మెయింటేన్ చేయాలి. లేదంటే కష్టమే.

News November 23, 2024

బ్యాంకు అకౌంట్లలోకి బోనస్ నగదు

image

TG: సన్నవడ్లను మార్కెట్లో ప్రభుత్వానికి విక్రయించిన రైతుల ఖాతాల్లో బోనస్ నగదు జమవుతోంది. క్వింటాకు రూ.500 చొప్పున బ్యాంకు అకౌంట్లలో డబ్బు జమైనట్లు ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లో పలువురు రైతుల ఫోన్లకు SMSలు వచ్చాయి. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లతో మెసేజ్లు వస్తున్నట్లు మరికొందరు రైతులు చెబుతున్నారు. సన్న వడ్లను దళారులకు విక్రయించవద్దని, ప్రభుత్వానికే అమ్మాలని అధికారులు కోరుతున్నారు.