News April 30, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 30, 2024

శుభ ముహూర్తం

image

తేది: ఏప్రిల్ 30, మంగళవారం
బ.షష్ఠి: ఉదయం 07:05 గంటలకు
ఉత్తరాషాడ: తెల్లవారుజాము 4:09 గంటలకు
దుర్ముహూర్తం: 1.ఉ.08:17 నుంచి 09:08 గంటల వరకు
2.రా.10:55 నుంచి 11:41 గంటల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 12:31 నుంచి 02:05 గంటల వరకు

News April 30, 2024

TODAY HEADLINES

image

రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బ ఖాయం: అమిత్ షా
TG:సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు
TG: CM, డిప్యూటీ సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: KCR
AP:పిఠాపురంలోనూ గ్లాస్ సింబల్ కుట్ర: జనసేన
AP:చంద్రబాబు వద్ద చాలా డబ్బులున్నాయి.. తీసుకోండి: జగన్
AP:చెత్త పన్ను రద్దు చేస్తా: చంద్రబాబు
AP:చంద్రబాబుకు పెన్షనర్ల ఉసురు తగులుతుంది: సజ్జల
IPL.. ఢిల్లీపై KKR విజయం

News April 30, 2024

ఉత్తరాఖండ్‌లో 14 పతంజలి ఉత్పత్తుల లైసెన్స్ రద్దు

image

ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీ 14 పతంజలి ఉత్పత్తుల లైసెన్స్‌లను సస్పెండ్ చేసింది. తప్పుదారి పట్టించే ప్రకటనల కేసుకు సంబంధించి పతంజలి దివ్య ఫార్మసీ తయారు చేస్తున్న 14 ఉత్పత్తుల లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. రామ్‌దేవ్, సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ చెప్పిన <<13113234>>క్షమాపణలకు<<>> సంబంధించిన అంశంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

News April 29, 2024

త్రివిక్రమ్ సినిమాలో అల్లుఅర్జున్ ద్విపాత్రాభినయం?

image

పుష్ప-2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇందులో బన్నీ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. ఒక క్యారెక్టర్‌కి నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. ఇంటర్వెల్‌లో రెండో పాత్ర ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు. నవంబర్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News April 29, 2024

ఎలక్షన్స్: ఆ నిరుద్యోగులకు ఫుల్ డిమాండ్!

image

ఎన్నికలకు వ్యూహాలు రచించే పొలిటికల్ కన్సల్టెన్సీలకు దేశంలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అయితే వీటిలో కీ రోల్ ప్లే చేస్తోంది ఎవరో తెలుసా? IIT, IIMలలో చదివిన నిరుద్యోగ ఇంజనీర్లు, MBA పట్టభద్రులు, యువ న్యాయవాదులు. సర్వేలు, ఓటర్ల డేటా విశ్లేషిస్తూ పార్టీలకు తగ్గట్లు వ్యూహాలు రెడీ చేయడం, లోక‌ల్‌‌గా నేతల రాజకీయ సమస్యలను పరిష్కరించడం వీరి పని. ఈ సీక్రెట్ ఆర్మీకి వేతనాలు సైతం భారీగా చెల్లిస్తున్నారు.

News April 29, 2024

IPL: ఢిల్లీపై కోల్‌కతా ఘనవిజయం

image

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. DC నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని KKR 16.3 ఓవర్లలోనే ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లలో సాల్ట్ 68, శ్రేయస్ అయ్యర్ 33, వెంకటేశ్ అయ్యర్ 26 రన్స్‌తో రాణించారు. ఈ సీజన్‌లో కేకేఆర్‌కు ఇది ఆరో విజయం కాగా, ఢిల్లీకి ఆరో ఓటమి.

News April 29, 2024

ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వేటు!

image

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వేటు వేసేందుకు జేడీ(ఎస్) సిద్ధమైంది. అతణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి తెలిపారు. వీడియో క్లిప్పులు ఉన్న పెన్‌డ్రైవ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపిణీ చేశారనే దానిపై దర్యాప్తు జరగాలన్నారు. ఈ కేసుతో దేవేగౌడకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

News April 29, 2024

టెన్త్, ఇంటర్ అర్హతతో 4,000 ఉద్యోగాలు..

image

ఇండియన్ మర్చంట్ నేవీలో 4,000 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ రేపటితో ముగియనుంది. డెక్, ఇంజిన్ రేటింగ్, సెయిలర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్/హెల్పర్, కుక్ పోస్టులున్నాయి. అభ్యర్థులు టెన్త్, ఇంటర్(కొన్ని పోస్టులకు ITI) ఉత్తీర్ణులై, వయసు 17.5-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి కేటగిరీలను బట్టి జీతం ₹38,000-₹90,000 మధ్య ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.
సైట్: https://sealanemaritime.in/

News April 29, 2024

‘బాలిక గర్భవిచ్ఛిత్తి’పై తీర్పును వెనక్కి తీసుకున్న సుప్రీంకోర్టు

image

అత్యాచారానికి గురైన బాలిక 30 వారాల గర్భాన్ని <<13101257>>విచ్ఛిత్తి<<>> చేసుకునేందుకు ఇటీవల అనుమతించిన సుప్రీంకోర్టు.. తాజాగా ఆ తీర్పును వెనక్కి తీసుకుంది. కుమార్తె ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని బాలిక పేరెంట్స్ CJI చంద్రచూడ్‌కు విన్నవించారు. ఆమె ప్రయోజనాలకు కట్టుబడి గత ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కాగా రేప్ బాధితులు 24 వారాల తర్వాత గర్భవిచ్ఛిత్తికి కోర్టు అనుమతి తీసుకోవాలి.