News November 13, 2024

కలకలం.. టిక్‌టాక్ స్టార్ ప్రైవేట్ వీడియోలు లీక్

image

పాకిస్థాన్‌లో వరుసగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రైవేట్ వీడియోలు లీక్ అవ్వడం సంచలనం రేపుతోంది. తాజాగా టిక్‌టాక్ స్టార్ ఇంషా రెహ్మాన్‌కు సంబంధించిన వ్యక్తిగత వీడియోలు వాట్సాప్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శనమిచ్చాయి. దీంతో ఆమె తన SM అకౌంట్లను డీయాక్టివేట్ చేసినట్లు సమాచారం. గతనెల మరో టిక్‌టాక్ స్టార్ మినాహిల్ మాలిక్ తన బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా గడిపిన వీడియోలూ బయటికి రావడం కలకలం రేపింది.

News November 13, 2024

‘గడియారం’పై విచారణ.. సొంతకాళ్లపై నిలబడాలన్న సుప్రీంకోర్టు

image

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ ఫొటోలు, వీడియోలు వాడరాదని అజిత్ పవార్ వర్గాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కార్యకర్తలకు ఈ విషయం తెలియజేయాలని పేర్కొంది. సొంతకాళ్లపై నిలబడటం నేర్చుకోవాలని జస్టిస్‌లు సూర్యకాంత్, ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం సూచించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ నేతృత్వంలోని NCP గడియారం గుర్తును వాడకుండా ఆదేశించాలన్న పిటిషన్‌ను కోర్టు విచారించింది. NOV 20 మహారాష్ట్రలో పోలింగ్ డే.

News November 13, 2024

విక్కీ కౌశల్ పరశురాముడిగా ‘మహావతార్’!

image

స్త్రీ, భేడియా వంటి సినిమాలతో హిట్లు కొట్టిన దర్శకుడు అమర్ కౌశిక్ పరశురాముడి కథతో ‘మహావతార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ చేస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను తీస్తున్నామని, 2026 క్రిస్‌మస్‌కు రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ తెలిపింది. పూర్తిగా పురాణ గాథలా కాకుండా ఆధునిక కాలానికి, పరశురాముడి కథకు లింక్ ఉండేలా స్క్రీన్ ప్లే ఉంటుందని సమాచారం.

News November 13, 2024

స్టాక్‌మార్కెట్‌లోకి స్విగ్గీ.. స్వాగతించిన జొమాటో

image

స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన స్విగ్గీని దాని పోటీ సంస్థ జొమాటో స్వాగతించింది. ‘యూ అండ్ ఐ.. ఇన్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్’ అంటూ ట్వీట్ చేసింది. మరోవైపు జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ కూడా స్విగ్గీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశానికి కలిసి సేవ చేయడంలో ఇంతకంటే మంచి సంస్థను ఊహించలేం’ అని వ్యాఖ్యానించారు. కాగా GMP సూచించిన దానికంటే ఎంతో మెరుగ్గా స్విగ్గీ ఐపీఓ లిస్ట్ అయిన సంగతి తెలిసిందే.

News November 13, 2024

పోలీసులకు అంబటి సవాల్.. ఆ తర్వాత

image

AP: హోంమంత్రి అనితపై అసభ్య పోస్టులు పెట్టిన YCP కార్యకర్తను మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు పట్టించారు. నకరికల్లుకు చెందిన రాజశేఖర్ రెడ్డి గతంలో అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై నూజివీడులో కేసు నమోదు కావడంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో రాజశేఖర్ తమ ఆఫీస్‌లోనే ఉన్నాడని, దమ్ముంటే అరెస్ట్ చేయాలని అంబటి సవాల్ విసరడంతో పోలీసులు నేరుగా వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు.

News November 13, 2024

అధికారులపై దాడి ఘటనలో BRS శక్తులు: సీఎం సోదరుడు

image

CM పేరు, ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకే కేటీఆర్ అధికారులపై దాడులు చేయిస్తున్నారని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అన్నారు. వికారాబాద్(D) లగచర్లలో అధికారులపై దాడి వెనుక BRS శక్తులు పని చేశాయని ఆరోపించారు. తాము హరీశ్ రావు లాగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం రాత్రికి రాత్రే గ్రామాలను ఖాళీ చేయించి రైతులను కొట్టలేదని వ్యాఖ్యానించారు. నిందితులు ఎంతటి వారైనా పోలీసులు అరెస్టు చేసి తీరుతారని స్పష్టంచేశారు.

News November 13, 2024

కోహ్లీని కించపరచడం నా ఉద్దేశం కాదు: పాంటింగ్

image

విరాట్ ఐదేళ్లలో రెండే టెస్టు సెంచరీలు చేశారంటూ తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాంటింగ్ వివరణ ఇచ్చారు. ‘విరాట్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు. AUSతో BGT సమయానికి ఫామ్ అందుకోకపోతే ఇబ్బంది పడతారని చెప్పాను. ఈ విషయంలో కోహ్లీ కూడా నాతో ఏకీభవిస్తారు. తను ఆస్ట్రేలియాలో పుంజుకుంటారని కూడా నేను అన్నాను. కానీ నా మాటలు వక్రీకరించి ప్రచారమయ్యాయి ’ అని వ్యాఖ్యానించారు.

News November 13, 2024

సల్మాన్ ఖాన్‌కు బెదిరింపుల కేసులో TWIST

image

రూ.5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని సల్మాన్‌కు, అతడి కొత్త సినిమాలో పాటల రచయిత సొహైల్ పాషాకు ఇటీవల బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఆసక్తికర ట్విస్ట్ వెలుగుచూసింది. బెదిరించింది సదరు రచయితేనని పోలీసులు తేల్చారు. అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. తన పాట ఫేమస్ అయ్యేందుకు సల్మాన్‌కు, తనకు బిష్ణోయ్‌ గ్యాంగ్ పేరిట తానే ఆ మెసేజ్ పంపినట్లు నిందితుడు పోలీసుల వద్ద అంగీకరించాడు.

News November 13, 2024

అణు రియాక్టర్లపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

image

థర్మల్ ప్లాంట్ల గడువు ముగిసినా, లేదా బొగ్గు సదుపాయం లేని రాష్ట్రాలు అణు విద్యుత్ ప్లాంట్లు ప్రారంభించాలని కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ సూచించారు. కరెంట్‌కు నానాటికీ డిమాండ్ పెరుగుతోందని తాజాగా జరిగిన విద్యుత్ మంత్రుల సదస్సులో గుర్తుచేశారు. దేశంలో 24 అణువిద్యుత్ ప్లాంట్స్ నుంచి 8 గిగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుండగా 2032 కల్లా దాన్ని 20 గి.వాట్లకు పెంచాలని కేంద్రం భావిస్తోంది.

News November 13, 2024

అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు సమంజసమే: హైకోర్టు

image

AP: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు చేస్తే తప్పేం లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కేసులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని సూచించింది. కాగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని విజయబాబు హైకోర్టులో పిల్ వేయగా ధర్మాసనం ఇవాళ విచారించింది.