News August 12, 2024
విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకం: ప్రధాన్
పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని, ముఖ్యంగా విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకమైందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్య ఘటనపై ఆయన స్పందిస్తూ.. కొన్ని రోజుల క్రితం జాదవ్‌పూర్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుందని చెప్పారు. ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Similar News
News September 18, 2024
పదే పదే ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకం: కేంద్రమంత్రి
లా కమిషన్ 1999లో జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ గుర్తుచేశారు. ‘భారత్ వేగంగా అభివృద్ధి కావాలని యువత కోరుకుంటోంది. పదే పదే ఎన్నికలతో ఇందుకు ఆటంకం కలుగుతోంది. 2015లో పార్లమెంట్ కమిటీ కూడా జమిలి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించి, అనంతరం 100 రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది’ అని అన్నారు.
News September 18, 2024
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్‌గా రికీ పాంటింగ్
ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌కు తమ కొత్త కోచ్‌గా రికీ పాంటింగ్‌ను పంజాబ్ కింగ్స్ నియమించింది. ఈ మేరకు ట్విటర్‌లో ప్రకటించింది. ‘పంటర్(పాంటింగ్) ఈజ్ పంజాబ్! మా కొత్త హెడ్ కోచ్ పదవిలో పాంటింగ్ జాయిన్ అయ్యారు’ అని పేర్కొంది. గడచిన 7 సీజన్లలో ఆ జట్టు ఆరుగురు కోచ్‌లను మార్చడం గమనార్హం. కాగా పాంటింగ్ ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా పనిచేశారు.
News September 18, 2024
ఆరుగురు మారినా ఆ జట్టు రాత మారట్లేదు!
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ప్రదర్శనపరంగా, సిబ్బంది ఎంపిక పరంగా అస్థిరతకు మారుపేరుగా నిలుస్తోంది. వచ్చే సీజన్‌కు రికీ పాంటింగ్‌ను నియమించిన ఆ జట్టు గత 7 సీజన్లలో ఆరుగురు కోచ్‌లను మార్చింది. ఆ టీమ్ ప్రదర్శన చూస్తే.. ఐపీఎల్ చరిత్రలో కేవలం 2సార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. గత పదేళ్లలో అయితే ఒక్కసారీ ప్లేఆఫ్ గడప తొక్కలేదు. ఈ ఏడాది 9వ స్థానంలో నిలిచింది.