India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రాష్ట్రంలో డిగ్రీ సిలబస్ మారబోతోంది. 2019 నుంచి అవసరాలకు తగ్గట్లు కొత్త అంశాలు చేర్చలేదనే విమర్శలున్నాయి. దీంతో డిగ్రీ పాఠ్యాంశాలు మార్చేందుకు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఏటా సుమారు 2లక్షల మంది డిగ్రీలోని వివిధ కోర్సుల్లో చేరుతున్నారు. అటానమస్ కాలేజీలు సిలబస్‌లో మార్పులు చేసుకుంటుండగా, మిగతా వాటిల్లో అది జరగట్లేదు. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి తాజా నిర్ణయం తీసుకుంది.

స్విగ్గీ ఉద్యోగులు జాక్‌పాట్ కొట్టేశారు. ESOP విధానంలో కంపెనీ వారికి షేర్లు కేటాయించినట్టు తెలిసింది. 5000 మంది ఉద్యోగులు రూ.9000 కోట్లమేర పొందబోతున్నారు. అందులో 500 మంది కోటీశ్వరులు అవుతున్నారు. కంపెనీ కో ఫౌండర్స్ శ్రీహర్ష, నందన్ రెడ్డి, ఫణికిషన్, ఫుడ్ మార్కెట్ ప్లేస్ CEO రోహిత్, INSTAMART హెడ్ అమితేశ్, CFO రాహుల్, HR హెడ్ గిరీశ్, CTO మధుసూదన్ సహా మరికొందరికే రూ.1600 కోట్లు దక్కినట్టు సమాచారం.

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కంటే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయనే మెరుగైన బౌలర్ అని సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ పాల్ ఆడమ్స్ పేర్కొన్నారు. ‘లయన్ ఒక కంప్లీట్ బౌలర్. ఉపఖండపు పిచ్‌లైనా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పిచ్‌లైనా ప్రభావం చూపించగలరు. అశ్విన్ కంటే లయనే బ్యాటర్లను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటారు’ అని వివరించారు. లయన్ 129 మ్యాచుల్లో 530 వికెట్లు తీయగా అశ్విన్ 105 టెస్టుల్లో 536 వికెట్స్ తీశారు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందించేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య టీమ్ ఇవాళ ఆర్జీవీకి సమన్లు అందజేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వ్యక్తిత్వాలు కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైంది.

బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, FIIలు వెళ్లిపోతుండటం, డాలర్ బలపడటం నెగటివ్ సెంటిమెంటుకు దారితీశాయి. సెన్సెక్స్ 78,384 (-300), నిఫ్టీ 23,765 (-118) వద్ద ట్రేడవుతున్నాయి. Pvt Banks మినహా అన్ని రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. మీడియా, ఆటో, మెటల్ షేర్లు విలవిల్లాడుతున్నాయి. M&M, BEL, TATA STEEL, HEROMOTO, HINDALCO టాప్ లూజర్స్.

టీమ్ ఇండియా క్రికెటర్ యశస్వీ జైస్వాల్ అన్న తేజస్వీ జైస్వాల్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. త్రిపుర తరఫున బరోడాతో జరిగిన మ్యాచ్‌లో తేజస్వీ (87) అర్ధ సెంచరీ సాధించారు. కాగా తొలుత యశస్వీ, తేజస్వీ ఇద్దరూ క్రికెట్ ఆడేవారు. కానీ యశస్వీ కోసం తేజస్వీ క్రికెట్ వదిలి ఢిల్లీలోని ఓ దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో యశస్వీ నిలదొక్కుకున్నాక తేజస్వీ మళ్లీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు.

ఫుడ్ ఐటమ్స్ డెలివరీ విషయంలో ఈకామర్స్ సంస్థలకు FSSAI కీలక ఆదేశాలిచ్చింది. డెలివరీ సమయానికి ఫుడ్ ఐటమ్స్ నిల్వకాలం మరో 30% ఉండేలా చూసుకోవాలని చెప్పింది. లేదా ఎక్స్‌పైరీ డేట్ కనీసం మరో 45రోజులుండాలని పేర్కొంది. లేబుల్స్‌పై లేని సమాచారాన్ని ప్రకటనల్లో చూపించవద్దని పేర్కొంది. ఆహార, ఆహారేతర వస్తువులను వేర్వేరుగా డెలివరీ చెయ్యాలని, తద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని చెప్పింది.

జనాభాను నియంత్రించిన దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని CM రేవంత్ అన్నారు. ‘దక్షిణాది రాష్ట్రాల నుంచి దేశానికి ఒక రూపాయి పోతే కేంద్రం నుంచి 40 పైసలు మాత్రమే వస్తుంది. బిహార్ ఒక రూపాయి ఇస్తే రూ.7.06 వస్తుంది. 2025 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకు 800 ఎంపీ సీట్లు వస్తాయి. సౌత్‌లో 123కి తగ్గిపోతాయి. దీంతో కేంద్రంలో సౌత్ పాత్ర తగ్గిపోతుంది’ అని IE ప్రోగ్రాంలో చెప్పారు.

సుధీర్ బాబు హీరోగా నటించిన ఎమోషనల్ డ్రామా ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నవంబర్ 15 నుంచి జీ5లోకి వస్తుందని అనౌన్స్ చేసినా.. ఇవాళ్టి నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో సాయాజీ షిండే, సుధీర్ బాబు తండ్రీకొడుకులుగా నటించారు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కలెక్షన్ అంతగా రాబట్టలేకపోయింది.

ముంబై క్రికెటర్ ఆయుష్ మాత్రేను వేలంలో దక్కించుకుని ఓపెనర్‌గా ఆడించాలని CSK భావిస్తున్నట్లు తెలుస్తోంది. అతడి బ్యాటింగ్ చూసి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇంప్రెస్ అయ్యారని, ట్రయల్స్‌కు కూడా పిలిపించారని సమాచారం. ఇందుకు MCAను CSK అనుమతి కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఆయుష్ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తారని టాక్. 17 ఏళ్ల ఆయుష్ 5 మ్యాచుల్లోనే 321 పరుగులు బాదారు.
Sorry, no posts matched your criteria.