News August 13, 2024

తుంగభద్ర గేట్‌ను పునరుద్ధరిస్తాం: ఏపీ మంత్రులు

image

AP: తుంగభద్ర డ్యామ్ గేట్‌ను పునరుద్ధరిస్తామని ఏపీ మంత్రులు రామానాయుడు, పయ్యావుల కేశవ్ తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి డ్యామ్‌ను పరిశీలించారు. చైన్ కట్ కావడంతోనే 19వ గేట్ కొట్టుకుపోయినట్లు తెలిపారు. ఆ గేట్ నుంచి 35 వేల క్యూసెక్కుల నీరు వెళ్తోందని చెప్పారు. డ్యామ్‌లో నీటి మట్టం తగ్గాకే పునరుద్ధరణ సాధ్యమని, నారాయణ ఇంజినీరింగ్ ఏజెన్సీ ఆ పనులు చేపడుతుందని తెలిపారు.

News August 13, 2024

జావా యెజ్డీ నుంచి ‘జావా 42’ లాంచ్.. వివరాలివే!

image

జావా ఎజ్డీ మోటార్‌సైకిల్స్ సంస్థ ఈరోజు ‘జావా 42’ బైక్‌ను లాంఛ్ చేసింది. 14 రకాల రంగుల ఆప్షన్స్, కొత్త ఇంజిన్, 42 అప్‌గ్రేడ్స్ ఈ మోడల్‌లో ప్రవేశపెట్టినట్లు సంస్థ పేర్కొంది. 294 సీసీ జే-పాంథర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, 6 గేర్లు, సీపీ4 సిలిండర్ ఈ బైక్‌లో ఉన్నాయి. ఎక్స్-షోరూమ్‌లో ధర రూ.1.73 లక్షలుగా ఉండగా, హై ఎండ్ మోడల్‌ రూ.1.98 లక్షల వరకు ఉంటుందని సంస్థ తెలిపింది.

News August 13, 2024

చంద్రబాబుతో సునీతా కృష్ణన్ భేటీ

image

పద్మ శ్రీ గ్రహీత సునీతా కృష్ణన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన ఆటో బయోగ్రఫీ ‘IAm What IAm’ పుస్తకాన్ని ఆయనకు బహూకరించారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌ని నివారించేందుకు సహకరించాలని CBNకి విజ్ఞప్తి చేశారు. మీటింగ్‌లో ‘సెక్స్ అఫెండర్స్ రిజిస్ట్రీ’పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. తనకోసం విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.

News August 13, 2024

ALERT.. కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, హైదరాబాద్, గద్వాల్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, భువనగిరిలో గంటకు 40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News August 13, 2024

ఢిల్లీలో జెండా ఎగురవేసేది ఎవరు?

image

స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండా ఎవరు ఎగురవేయాల‌నే విష‌యంపై ఢిల్లీ ప్ర‌భుత్వంలో సందిగ్ధ‌త నెల‌కొంది. ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హించే వేడుక‌ల్లో మంత్రి ఆతిశీ జెండా ఎగుర‌వేస్తార‌ని సీఎం కేజ్రీవాల్ జైలు నుంచే అధికారుల‌ను ఆదేశించారు. అయితే, జైలు నుంచి సీఎం ఇచ్చిన ఆదేశాలు న్యాయ‌ప‌రంగా చెల్ల‌వ‌ని, దీనిపై చ‌ర్య‌లు తీసుకోలేమ‌ని జీఏడీ ACS న‌వీన్ కుమార్ తేల్చిచెబుతున్నారు.

News August 13, 2024

పెయింట్-3Dని ఆపేస్తున్న మైక్రోసాఫ్ట్‌

image

పెయింట్-3డీని ఈ ఏడాది నవంబరు తర్వాతి నుంచి ఆపేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. తొలిసారిగా విండోస్-10లో దీన్ని సంస్థ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చాలా తక్కువమంది దాన్ని వాడటం, వేరే అప్లికేషన్లను ప్రవేశపెట్టే ఆలోచన ఉండటంతోనే నిలిపివేస్తున్నట్లు సంస్థ వివరించింది. ప్రస్తుతం వాడుతున్న వారికి యథావిధిగా పనిచేస్తుందని, నవంబరు నుంచి కొత్తగా అప్‌డేట్స్ లేదా డౌన్‌లోడ్స్‌కు వీలు ఉండదని తెలిపింది.

News August 13, 2024

Stock Market: భారీ నష్టాలు

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం భారీ న‌ష్టాలు మూట‌గ‌ట్టుకున్నాయి. సెబీ చీఫ్ మాధ‌బిపై హిండెన్‌బ‌ర్గ్ ఆరోప‌ణ‌లు చేసి ఒక రోజు ట్రేడింగ్ సెష‌న్ ముగిసిన త‌రువాత సూచీలు నష్టాల బాటపట్టడం గమనార్హం. సెన్సెక్స్ 692 పాయింట్ల నష్టంతో 78,956 వద్ద నిలిచింది. నిఫ్టీ 208 పాయింట్లు న‌ష్ట‌పోయి 24,150 దిగువకు చేరింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లు టాప్ లూజ‌ర్స్‌గా నిలిచాయి.

News August 13, 2024

సీబీఐకి ట్రైనీ డాక్టర్ హత్య కేసు

image

బెంగాల్‌లో వైద్య విద్యార్థిని హత్యాచారం కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. రేపు ఉదయం 10 గంటల్లోపు ఈ కేసు విచారణ దస్త్రాలన్నింటినీ సీబీఐకి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేసు విచారణ సందర్భంగా మెడికల్ కాలేజీ నిర్వహణ లోపాలను న్యాయస్థానం ఎత్తిచూపింది.

News August 13, 2024

ఈ నెల 22న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు

image

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణల నడుమ ఈ నెల 22న దేశ వ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టడంతో పాటు సెబీ చీఫ్ మాధబి బుచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. పార్టీ నేతలతో సమావేశం తర్వాత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ ప్రకటన చేశారు. అదానీ గ్రూపులో సెబీ చీఫ్ పెట్టుబడులు పెట్టారని హిండెన్ బర్గ్ నివేదిక ఆరోపించిన సంగతి తెలిసిందే.

News August 13, 2024

రోహిత్ శర్మ కెప్టెన్సీపై ద్రవిడ్ ప్రశంసలు

image

రోహిత్ శర్మ నాయకత్వంపై భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించారు. ఆటగాళ్లు అతడి లీడర్‌షిప్ పట్ల ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ‘జట్టు రాణించడం అనేది కచ్చితంగా కెప్టెన్‌పైనే ఆధారపడి ఉంటుంది. రోహిత్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. ఈ రెండున్నరేళ్లలో తానెంత అద్భుతమైన నాయకుడో గమనించాను. కోహ్లీ, అశ్విన్ వంటి సీనియర్లు కూడా నాకు బాగా సహకరించారు’ అని తెలిపారు.