News August 15, 2024
సమంత పోస్టు.. చైతూ గురించేనా?
నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ నేపథ్యంలో చైతూ మాజీ భార్య సమంత ఇన్‌స్టా పోస్టు చర్చనీయాంశమైంది. ‘ది మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వయిట్’ అని రాసి ఉన్న టీషర్టును ధరించిన ఆమె తలకు చేయి పెట్టుకుని సెల్ఫీ తీసుకున్నారు. అయితే సామ్ పరోక్షంగా మిడిల్ ఫింగర్ చూపిస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ రాజ్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నారన్న రూమర్లకూ కౌంటర్ ఇచ్చారని మరికొందరు అంటున్నారు.
Similar News
News September 19, 2024
చెప్పిన తేదీకే మెగాస్టార్ ‘విశ్వంభర’ విడుదల
మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీలో మార్పులుంటాయని వస్తోన్న వార్తలపై డైరెక్టర్ వశిష్ట క్లారిటీ ఇచ్చారు. ‘10-1-2025 విజృంభణం.. విశ్వంభర ఆగమనం!’ అని ట్వీట్ చేశారు. దీంతో ‘విశ్వంభర’ సంక్రాంతికి రిలీజ్ అవనుంది. అయితే, మూవీ టీజర్ అయినా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూడు నెలలు కూడా లేదని, అప్డేట్స్ ఇస్తూ మూవీపై ఆసక్తి పెంచాలని కోరుతున్నారు.
News September 19, 2024
ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి: షర్మిల
AP: తిరుమలను అపవిత్రం చేస్తూ TDP, YCPలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ‘లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారన్న CBN వ్యాఖ్యలు తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయి. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే తక్షణం ఉన్నతస్థాయి కమిటీ వేయండి. లేదా CBIతో విచారణ జరిపించండి. ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి’ అని ట్వీట్ చేశారు.
News September 19, 2024
సీబీఐ విచారణ వేయండి: అంబటి రాంబాబు
AP: తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు దుర్మార్గపు ఆరోపణ చేయడం సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘రాజకీయ లబ్ధి కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతావా చంద్రబాబు’ అని వైసీపీ ట్వీట్ చేసింది. కాగా, నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారుచేశారని చంద్రబాబు నిన్న వ్యాఖ్యానించారు.