News August 16, 2024

ఛీ.. ఏంటి ఈ భాష? కట్ డ్రాయర్ ఎమ్మెల్యేvsనిక్కర్ మంత్రి

image

AP: అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో TDP, YCP వాడుతున్న భాషపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ CM జగన్‌ను కట్ డ్రాయర్ ఎమ్మెల్యే, సైకో, జలగ, వాడు అని TDP, లోకేశ్‌ను నిక్కర్ మంత్రి, పప్పు అని YCP కామెంట్స్ చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీల గొంతుకగా ఉన్న సోషల్ మీడియాలో ఇలాంటి చిల్లర కామెంట్స్ ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విమర్శ సహేతుకంగా, భాషలో హుందాతనం ఉండాలంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News August 16, 2024

విజయ్ చివరి సినిమా దర్శకుడు ఇతడే!

image

తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో తన చివరి సినిమా ఎవరు తీస్తారనే దానిపై ఫ్యాన్స్‌లో సందేహం నెలకొంది. అయితే, విజయ్ 69వ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించనున్నారు. నిన్న జరిగిన ఓ అవార్డ్స్ వేడుకలో ఆయన పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది కమర్షియల్ సినిమా అని, పొలిటికల్ డ్రామా కాదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే మూవీలోని నటీనటులపై ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు.

News August 16, 2024

వినేశ్ మనకు గర్వకారణం: మోదీ

image

రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆమె మనందరికీ గర్వకారణం అన్నారు. ఒలింపిక్స్ కుస్తీపోటీల్లో ఫైనల్ చేరిన తొలి మహిళగా రికార్డు సృష్టించారని కొనియాడారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పారిస్ ఒలింపిక్స్ మెడలిస్టులు, అథ్లెట్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కాగా వెండి పతకం ఇవ్వాలన్న పిటిషన్‌ను కాస్ కోర్టు తిరస్కరించడంతో వినేశ్ ప్రత్యామ్నాయ న్యాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.

News August 16, 2024

అమ్మమ్మ మాట్లాడటం లేదని..

image

TG: అమ్మమ్మ అంటే ఓ ఎమోషన్. చిన్నప్పటి నుంచి లాలించిన అమ్మమ్మ మాట్లాడటం మానేయడంతో ఆ మనవరాలు తట్టుకోలేకపోయింది. మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. హన్మకొండ(D) భీమదేవరపల్లికి చెందిన నిఖిత(22)కు అమ్మమ్మ వెంకటలక్ష్మి అంటే చాలా ఇష్టం. ఇటీవల యువతి కుటుంబంతో వెంకటలక్ష్మికి మనస్పర్ధలు రావడంతో ఆమె వారితో మాట్లాడటం మానేసింది. అప్పటినుంచి బాధలో ఉన్న నిఖిత బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

News August 16, 2024

డాక్టర్ హత్యాచారం కేసు: సాయంత్రం మమత ర్యాలీ

image

పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ నేటి సాయంత్రం కోల్‌కతా వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తారని TMC MP డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. ర్యాలీకి ఈ కింది కారణాలను వివరించారు.
* ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు దర్యాప్తు వివరాలను రోజూ ఇవ్వాలి.
* ఈ కేసులో పోలీసులకు CM ఇచ్చిన తుది గడువు ఆగస్టు 17. CBIకీ ఇదే వర్తిస్తుంది.
* పోలీసులు ఒకర్ని అరెస్టు చేశారు. CBI నిందితులందర్నీ అరెస్టు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పంపాలి.

News August 16, 2024

దుబాయ్ వెళ్లేందుకు అవినాశ్ యత్నం.. అనుమతి నిరాకరణ

image

AP: దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన వైసీపీ నేత దేవినేని అవినాశ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. నిన్న రాత్రి ఆయన దుబాయ్ వెళ్లేందుకు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై FIR నమోదైందని, ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని మంగళగిరి పోలీసులు విమానాశ్రయ అధికారులకు సూచించారు. అనుమతి నిరాకరించడంతో ఆయన వెనుదిరిగారు.

News August 16, 2024

సాయంత్రం 4.05 గంటలకు ‘దేవర’ అప్డేట్

image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ బర్త్ డే సందర్భంగా ‘దేవర’ నుంచి అప్డేట్ రాబోతోంది. ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు ‘భైర’కు సంబంధించిన గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్‌గా నటిస్తుండగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర’ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News August 16, 2024

‘హరిహరవీరమల్లు’ షూటింగ్ పునః ప్రారంభం

image

కొన్ని నెలలుగా ఆగిపోయిన హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఈ నెల 14 నుంచి పునః ప్రారంభమైనట్లు మేకర్స్ వెల్లడించారు. స్టంట్ మాస్టర్ శివ ఆధ్వర్యంలో 400-500 మంది ఫైటర్స్‌, జూనియర్ ఆర్టిస్టులతో భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో పాల్గొంటారని, ఎప్పుడూ చూడని కొత్త గెటప్‌లో అలరిస్తారని పేర్కొన్నారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News August 16, 2024

ప్రశ్నించినందుకు వైద్యురాలి ఇంటికి పోలీసులు!

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన మరువక ముందే మరో వైద్యురాలికి చేదు అనుభవం ఎదురైంది. బర్ద్వాన్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ ఘటనపై సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు పోలీసులు అడ్రెస్ తెలుసుకొని తన ఇంటికి వచ్చినట్లు ఆమె తెలిపారు. రాత్రిపూట పోలీసులు ఇంటికి రావడంతో తన తల్లి భయాందోళనకు గురైందని, పోస్ట్ డిలీట్ చేయాలని వారు బెదిరించినట్లు చెప్పారు. దీనిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.

News August 16, 2024

1.8KM దూరానికి రూ.700.. నెటిజన్ పోస్టు వైరల్

image

క్యాబ్ సర్వీసులు ఇష్టానుసారం రేట్లు పెంచి ప్రయాణికులను దోచుకోవడం సర్వసాధారణమైంది. ఈ వ్యవహారంపై ఓ నెటిజన్ చేసిన పోస్టు వైరలవుతోంది. ‘ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర సంస్థలు తక్కువ ధరతో సర్వీస్ అందిస్తామని చెబుతుంటాయి. అయితే కొన్ని వర్షపు చినుకులు రాలగానే 300% అధికంగా డిమాండ్ చేస్తాయి. ఢిల్లీలో 1.8KMల దూరానికి కారు సర్వీసుకు ఏకంగా రూ.699 రేటు చూపుతోంది’ అని అతను రాసుకొచ్చారు.
మీకూ ఇలాంటి సమస్య ఎదురైందా?