News August 16, 2024

TODAY HEADLINES

image

* దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
* సెక్యులర్ సివిల్ కోడ్ అత్యవసరం: PM మోదీ
* అన్న క్యాంటీన్లు ప్రారంభించిన CM చంద్రబాబు
* రోజా, కృష్ణదాస్‌పై CIDకి ఫిర్యాదు.. విచారణకు ఆదేశం
* హరీశ్‌రావు రాజీనామా చేయాలి: CM రేవంత్
* రేవంత్ లాంటి దిగజారిన సీఎంను చూడలేదు: హరీశ్
* రేపు ఖాతాల్లోకి రూ.2 లక్షల వరకు రుణమాఫీ డబ్బులు: భట్టి
* HYDలో దంచికొట్టిన వర్షం

News August 15, 2024

UCC అమలు చేయాలన్న ప్రధాని.. అసద్ ఏమన్నారంటే?

image

దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్(UCC) ఉండాల్సిన అవసరం ఉందని PM మోదీ వ్యాఖ్యానించడంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘బీజేపీ UCC వెర్షన్‌లో HUF, షెడ్యూల్స్ కులాలకు, హిందూ ఆచారాలకు మినహాయింపు ఇచ్చారు. హిందువుల్లో దాయభాగ, మితాక్షర వంటి తేడాలున్నాయి. మరి వాటి సంగతేంటి? ఉత్తరాఖండ్‌లో అమలవుతోన్న UCC బీజేపీ వంచనకు సరైన నిర్వచనం. ఇది హిందువుల సంప్రదాయాన్ని మిగతా వారిపై రుద్దుతోంది’ అని ట్వీట్ చేశారు.

News August 15, 2024

యాక్టర్ కాకుంటే ఆ పని చేసేవాడిని: నాని

image

తాను ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉంటే థియేటర్లో ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పని చేసేవాడినని హీరో నాని అన్నారు. యూసఫ్‌గూడలోని పోలీస్ బెటాలియన్‌లో ట్రైనీ కానిస్టేబుళ్లతో ఆయన ముచ్చటించారు. తాను డైట్ ఫాలో కానని, అమ్మ వండిన ప్రతిదీ తింటానని చెప్పారు. ‘సరిపోదా శనివారం’ తర్వాత చేయబోయే ప్రాజెక్టులో పోలీసుగా నటించబోతున్నట్లు తెలిపారు. ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ నేపథ్యంలో మంచి స్క్రిప్ట్ వస్తే తాను నటిస్తానని పేర్కొన్నారు.

News August 15, 2024

కొరియన్ మహిళల బ్యూటీ సీక్రెట్ తెలుసా?

image

కొరియన్ మహిళలు వయసు పెరిగినా కూడా మెరిసే పాలరాయి శిల్పంలా కనిపిస్తారు. దీనికి కారణం చర్మాన్ని తేమగా ఉంచే క్లీన్స్, టోన్లు, మాయిశ్చరైజ్ చేసే మల్టీ స్టెప్ స్కిన్ కేర్, సన్ స్క్రీన్ లోషన్స్ ఉపయోగించడమే. పులియబెట్టిన ఆహారం తీసుకోవడం, రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటం, కంటి నిండా నిద్ర పోవడం, ఒత్తిడి లేకుండా, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం, బరువును అదుపులో ఉంచుకోవడం వంటివి వారి అందానికి కారణాలుగా ఉన్నాయి.

News August 15, 2024

కేటీఆర్ వ్యాఖ్యలపై విచారణకు మహిళా కమిషన్ ఆదేశం

image

TG: మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచేలా ఉన్నాయని కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద Xలో అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై మాట్లాడుతూ ‘బస్సుల్లో కుట్లు, అల్లికలు కాదు. బ్రేక్ డాన్సులు వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు’ అని KTR వ్యాఖ్యానించడం వివాదాస్పదమవుతోంది.

News August 15, 2024

అన్నక్యాంటీన్లు: ఆస్పత్రుల దగ్గర పెడితే..

image

AP: అన్నక్యాంటీన్లలో రూ.15కే కడుపు నింపుకోవచ్చు. తొలి విడతలో ప్రభుత్వం 100 క్యాంటీన్లను ప్రారంభించింది. అయితే ఆస్పత్రుల వద్ద వీటిని ఏర్పాటు చేస్తే చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రోగిని చూసుకునే అటెండెంట్ బయట హోటల్లో ఒక్కపూట భోజనం చేయాలంటే కనీసం రూ.50 నుంచి రూ.80 ఖర్చవుతోంది. వీటి ఏర్పాటుతో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ రూ.15తో చేయొచ్చు. మీరేమంటారు?

News August 15, 2024

కఠిన శిక్షలుంటేనే వీటికి అడ్డుకట్ట: హృతిక్ రోషన్

image

కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై <<13822185>>హత్యాచారం<<>> ఘటన గురించి దేశం మొత్తం చర్చిస్తోంది. తాజాగా దీనిపై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ స్పందించారు. ‘ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండే సమాజం మనకు కావాలి. కానీ అది పరిణామం చెందేందుకు ఏళ్లు పడుతుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కఠినమైన శిక్షలే ఏకైక మార్గం. బాధిత కుటుంబానికి నేను అండగా ఉంటా. నిన్న రాత్రి దాడికి గురైన వైద్యులందరికీ సపోర్ట్‌గా ఉంటా’ అని ట్వీట్ చేశారు.

News August 15, 2024

రోజా, కృష్ణదాస్‌పై సీఐడీకి ఫిర్యాదు.. విచారణకు ఆదేశం

image

AP: మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్‌పై ‘ఆట్యపాట్య’ సంస్థ సీఈవో ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో అవినీతికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా సీపీని సీఐడీ ఏడీజీ ఆదేశించారు.

News August 15, 2024

అన్నక్యాంటీన్లు: రోజుకు ఎంత ఖర్చో తెలుసా?

image

CM చంద్రబాబు ఇవాళ 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. సెప్టెంబర్ చివరి నాటికి 203 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణకు రోజుకు రూ.53 లక్షల ఖర్చు అవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. అల్పాహారానికి రూ.22, మధ్యాహ్న, రాత్రి భోజనానికి కలిపి రూ.68 ఖర్చుతో ఒక్కరికి మూడు పూటలకు రూ.90 అవుతుందని పేర్కొంది. తినేవారు రూ.15 చెల్లిస్తే మిగతా రూ.75 ప్రభుత్వం, దాతలు ఖర్చు పెడతాయి.

News August 15, 2024

ఓ దేశం కంటే పెద్దదైన ఎయిర్‌పోర్టు!

image

విమాన ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈక్రమంలో రద్దీకి అనుగుణంగా విమానాశ్రయాలు సైతం పెరుగుతున్నాయి. అయితే, సౌదీ అరేబియాలోని కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఓ దేశ విస్తీర్ణం కంటే కూడా పెద్దదనే విషయం మీకు తెలుసా? ఈ విమానాశ్రయం 780 చ.కిలోమీటర్ల విస్తీర్ణంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇది మూడు ఎయిర్‌పోర్టులున్న బహ్రెయిన్ దేశం కంటే కూడా పెద్దది.