News March 19, 2024

24 గంటల వ్యవధిలోనే డీజీపీని మార్చిన ఈసీ

image

ఈసీ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. 24 గంటల వ్యవధిలోనే పశ్చిమబెంగాల్ డీజీపీని మార్చింది. నిన్న రాజీవ్ కుమార్ స్థానంలో వివేక్ సహాయ్‌ను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన స్థానంలో సంజయ్ ముఖర్జీని నియమించింది. ఈసీ నిర్ణయం కాస్త రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

News March 19, 2024

అతిపెద్ద గేమ్ షో.. బహుమతి రూ.41 కోట్లు!

image

వరల్డ్ మోస్ట్ పాపులర్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డోనాల్డ్‌సన్) తన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. తాను అతిపెద్ద గేమ్ షోను చిత్రీకరించబోతున్నానని ట్వీట్ చేశారు. దీనిని అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేస్తామని చెప్పారు. ఈ గేమ్ షోలో వెయ్యి కంటే ఎక్కువ మంది గేమర్స్ పోటీ పడతారని, 5 మిలియన్ల డాలర్ల ( దాదాపు రూ.41 కోట్లు) బహుమతి ఉంటుందని తెలిపారు. దీనికి కాస్త టైమ్ పడుతుందని వెల్లడించారు.

News March 19, 2024

సీఏఏ మంచి చట్టమే: బబోన్స్

image

అమెరికాకు చెందిన ప్రముఖ సామాజికవేత్త సాల్వటోర్ బబోన్స్ సీఏఏ అమలును సమర్థించారు. ఓ మంచి చట్టాన్ని రాజకీయ లబ్ధి కోసం కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ‘రైజింగ్ భారత్ సమ్మిట్-2024’కు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, అఫ్గాన్, బంగ్లాదేశ్‌ నుంచి 2014 DEC 31కి ముందు భారత్‌లో స్థిరపడిన హిందూ, సిక్కు, బుద్ధిస్ట్, జైన్, పార్సీ, క్రిస్టియన్ మైనార్టీలకు CAAతో భారత పౌరసత్వం రానుంది.

News March 19, 2024

ప్రొద్దుటూరులో జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ: సజ్జల

image

AP: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ బస్సు యాత్ర చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 27 నుంచి ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల యాత్రలు ఉంటాయి. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

News March 19, 2024

CAA: కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

image

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. కాగా దీనికి కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది తుషార్ మెహతా కోర్టును అభ్యర్థించారు. దీంతో ఏప్రిల్ 9న తదుపరి విచారణ చేస్తామని సుప్రీం వెల్లడించింది. స్టే ఇవ్వకపోవడంతో CAA అమలు కొనసాగనుంది. ఇదిలా ఉంటే ఈ చట్టం ఎవరి పౌరసత్వాన్ని లాక్కోదని మెహతా వివరించారు.

News March 19, 2024

సూర్య హార్ట్ బ్రేక్ పోస్ట్

image

ఐపీఎల్ ముంగిట ముంబై ఇండియన్స్ 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టారు. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో అతడికి చీలమండ గాయం కాగా జనవరిలో సర్జరీ చేయించుకున్నారు. ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించనట్లు తెలుస్తోంది. ఈ కారణంతో ఐపీఎల్ సీజన్-17 ఆడేందుకు అతడికి జాతీయ క్రికెట్ అకాడమీ NOC ఇవ్వనట్లు సమాచారం. దీంతోనే సూర్య హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టినట్లు వార్తలొస్తున్నాయి.

News March 19, 2024

71,246 మంది ‘డిపాజిట్’ గల్లంతు

image

దేశంలో 1951 నుంచి ఇప్పటి వరకు లోక్‌సభ ఎన్నికల్లో 91,160 మంది పోటీ చేయగా, 71,246 మంది <<12002638>>డిపాజిట్<<>> కోల్పోయినట్లు EC డేటాలో వెల్లడైంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి 1951లో జనరల్ అభ్యర్థులకు ₹500, SC, STలకు ₹250 సెక్యూరిటీ డిపాజిట్ ఉండేది. ప్రస్తుతం ఆ మొత్తం జనరల్ క్యాండిడేట్లకు ₹25వేలు, ఎస్సీ, ఎస్టీలకు ₹12,500గా ఉంది. పోలైన ఓట్లలో ఆరోవంతు ఓట్లు రాకుంటే ఆ మొత్తం ఈసీ ట్రెజరీకి వెళ్తుంది.
<<-se>>#ELECTIONS2024<<>>

News March 19, 2024

విమానం బాత్‌రూమ్‌లో ఆత్మహత్యాయత్నం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

image

తైవాన్‌కు చెందిన ఇవా ఎయిర్‌లైన్స్ విమానం గాలిలో ఉండగా బాత్‌రూమ్‌లో ప్రయాణికుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకాక్ నుంచి లండన్ వెళ్తోన్న విమానంలో ఓ వ్యక్తి బాత్‌రూమ్‌కు వెళ్లి ఎంతసేపటికీ రాలేదు. సిబ్బంది అనుమానంతో ఓపెన్ చేసి చూడగా అతను కొనప్రాణాలతో ఉన్నాడు. దీంతో హిత్రూ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

News March 19, 2024

సీఎంవోకి చేరిన చిలకలూరిపేట పంచాయితీ

image

AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ పంచాయితీ తాడేపల్లికి చేరింది. స్థానిక వైసీపీ నేత మల్లెల రాజేశ్ నాయుడిని CM జగన్ పిలిపించి మాట్లాడారు. ఇటీవల ఇన్‌ఛార్జ్‌‌గా రాజేశ్‌‌ని తప్పించిన అధిష్ఠానం గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిని చిలకలూరిపేట అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో టికెట్ కోసం మంత్రి రజినీ రూ.6.5కోట్లు తీసుకున్నారని రాజేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బయటి వారికి టికెట్ ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు.

News March 19, 2024

ఖమ్మం టికెట్ నాకే వస్తుంది: జలగం

image

TG: ఇటీవల BJPలో చేరిన జలగం వెంకటరావు రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిశారు. ఖమ్మం టికెట్ విషయమై పార్టీ పెద్దలతో ఆయన చర్చించారు. MP టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు. వరంగల్ టికెట్ మాత్రమే ఆపితే బాగోదని ఖమ్మం కూడా ఆపారని చెప్పారు. ఖమ్మం టికెట్ TDPకి ఇస్తారన్నది కేవలం ప్రచారమేనని స్పష్టం చేశారు.