News August 14, 2024

ట్యాబ్లెట్లపై ఈ రెడ్ లైన్ ఎందుకు ఉంటుంది?

image

కొన్ని ట్యాబ్లెట్ల వెనకవైపు రెడ్ కలర్ లైన్ ఉంటుంది. ప్రధానంగా యాంటీబయాటిక్స్‌లో కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే ఈ ట్యాబ్లెట్లు వాడటానికి డాక్టర్‌ సలహా తప్పనిసరి. ఇష్టానుసారం ఈ మెడిసిన్ తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. అందుకే మీరు ట్యాబ్లెట్ల ఎక్స్‌పైరీ డేట్‌తో పాటు ఈ రెడ్ లైన్ కూడా గమనించడం ముఖ్యం. > SHARE

Similar News

News September 15, 2024

కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: సీపీఐ రామకృష్ణ

image

AP: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని CM చంద్రబాబుని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. విలువైన ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టేందుకు కేంద్రం చూస్తోందని ఆరోపించారు. ఉక్కు ఫ్యాక్టరీలో మూడో ప్లాంట్ కూడా మూసివేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్‌కు సొంత ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని CBNకు ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు.

News September 15, 2024

BANతో టీ20లకు గిల్, పంత్‌ దూరం?

image

అక్టోబర్ 7 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే 3 మ్యాచుల టీ20 సిరీస్‌కు గిల్‌తో పాటు బుమ్రా, సిరాజ్, పంత్‌కు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. వర్క్ లోడ్‌ను మేనేజ్ చేసేందుకు, రాబోయే టెస్ట్ సిరీస్‌ల దృష్ట్యా వీరికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో టీ20 టీమ్‌కు ఎవరెవరు సెలక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చే ఛాన్సుంది.

News September 15, 2024

చేతబడి చేశారనే అనుమానంతో కుటుంబంలో ఐదుగురిని చంపేశారు

image

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేశారనే అనుమానంతో కుంట పీఎస్ పరిధి ఇట్కల్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేశారు. వారు చేతబడి చేయడంతోనే తమ కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడని భావించిన మరో కుటుంబం వీరిని దారుణంగా హతమార్చింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.