News September 20, 2024

CM గారూ.. మీ వ్యాఖ్యలు చాలా ప్రభావవంతం: మహీంద్రా

image

TG: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ విషయంలో CM రేవంత్‌ను వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కొనియాడారు. ‘ఆ సదస్సుకు హాజరుకావడం సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా సీఎం రేవంత్‌ తన ఆలోచనల్ని ఆచరణలోకి పెట్టడాన్ని చూసి ఎంజాయ్ చేశాను. రేవంత్.. మీరు తక్కువే మాట్లాడినా అవి చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ఎలా పనిచేయాలన్నదానికి బలమైన ఉదాహరణ ఇచ్చారు మీరు’ అని పేర్కొన్నారు.

News September 20, 2024

బరువు తగ్గేందుకు ఓకేగానీ ఆ డైట్‌తో గుండె, పొట్టకు ప్రమాదం!

image

బరువు తగ్గేందుకు సాయపడే కీటోడైట్ గుండె, పొట్టకు అంత మంచిది కాదని సెల్ రిపోర్ట్స్ మెడిసిన్‌లో పబ్లిషైన కొత్తస్టడీ పేర్కొంది. దానికన్నా లోషుగర్ డైట్ బెటరంది. ‘కీటో వల్ల జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా నాశనమవుతోంది. మైక్రోబయోమ్ వైవిధ్యం దెబ్బతింటోంది. ఎక్కువ కొవ్వు తింటే బాడీలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. గుండె జబ్బులకు కారణమయ్యే అపోలిపో ప్రొటీన్ పెరగడాన్ని మూత్రంలో గమనించాం’ అని పేర్కొంది.

News September 20, 2024

మరో ఇద్దరు నేతలు వైసీపీకి గుడ్‌బై?

image

AP: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. వారు పార్టీని వీడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే బాలినేని, ఉదయభాను వంటి నేతలు వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతకుముందు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావుతో పాటు పలువురు నేతలు ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే.

News September 20, 2024

ఈనెల 23 నుంచి ‘హరిహర వీరమల్లు’ షూటింగ్

image

‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ ఈనెల 23 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే రోజు నుంచి పవన్ కళ్యాణ్ షూట్‌లో పాల్గొంటారని, హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ సమక్షంలో యాక్షన్ సీన్స్ షూట్ చేయనున్నట్లు తెలిపారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ మూవీలో కొంత భాగానికి క్రిష్ దర్శకత్వం వహించగా, మిగిలిన భాగానికి జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయనున్నారు.

News September 20, 2024

సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం

image

బెంగాల్ కోర్టులను ఉద్దేశించి CBI చేసిన వ్యాఖ్య‌ల‌పై సుప్రీంకోర్టు మండిపడింది. 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం జ‌రిగిన హింసాకాండ కేసుల‌ను CBI విచారిస్తోంది. రాష్ట్రంలో సాక్షులను బెదిరించే ఆస్కారం ఉందంటూ కేసులను బ‌దిలీ చేయాలని CBI పిటిష‌న్ వేసింది. అయితే ఇందులో బెంగాల్‌లోని కోర్టులు నిష్ప‌క్ష‌పాతంగా ఉండ‌వంటూ రాసిన వ్యాఖ్యానాల‌పై కోర్టు మండిప‌డింది. దీన్ని సవరిస్తేనే కేసును విచారిస్తామంది.

News September 20, 2024

సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా: సీఎం రేవంత్

image

TG: దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అలాగే లాభాల్లో కూడా వాటా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ‘మొత్తం 25 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షల చొప్పున ఇస్తున్నాం. ఇందుకోసం రూ.796 కోట్లు కేటాయించాం. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం. కార్మికులు, ఉద్యోగుల కళ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు.

News September 20, 2024

భారీ ఆధిక్యం దిశగా టీమ్ ఇండియా

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 308 పరుగులు ఆధిక్యంలో నిలిచింది. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా 4 వికెట్లతో చెలరేగారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రీజులో రిషభ్ పంత్ (12), శుభ్‌మన్ గిల్ (33) ఉన్నారు.

News September 20, 2024

ప్రతి మహిళా ఇద్దరు పిల్లల్ని కనాలి: సీఎం చంద్రబాబు

image

AP: చదువుకున్న యువత పిల్లల్ని కనడంపై ఆసక్తి కనబర్చడం లేదని CM చంద్రబాబు అన్నారు. ‘కొన్ని దేశాలు జనాభా తగ్గి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతి మహిళా ఇద్దరు పిల్లల్ని కంటేనే జనాభా సమతుల్యత ఉంటుంది. APని గాడిలో పెడతానని నన్ను గెలిపించారు. మన GOVT కొనసాగి ఉంటే ఎంత అభివృద్ధి చెందేదో ఆలోచించండి? ఇంకో వ్యక్తి వచ్చి ఏదో చేస్తానంటే ప్రజలు మోసపోతున్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది’ అని అన్నారు.

News September 20, 2024

ఒకటో తేదీన ‘పేదల సేవలో’ కార్యక్రమం: CM

image

AP: ప్రతి నెల ఒకటో తేదీన ‘పేదల సేవలో’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. ప్రకాశం(D) మద్దిరాలపాడులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో మాట్లాడారు. ‘MLAలు, కలెక్టర్లు, అధికారులు పేదల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకుని సాయం అందించాలి. ప్రస్తుతం ఏపీ వెంటిలేటర్‌పై ఉంది. 21 మంది MPలను గెలిపించడంతో ఢిల్లీలో మన పరపతి పెరిగింది. దీంతో APకి ఆక్సిజన్ తీసుకొస్తున్నాం’ అని తెలిపారు.

News September 20, 2024

వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్ట్

image

AP: నటి కాదంబరి జెత్వానీ కేసుకు సంబంధించి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆయనను అదుపులోకి తీసుకుని రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. కాగా తనపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచి వేధించారని జెత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేశారు.