News August 12, 2024

రేపు ఏపీలో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో , కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది.

News August 12, 2024

విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకం: ప్రధాన్

image

ప‌శ్చిమ‌ బెంగాల్‌లో శాంతిభద్రతలు క్షీణించాయ‌ని, ముఖ్యంగా విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకమైందని కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ విమ‌ర్శించారు. కోల్‌క‌తాలో ట్రైనీ డాక్ట‌ర్ హత్య ఘటనపై ఆయ‌న స్పందిస్తూ.. కొన్ని రోజుల క్రితం జాదవ్‌పూర్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుందని చెప్పారు. ప్రభుత్వం బాధ్యులపై క‌ఠిన‌ చర్యలు తీసుకోవాలని, ఘ‌ట‌న‌కు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

News August 12, 2024

పెట్ డాగ్సా మజాకా!

image

మీ ఇంట్లో ఉండే పిల్లల కంటే కూడా పెంపుడు కుక్కలే ఎక్కువ ప్రేమను కోరుకుంటాయనే విషయం మీకు తెలుసా? కుక్కలు తమ యజమానుల దృష్టిని ఆకర్షించేందుకు గాయమైనట్లు, హెల్త్ బాలేనట్లు నటిస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. అయితే కొన్నిసార్లు నిజంగా అనారోగ్యానికి గురైనప్పుడు అశ్రద్ధ చేయకుండా వెటర్నరీ డాక్టర్‌కు చూపించడం మేలు. అందుకే వాటితో టైమ్ స్పెండ్ చేయడం, వాటి జీవనవిధానంలో మార్పులేమైనా వచ్చాయా? అనేది గమనిస్తూ ఉండాలి.

News August 12, 2024

మాటలే.. ఆటల్లేవ్!

image

140కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియా ఒలింపిక్స్‌ మెడల్స్‌ జాబితాలో 71వ స్థానంలో నిలవడంతో దేశం మొత్తం హవ్వా అంటోంది. ఒలింపిక్స్ నిర్వహించే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకొస్తామని ఒకరంటే.. క్రీడలే ఉద్యోగ భద్రతనిస్తాయని మరొకరంటున్నారు. క్రీడల కోసం నిధులూ కేటాయిస్తున్నామని చెబుతున్నారు. మరి మాటలకు చేతలకు పొంతన ఉందా? వాస్తవానికి 70% గ్రామాల్లో క్రీడా మైదానాలు లేవు. అంతెందుకు మీ ఊరిలో మైదానం ఉందా?

News August 12, 2024

అన్న క్యాంటీన్ల ప్రారంభం ఎప్పుడంటే?

image

AP: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న ఉదయం 6:30 గంటలకు కృష్ణా(D) ఉయ్యూరులో చంద్రబాబు క్యాంటీన్‌ను ప్రారంభిస్తారని మంత్రి నారాయణ తెలిపారు. మరుసటి రోజు 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారని వెల్లడించారు. తొలి విడతలో 100 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. వీటికి ఆహార సరఫరా కాంట్రాక్టును హరేకృష్ణ ఫౌండేషన్‌కు అప్పగించారు.

News August 12, 2024

USలో ఉంటున్న గుజరాత్ టీచర్‌కు నెలనెలా జీతం!

image

టీచర్ అంటే సమాజానికి ఆదర్శంగా ఉండాలి. కానీ గుజరాత్‌లోని బనస్కాంతలో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ భావన పటేల్ అందుకు విరుద్ధం. 8ఏళ్లుగా USలో ఉంటూ పని చేయకున్నా నెలనెలా జీతం తీసుకుంటున్నారు. విద్యార్థులు, గ్రామస్థుల ఫిర్యాదుతో వ్యవహారం బయటికొచ్చింది. అయితే దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ అంటున్నారు. ఆమెకు తాజాగా షోకాజ్ నోటీసు ఇచ్చారని సమాచారం.

News August 12, 2024

రేపే ‘సరిపోదా శనివారం’ ట్రైలర్

image

నేచురల్ స్టార్ నానీ, ప్రియాంక మోహన్ హీరోహీరోయిన్లుగా నటించగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ట్రైలర్ రేపు రిలీజ్ కానుంది. దీనిని రేపు సాయంత్రం 5 గంటలకు HYDలోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో గల సుదర్శన్ థియేటర్‌లో రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో నాని కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందించారు.

News August 12, 2024

ఎవ‌రీ జార్జ్ సోరోస్?

image

హిండెన్‌బ‌ర్గ్ ఈసారి సెబీ చీఫ్‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డంతో జార్జ్ సోరోస్ పేరు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. హంగేరియ‌న్‌-అమెరిక‌న్ బిజినెస్‌మ్యాన్ అయిన సోరోస్‌ హిండెన్‌బ‌ర్గ్‌లో ప్ర‌ధాన వాటాదారుగా ఉండి ఎన్డీయే ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నార‌ని బీజేపీ ఆరోపిస్తోంది. అత‌ని స‌న్నిహితులతో సంబంధాలున్న కాంగ్రెస్ నేత‌లు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను అస్థిర‌ప‌ర‌చ‌డానికి ప్రయత్నిస్తున్నారన్నది BJP ఆరోప‌ణ‌.

News August 12, 2024

వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు రోదసిలోనే సునీత?

image

బోయింగ్ స్టార్‌‌లైనర్‌లో సమస్యలు తలెత్తడంతో మరో వ్యోమగామితో కలిసి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయం పట్టొచ్చని నాసా పేర్కొంది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్‌ సాయంతో వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. 10 రోజుల మిషన్ కోసం ఈ ఏడాది జూన్ 6న సునీత ISSకు వెళ్లారు.

News August 12, 2024

అందుకు కేంద్రాన్ని మెచ్చుకోవాల్సిందే: థరూర్

image

బంగ్లాదేశ్ PM పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనాకు భారత ప్రభుత్వం ఆశ్రయం ఇవ్వడాన్ని కాంగ్రెస్ MP శశి థరూర్ ప్రశంసించారు. భారత్ 1971లోనూ బంగ్లాదేశ్ ప్రజలతో ఉందని, ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. ‘హసీనాకు మనం సాయం చేసి ఉండకపోతే అది దేశానికి అవమానకరంగా మారేది. మనతో ఎవరూ స్నేహం చేయాలనుకునేవారు కాదు’ అని థరూర్ అన్నారు. బంగ్లాలో ప్రస్తుత పరిస్థితులు ఇరుదేశాల బంధంపై ప్రభావం చూపలేవని అభిప్రాయపడ్డారు.