India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. సంస్థలోని 25 వేల మందికి రూ.5,000 ఇస్తామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క తెలిపారు. దసరా పండగకు ముందే ఈ మొత్తాన్ని వారికి అందించనున్నట్లు చెప్పారు. అటు 41వేల మంది శాశ్వత కార్మికులు, ఉద్యోగులకు బోనస్ కింద ఒక్కొక్కరికి రూ.1.90 లక్షలు అందనున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది రూ.20వేలు బోనస్ అదనంగా అందుతోంది.
TG: మూడు యూనిర్సిటీల పేరు మార్పునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కోఠి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి, టెక్స్‌టైల్ అండ్ హ్యాండ్‌లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను ఖరారు చేసింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించడంపైనా క్యాబినెట్ చర్చించింది. అలాగే ఈ నెల 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బంగ్లాతో తొలి టెస్టులో భారత్ పట్టు సాధించింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు మీదున్న విరాట్ స్వీయ తప్పిదంతో పెవిలియన్ చేరారు. హసన్ వేసిన బంతి ఆయన బ్యాట్‌కు తగులుతూ ప్యాడ్‌ను తాకింది. అంపైర్ LBWగా ఔటిచ్చారు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న గిల్‌తో మాట్లాడి కోహ్లీ వెనుదిరిగారు. రీప్లేలో బాల్ ఆయన బ్యాట్‌కు తాకినట్లుగా తేలింది. అది చూసి కెప్టెన్ రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి అసహనం వ్యక్తం చేశారు.
చెన్నై వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో టీమ్ఇండియా పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పడగొట్టిన నాలుగు వికెట్లు బంగ్లాను తక్కువ మొత్తానికే ఆలౌట్ చేసేందుకు తోడ్పడ్డాయి. సొంతగడ్డపై బుమ్రా ఇప్పటివరకు 9 టెస్టులు ఆడగా 15.94 సగటు& 32.4 స్ట్రైక్ రేట్‌తో 37 వికెట్లు తీశారు. ప్రపంచ క్రికెట్‌లో బుమ్రా అత్యుత్తమ ఆటగాడని మరోసారి నిరూపించాడని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
విదేశీ గడ్డపై దేశాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. నేటి కాంగ్రెస్‌లో దేశభక్తి స్ఫూర్తి చచ్చిపోయిందని ఆయన మండిపడ్డారు. ‘పరాయి గడ్డపై కాంగ్రెస్ వాళ్ల భాష, దేశ వ్యతిరేక ఎజెండా, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే మాటలను చూడండి. ఇది ‘తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్ నడుపుతున్న కాంగ్రెస్’ అంటూ ప్రధాని మండిపడ్డారు. మహారాష్ట్రలోని వార్ధ సభలో ఆయన మాట్లాడారు.
తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. ‘మీరు DCMగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఇష్యూ ఇది. దర్యాప్తు చేయండి. నేరస్థులు దొరికితే కఠిన చర్యలు తీసుకోండి. అంతేగానీ ఎందుకు ఊహాగానాల్ని వ్యాప్తి చేస్తున్నారు? కేంద్రంలో మీ స్నేహితుల వల్ల దేశంలో మనకున్న మతకల్లోలాలు చాలు’ అని ట్వీట్ చేశారు. దీంతో ఆయనపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు బోగస్ మాటలు మానుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మల్లన్నసాగర్ నిండుకుండలా ఉందంటే కాళేశ్వరం పుణ్యమేనని అన్నారు. ఎల్లంపల్లి మొదలుకుని కొండపోచమ్మ వరకు గోదావరి జలాలు వస్తున్నాయంటే ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం కింద పండే ప్రతి పంటపై, రైతుల గుండెల్లో కేసీఆర్ ఉంటారని హరీశ్ వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా వందలాది రాకెట్లతో విరుచుకుపడింది. దాదాపు 140 రాకెట్ లాంఛర్లతో ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఈ విషయాన్ని ఆ దేశం కూడా ధ్రువీకరించింది. కాగా ఇప్పటివరకు హమాస్ అంతమే లక్ష్యంగా పోరాడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బొల్లాను కూడా టార్గెట్ చేసింది. దక్షిణ లెబనాన్‌పై వైమానిక దాడులు చేస్తోంది. పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
IT రూల్స్‌కి కేంద్రం చేసిన సవరణలను బాంబే హైకోర్టు కొట్టివేసింది. సోషల్ మీడియా వేదికలపై ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి వచ్చే నకిలీ, తప్పుడు వార్తలకు అడ్డుకట్టవేయడానికి ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకొనేలా కేంద్రం IT చట్టానికి సవరణలు చేసింది. అయితే ఇది ఆర్టికల్ 14 (సమానత్వం), 19(స్వేచ్ఛ) హక్కులను ఉల్లంఘించడమేనని జస్టిస్ అతుల్ చందూర్కర్ బెంచ్ అభిప్రాయపడింది.
ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు కలవనున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వనున్నారు.
Sorry, no posts matched your criteria.