News August 15, 2024

మత వివక్ష అంతానికి సెక్యులర్ సివిల్ కోడ్: మోదీ

image

సెక్యులర్ సివిల్ కోడ్ అత్యవసరమని ప్రధాని మోదీ అన్నారు. ‘మతతత్వ పౌరస్మృతిని తలపించే ప్రస్తుత చట్టాలు వివక్ష చూపుతున్నాయని చాలామంది అభిప్రాయం. అది నిజమే. 75 ఏళ్లుగా అవే అమలవుతున్నాయి. ఇప్పుడు లౌకిక పౌరస్మృతి వైపు వెళ్లాలి. దీంతో మత వివక్ష అంతమవుతుంది. సుప్రీంకోర్టు ఈ దిశగా ఎన్నో ఆదేశాలు ఇచ్చింది. రాజ్యాంగ స్ఫూర్తీ దీనినే ప్రోత్సహిస్తోంది. ఉమ్మడి పౌరస్మృతిపై విస్తృత చర్చ జరగాలి’ అని ఆయన అన్నారు.

News August 15, 2024

బౌలింగ్‌ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ ఎందుకంటే..

image

లక్ష్మీపతి బాలాజీ, వినయ్ కుమార్ రేసులో ఉన్నప్పటికీ భారత బౌలింగ్ కోచ్ పదవి దక్షిణాఫ్రికా బౌలర్ మోర్నీ మోర్కెల్‌నే వరించింది. అందుకు గల కారణాలను బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ‘భారత్ ఈ ఏడాది ఆస్ట్రేలియాలో, వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో 5 టెస్టుల సిరీస్ ఆడుతుంది. మోర్కెల్ ఈ దేశాల్లో విజయవంతమయ్యారు. భారత ఆటగాళ్లతో ఆయనకు చక్కటి అనుబంధం ఉంది. దీంతోనే బోర్డు అతడి వైపు మొగ్గు చూపింది’ అని వివరించాయి.

News August 15, 2024

కలెక్టరేట్లలో రుణమాఫీ కౌంటర్లు: సీఎం రేవంత్

image

TG: రైతు రుణమాఫీపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని CM రేవంత్ రెడ్డి తెలిపారు. పథకానికి అర్హులైన వారందరికీ రుణమాఫీ అవుతుందని మరోసారి స్పష్టం చేశారు. ఎవరికైనా సాంకేతిక కారణాల వల్ల మాఫీ కాకపోతే చేయించే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. రుణమాఫీ వల్ల తమ జన్మ ధన్యమైందని వ్యాఖ్యానించారు.

News August 15, 2024

‘డబుల్ ఇస్మార్ట్’ REVIEW & RATING

image

తన తల్లి(ఝాన్సీ)ని చంపిన మాఫియా డాన్‌(సంజయ్‌దత్)పై హీరో రామ్ ఎలా పగ తీర్చుకున్నాడనేదే డబుల్ ఇస్మార్ట్ కథ. తొలి భాగం మాదిరిగానే ఇందులోనూ మెమొరీ చిప్ కాన్సెప్ట్‌ను డైరెక్టర్ కొనసాగించారు. రాపో యాక్షన్, సంజయ్ విలనిజం, క్లైమాక్స్ సినిమాకు ప్లస్. హీరోయిన్ కావ్యా థాపర్‌కు ప్రాధాన్యతలేదు. రొటీన్ కథ, పేలవమైన కామెడీ, ముందే ఊహించగలిగే సీన్లు మైనస్. పూరీ టేకింగ్ స్టైల్ మిస్సయ్యింది.
రేటింగ్: 2.25/5

News August 15, 2024

అకారణంగా బంగ్లా హిందువులపై దాడులు: భాగవత్

image

బంగ్లాదేశ్‌లో అకారణంగా హిందూ మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. నాగపూర్‌లో పతాకావిష్కరణ తర్వాత మాట్లాడారు. ‘స్వతంత్రంలో ‘స్వ’ అంటే స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన బాధ్యత భవిష్యత్తు తరాలదే. ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించాలనే దేశాలు చాలా ఉన్నాయి. పరిస్థితులెప్పుడూ ఒకేలా ఉండవు. మనం జాగ్రత్తగా ఉండాలి. అస్థిరత, అరాచకత్వం ఉన్న దేశాల ప్రజలకు సాయం చేయడం మనకు అలవాటే’ అని ఆయన అన్నారు.

News August 15, 2024

నెహ్రూ వల్లే దేశం ఈ స్థాయిలో ఉంది: రేవంత్

image

నెహ్రూ దార్శనికత ఫలితంగానే దేశం ఈ స్థాయిలో ఉందని స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా CM రేవంత్ అన్నారు. ‘ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులను మనం ఇప్పుడు ఆధునిక దేవాలయాలుగా చెప్పుకుంటున్నాం. వాటి వల్ల దేశం సస్యశ్యామలంగా ఉంది. BHEL, IDPL, మిధాని వంటి పరిశ్రమలను నెహ్రూ స్థాపించి దేశ ఆర్థికాభివృద్ధికి పునాదులు వేశారు. లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వ్యవసాయంలో నూతన విప్లవాలు తెచ్చారు’ అని CM కొనియాడారు.

News August 15, 2024

అన్న క్యాంటీన్లకు ప్రజలు విరాళాలివ్వాలి: సీఎం చంద్రబాబు

image

AP: దివంగత ఎన్టీఆర్ అడుగుజాడల్లో తమ ప్రభుత్వం పయనిస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘మాది పేదల ప్రభుత్వం. ఆర్థిక కష్టాలున్నప్పటికీ సామాజిక పింఛన్లు పెంచి అందిస్తున్నాం. పేదల ఆకలి తీర్చేందుకు నేటి నుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి ప్రజలు భాగస్వాములు కావాలి. పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యాల రోజున విరాళాలు ఇస్తే మీ పేరున భోజనం పెడతాం’ అని తెలిపారు.

News August 15, 2024

వైసీపీ రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేసింది: సీఎం చంద్రబాబు

image

AP: 2014-19 మధ్య ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయని దుయ్యబట్టారు. విజయవాడలో మాట్లాడుతూ.. ‘వైసీపీ పాలకులు కనీవినీ ఎరుగని విధ్వంసం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేశారు. ల్యాండ్, శాండ్, మైనింగ్ మాఫియాలతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టారు’ అని మండిపడ్డారు.

News August 15, 2024

భార్య అందంగా తయారవుతోందని చంపేశాడు!

image

భార్య అందంగా తయారు కావడం ఇష్టం లేని ఓ భర్త ఆమెను చంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో జరిగింది. దివ్య (32), ఉమేశ్ భార్యాభర్తలు. దివ్య ఎప్పుడూ అందంగా కనపడేందుకు లిప్‌స్టిక్ వేసుకునేది, ఓ టాటూ కూడా వేయించుకుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడాకుల కోసం కోర్టుకెళ్లారు. కోర్టు విచారణకు హాజరైన అనంతరం ఇక అనుమానించనని ఆమెను నమ్మించి ఓ గుడికి తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి హత్య చేశాడు.

News August 15, 2024

తాడేపల్లిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జగన్

image

AP: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సమరయోధుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.