News August 15, 2024
SBI ఇండిపెండెన్స్ డే షాక్.. వడ్డీరేట్ల పెంపు
కస్టమర్లకు SBI షాకిచ్చింది. రుణాల వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర సవరించింది. పెరిగిన వడ్డీరేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తాయంది. వరుసగా మూడో నెల బ్యాంకు వడ్డీరేట్లను పెంచడం గమనార్హం. తాజా సర్దుబాటుతో MCLR రేట్లు పెరుగుతాయి. దీంతో వేర్వేరు కాల వ్యవధుల్లో తీసుకొనే రుణాల ఖర్చు, వడ్డీ భారం అధికమవుతాయి. యూకో, కెనరా, బరోడా సహా పబ్లిక్ బ్యాంకులు కొన్ని రోజుల ముందే MCLR రేట్లను పెంచడం గమనార్హం.
Similar News
News September 18, 2024
భారత్‌లో లెనోవో ఏఐ సర్వర్ల తయారీ
భారత్‌లోని తమ ‘పుదుచ్ఛేరి’ ప్లాంట్‌లో ఏటా 50వేల ఏఐ ర్యాక్ సర్వర్లు, 2400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు(GPU) ఉత్పత్తి చేయనున్నట్లు లెనోవో ప్రకటించింది. ఈ ఉత్పత్తుల్ని భారత్‌లో అమ్మడంతో పాటు ఎగుమతులూ చేస్తామని వివరించింది. బెంగళూరులో ఓ ఏఐ కేంద్రీకృత ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. యాపిల్, ఫాక్స్‌కాన్, డెల్ సంస్థల తరహాలోనే లెనోవో కూడా చైనాలో పెట్టుబడులు తగ్గించి భారత్‌లో పెంచుతోంది.
News September 18, 2024
బాధితులకు వైఎస్ జగన్ ఆర్థిక సాయం
AP: ప్రత్యర్థుల దాడిలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కాశీవారిపాకలకు చెందిన పోలవరపు లోవలక్ష్మికి రూ.లక్ష, వాసంశెట్టి శ్రీలక్ష్మికి రూ.50 వేల సాయం అందించారు. ఇటీవల జగన్ పిఠాపురం పర్యటనకు వెళ్లగా, బాధితులు ఆయనకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి సాయం చేయడంతోపాటు లీగల్ టీమ్ కూడా ఏర్పాటు చేశారు.
News September 18, 2024
చిలుకను పట్టిస్తే రూ.10వేలు రివార్డు
తమ చిలుక సమాచారమిస్తే రూ.10వేలు రివార్డిస్తామంటూ అయోధ్యలో వెలిసిన పోస్టర్లు ఇంట్రెస్టింగా మారాయి. UP ఫైజాబాద్‌లోని శైలేశ్ కుమార్ ఈ ‘మిట్టూ’ చిలకను పెంచుకుంటున్నారు. 20 రోజుల క్రితం పొరపాటున పంజరం తెరవడంతో ఎగిరిపోయి ఇంటికి తిరిగి రాలేదన్నారు. తెలివైన, చక్కగా శిక్షణ పొందిన మిట్టూ మనుషుల గొంతును అనుకరించేదని, ఇంటికొచ్చిన గెస్టులను పేరుపెట్టి పిలిచేదన్నారు. దాని జాడ తెలీక వారి కుటుంబం వర్రీ అవుతోందట.