India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: కొడంగల్ BRS మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో నరేందర్ రెడ్డి కుట్రకు పాల్పడినట్లు <<14590479>>ఆరోపణలు<<>> ఉన్నాయి. దాడిలో కీలక సూత్రధారిగా ఉన్న BRS నేత సురేశ్ ఆరోజు నరేందర్ రెడ్డికి కాల్స్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిని తాజాగా హైదరాబాద్ ఫిలింనగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్ ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. మట్కా సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నారు. నిన్న విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న వరుణ్ అండ్ కో అనంతరం తిరుమలకు వెళ్లారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని వరుణ్, మట్కాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు.

AP: జలవిద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి జరుపుతున్న నీటి తరలింపును తక్షణమే ఆపాలని KRMB (కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్) పేర్కొంది. ఈ మేరకు AP, TG జలవనరుల శాఖ కార్యదర్శులకు లేఖ రాసింది. ఎగువ నుంచి వరద ఆగిపోయినా నీటి తరలింపు, విద్యుదుత్పత్తి చేయడం వల్ల నీటి నిల్వలు అడుగంటుతున్నాయని తెలిపింది. అటు APలో పోతిరెడ్డిపాడు, ఇటు TGలో సాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇవాళ మ.3 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన మాట్లాడనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. రూ.2.94లక్షల కోట్ల బడ్జెట్ ప్రజలను నిరాశకు గురిచేసిందని ఇప్పటికే ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాము అసెంబ్లీకి హాజరుకాకుండా మీడియా ద్వారా ప్రశ్నిస్తామని జగన్ 3 రోజుల క్రితం ప్రకటించారు.

చలికాలంలో చాలా మందికి అనారోగ్యం చేస్తుంది. దీనికి కారణం రోగ నిరోధకశక్తి లేకపోవడమే. కానీ కొన్ని పదార్థాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్, ఫైబర్, ఐరన్ ఉండే బాదం, జీడిపప్పు తింటే శరీరంలోని కండరాలు, నరాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే వాల్ నట్స్, అంజీర్, పిస్తా పప్పు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నాన్ వెజ్, డీప్ ఫ్రైలకు దూరంగా ఉండటం బెటర్.

డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ సమర్థత శాఖ(Department of Government Efficiency)కి వీరు నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు. ‘అధిక నిబంధనల తొలగింపు, వృథా ఖర్చుల తగ్గింపు, ఫెడరల్ సంస్థల పునర్నిర్మాణం వంటి అంశాల్లో వీరు కీలకంగా వ్యవహరిస్తారు. సర్కారు వనరుల్ని వృథా చేస్తున్నవారికి నా నిర్ణయం కచ్చితంగా షాకిస్తుంది’ అని ట్రంప్ తెలిపారు.

TG: రైతులకు అవసరమైన యంత్రాలు, ఉపకరణాలను రాయితీపై సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రోటోవేటర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పవర్ వీడర్లు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లను అందిస్తామని చెప్పారు. జిల్లాల వారీగా ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని యంత్ర పరికరాలు, పనిముట్ల జాబితాను తయారు చేశామన్నారు. యాసంగి సీజన్ ప్రారంభంలోనే వీటిని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

TG: రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరిగింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చల్లటి గాలులు వీస్తున్నాయి. నిన్న మెదక్‌లో అత్యల్పంగా 14.2°C ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు సైతం చాలా జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా ఉంటున్నాయి. మరోవైపు నేడు, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.

భారత మాజీ క్రికెటర్ ధోనీకి ఝార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, సౌమ్య దాస్ తనను రూ.15కోట్ల మేర మోసం చేశారని JAN 5న రాంచీలో ధోనీ కంప్లైంట్ చేశారు. అయితే స్థానిక జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తమపై ఆదేశించిన విచారణను సవాలు చేస్తూ దివాకర్, దాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కోర్టు తన స్టాండ్ ఏంటో చెప్పాలని ధోనీకి నోటీసులు ఇచ్చింది.

AP: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ఈరోజు సభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగిస్తూ చట్టాల్లో సవరణకు ఒక బిల్లుతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు సవరణ బిల్లు స్పీకర్ ముందుకు తీసుకురానున్నారు. కాగా ఈ సమావేశాలు నవంబర్ 22 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.