India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: శ్రావణ మాసంలో వరుస శుభాకార్యాలు, వరలక్ష్మీ వ్రతం కారణంగా పూల ధరలు మూడింతలు పెరిగాయి. వాతావరణ మార్పులతో దిగుబడి తగ్గడమూ ప్రభావం చూపుతోంది. గత నెలలో మల్లెల ధర KG ₹550 ఉండగా ఇప్పుడు ₹1,500 పలుకుతోంది. తెల్ల చామంతి ₹200 నుంచి ₹350, పసుపు చామంతి ₹150 నుంచి ₹400, కనకాంబరం ₹100 నుంచి ₹300, లిల్లీ ₹150 నుంచి ₹500, జాజులు ₹300 నుంచి ₹1,200కు చేరాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఈ వ్రతాన్ని నియమ నిష్ఠలు, భక్తి, ఏకాగ్రతతో జరుపుకోవాలి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతం చేయడం మహిళలకు అత్యంత శుభప్రదం. ఈరోజు వీలుకాకపోతే ఏ శుక్రవారమైనా వ్రతం చేసుకోవచ్చు. ఈ వ్రతం ఆచరించడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ఉంటాయని, పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుందని నమ్మకం.
AP: ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో చేపట్టే పనుల్లో గ్రామాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, మురుగు కాలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాతే అసంపూర్తిగా నిలిచిన భవన నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్లకు సూచించింది. గత ప్రభుత్వం 35వేలకు పైగా భవనాల నిర్మాణాలను ప్రారంభించింది. ఇందులో 80 శాతం లోపు పనులు పూర్తయిన నిర్మాణాలను ప్రస్తుత ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టనుంది.
TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, జనగామ, భువనగిరి, RR, HYD, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గాజా యుద్ధంలో మృతుల సంఖ్య 40 వేలకు చేరుకుంది. 10 నెలల్లో 40,005 మంది పాలస్తీనా ప్రజలతోపాటు మిలిటెంట్లు మరణించారు. గాజాలో మరణించిన వారి మృతదేహాలను పూడ్చటానికి స్థలం కూడా దొరకటం లేదు. సమాధిపైనే మరో సమాధి నిర్మించాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని మృతదేహాలను పార్కులు, ఇంటి మెట్ల కింద పూడ్చిపెడుతున్నారు. బతికున్నవారు కూడా తమ వంతు ఎప్పుడు వస్తుందా అని చావు కోసం ఎదురుచూస్తున్నారని రచయిత యూస్రీ అన్నారు.
TG: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసుకున్న ఒప్పందం మేరకు తమకు కేటాయించాల్సిన నామినేటెడ్ సహా ఇతర పోస్టుల కేటాయింపు అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లేందుకు TJS నిర్ణయించింది. ఈమేరకు తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం అధ్యక్షతన పదాధికారులు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి TJS మద్దతిచ్చిన విషయం తెలిసిందే.
AP: వివిధ ప్రభుత్వ శాఖల్లో నామినేటెడ్ పదవుల కోసం సుమారు 23 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు 2,500 మందికి పదవులు దక్కే అవకాశం ఉంది. కార్యకర్తల్లో అసంతృప్తి రగలకుండా ఈ వారంలోనే తొలి జాబితా ప్రకటించనున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన 31 మంది నియోజకవర్గ TDP ఇన్‌ఛార్జిలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పార్టీకి ఆర్థికంగా అండగా నిలిచినవారికి కూడా పదవులు దక్కనున్నాయి.
AP: అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఇవాళ ఉదయం 9.17 గంటలకు SSLV-D3 ప్రయోగం చేపట్టనుంది. ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్-08 శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. విపత్తు నిర్వహణలో ఇది పంపే సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది. SSLV-D3 ప్రయోగం నేపథ్యంలో నిన్న ఇస్రో సైంటిస్టులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఉపగ్రహం నమూనాకు ప్రత్యేక పూజలు చేయించారు.
AP: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో మండలానికో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే అన్న క్యాంటీన్లను ట్రస్ట్ ద్వారా శాశ్వతంగా కొనసాగిస్తామని ప్రకటించారు. కాగా రాష్ట్రంలో ఇవాళ మరో 99 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. వీటిని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
తన పేరును వెండితెరపై తొలిసారిగా చూసిన క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని హీరోయిన్ కీర్తి సురేశ్ అన్నారు. ఆమె నటించిన తమిళ మూవీ ‘రఘుతాత’ రిలీజ్ సందర్భంగా Xలో అభిమానులతో ముచ్చటించారు. ‘బేబి జాన్’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పారు. వరుణ్ ధవన్ హీరోల్లో లవర్ బాయ్ అని తెలిపారు. నటి అనుష్క మంచి వ్యక్తి అని, తనను స్వీటీ అని పిలుస్తానని పేర్కొన్నారు. ‘రఘుతాత’లో తనకు పెళ్లి సన్నివేశం ఇష్టమన్నారు.
Sorry, no posts matched your criteria.