News March 20, 2024

రోహిత్‌పై పార్థివ్ ప్రశంసల వర్షం

image

ముంబై మాజీ సారథి రోహిత్ శర్మపై పార్థివ్ పటేల్ ప్రశంసల వర్షం కురిపించారు. CSK సారథిగా ధోనీ కొన్ని తప్పులు చేశాడేమో కానీ రోహిత్ ఎప్పుడూ తప్పిదాలు చేయలేదన్నారు. హార్దిక్, బుమ్రాను యాజమాన్యం పక్కనపెట్టాలని భావించినా.. రోహిత్ మద్దతుగా నిలిచారన్నారు. ఆ తర్వాత వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన చేసి జట్టు విజయాల్లో భాగమయ్యారని తెలిపారు. రోహిత్ కెప్టెన్సీలో MI రెండు సార్లు ఒక పరుగు తేడాతో కప్ గెలిచిందన్నారు.

News March 20, 2024

అమేథీలో కాంగ్రెస్‌కు ’21’ గండం తొలగినట్టేనా?

image

2019 ఎన్నికల్లో కంచుకోట అనుకున్న అమేథీలో ఓటమి కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చింది. ’21’ గండం వల్లే ఇలా జరిగిందని ఈసారి గెలుపు పక్కా అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు. ఈ 21 సంఖ్య కాంగ్రెస్‌కు కలిసిరావట్లేదట. 1977లో తొలిసారి అమేథీలో ఓడిపోగా మళ్లీ 21 ఏళ్లకు 1998లో ఓటమిపాలైంది. 21ఏళ్ల తర్వాత మళ్లీ 2019లో ఓడింది. మరోవైపు రాజీవ్ గాంధీ చనిపోయిన తేదీ మే 21 కావడం, అప్పుడు రాహుల్ వయస్సు 21 ఏళ్లు కావడం గమనార్హం.

News March 20, 2024

నెహ్రూ విదేశాంగ విధానం బుడగతో సమానం: జైశంకర్

image

చైనా విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరించినా అప్పటి ప్రధాని నెహ్రూ ఉదాసీనంగా వ్యవహరించారని కేంద్ర మంత్రి జైశంకర్ విమర్శించారు. నెహ్రూ అవలంబించిన విదేశాంగ విధానం బుడగతో సమానమని వర్ణించారు. అమెరికా అంటే కోపంతో చైనాను అప్పట్లో భారత్ మిత్రదేశంగా చెప్పేవారన్నారు. ఆ విషయాన్ని అందరూ నమ్మారని.. కొందరు ఇప్పటికీ నమ్ముతున్నారని సెటైర్ వేశారు.

News March 20, 2024

పేపర్ లీక్ కలకలం.. టీచర్ ఎగ్జామ్ రద్దు

image

బిహార్‌లో పేపర్ లీక్ కలకలం రేపింది. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) ఈనెల 15న నిర్వహించిన టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్‌పై పేపర్ లీక్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పరీక్షను రద్దు చేసింది. సరికొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని BPSC వెల్లడించింది. కాగా ఇందుకు సంబంధించి ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన 300 మంది అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ పరీక్ష ద్వారా 87,774 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.

News March 20, 2024

రాహుల్ గాంధీపై ECకి BJP ఫిర్యాదు

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ECకి BJP ఫిర్యాదు చేసింది. ఆయన మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇటీవల ముంబైలో జోడోయాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ ‘హిందుత్వంలో శక్తి అనే పదం ఉంటుంది. అది ఎవరనేదే ఇక్కడ ప్రశ్న. మనం దాంతోనే పోరాటం చేస్తున్నాం. దాని ఆత్మ EVM, ED, CBI, ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్లలో నిక్షిప్తమై ఉంది’ అని అన్నారు. దీనిపైనే BJP ఫిర్యాదు చేసింది.

News March 20, 2024

ఐపీఎల్ కోసం 50 ఫ్యాన్ పార్క్‌లు

image

ఐపీఎల్ సీజన్-17 కోసం దేశ వ్యాప్తంగా 50 ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు బీసీసీఐ తెలిపింది. మొదటి ఫ్యాన్ పార్క్‌ను ఈ నెల 22న మధురైలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. మొదటి రెండు వారాలకు దేశంలోని 11 రాష్ట్రాలను ఫ్యాన్ పార్కులకు వేదికలుగా ఎంపిక చేయగా ఆ జాబితాలో తెలంగాణ ఉండగా, ఏపీ లేదు. మార్చి 30, 31 తేదీల్లో నిజామాబాద్‌లో ఫ్యాన్ పార్క్‌ ఏర్పాటు చేయనున్నారు.

News March 20, 2024

వైసీపీని ఇంటికి సాగనంపాలి: చంద్రబాబు

image

AP: రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీని ఇంటికి సాగనంపాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు పిలుపునిచ్చారు. దీని కోసం ప్రజలు ముందడుగు వేయాలన్నారు. జనం నమ్మకాన్ని జగన్ కోల్పోయారని.. ఎన్నికల్లో అక్రమాలనే నమ్ముకున్నారని విమర్శించారు. సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులతో వైసీపీ అక్రమాలకు చెక్ పెట్టాలని కోరారు.

News March 20, 2024

ఇన్‌స్టాగ్రామ్ పని చేయట్లేదు

image

పలువురికి ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. యాప్ ఓపెన్ చేయగానే ఇమేజ్ లోడ్ అవ్వట్లేదని చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 20%కి పైగా యూజర్లు సమస్యలు ఎదురవుతున్నట్లు Xలో పోస్టులు చేస్తున్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ సేవలు దాదాపు గంట పాటు నిలిచిపోయాయి. మరి మీకు కూడా ఈ సమస్య వస్తోందా? కామెంట్ చేయండి.

News March 20, 2024

ఈ వేగాన్ని అధిగమిస్తారా?

image

మరో రెండ్రోజుల్లో IPL-2024 స్టార్ట్ కానుండటంతో గత టోర్నీల్లోని రికార్డులు బ్రేక్ అవుతాయా? లేదా? అనేదానిపై చర్చ జరుగుతోంది. IPL చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి రికార్డును 2011లో షాన్ టైట్ (157.71KMPH) నమోదు చేశారు. తర్వాతి స్థానాల్లో లాకీ ఫెర్గూసన్ (2022, 157.3KMPH), ఉమ్రాన్ మాలిక్ (2022, 157KMPH), అన్రిచ్ నోర్జే (2020, 156.22KMPH) ఉన్నారు. మరి ఈ ఏడాది టైట్ రికార్డ్ బ్రేక్ అవుతుందా? కామెంట్ చేయండి.

News March 20, 2024

గురుకులం 5వ తరగతి ఫలితాలు విడుదల

image

AP: రాష్ట్రంలోని డాక్టర్ B.R అంబేడ్కర్ గురుకులం 5వ తరగతి ప్రవేశ పరీక్ష-2024-25 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు <>apbragcet.apcfss.in<<>> వెబ్‌సైట్‌లో తమ ఆధార్ నంబర్, పుట్టినతేదీ, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. త్వరలో గురుకులం ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి.