News August 13, 2025

అత్యవసరమైతేనే బయటకు రండి: హైడ్రా

image

TG: హైడ్రా పరిధిలో నేటినుంచి మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. మేడ్చల్, సైబరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. ఆగస్టు 13, 14, 15 తేదీల్లో వాహనాల వాడకం తగ్గించాలని, సాధ్యమైనంత వరకు బయటకు రావొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. హెల్ప్‌లైన్ నంబర్లు: 040 29560521, 9000113667, 9154170992.

News August 13, 2025

నేడు ED విచారణకు మంచు లక్ష్మి

image

TG: సినీ నటి మంచు లక్ష్మి నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో మంచు లక్ష్మికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నగదు లావాదేవీలు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో సంబంధాలపై ఆమెను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానాను అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

News August 13, 2025

జాగ్రత్త.. నేటి నుంచే అతి భారీ వర్షాలు!

image

బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ఇరు రాష్ట్రాల అధికారులు ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు, రాత్రి నుంచే పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. మీ ఏరియాలో వెదర్ ఎలా ఉంది?

News August 13, 2025

ఈ జిల్లాల్లో స్కూళ్లకు 5 రోజులు సెలవులు

image

TG: భారీ వర్షసూచన నేపథ్యంలో హన్మకొండ, WGL, జనగామ, MHBD, యాదాద్రి జిల్లాల్లో స్కూళ్లకు ఇవాళ, రేపు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ జిల్లాల్లో 15న స్వాతంత్ర్య దినోత్సవం, 16న కృష్ణాష్టమి, 17న సండేతో కలిపి 5రోజులు వరుస సెలవులు రానున్నాయి. అటు, GHMC ఏరియాలో భారీ వర్షం పడే ఆస్కారం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఇళ్లకు చేరేందుకు అవస్థలు పడకుండా స్కూళ్లను ఉదయం ఒకపూటే నడపాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

News August 13, 2025

EP34: ఈ 5 లక్షణాలు వదిలేస్తే మీరే విజేతలు: చాణక్య నీతి

image

ఎలాంటి వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడో చాణక్య నీతి వివరించింది. ఈ 5 లక్షణాలను వదులుకుంటే కచ్చితంగా విజయం వరిస్తుందని పేర్కొంది.
*అందరినీ సంతృప్తి పరచాలి అనుకోవడం
*అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం
*నిన్ను నువ్వే కించ పరుచుకోవడం
*మార్పునకు భయపడటం
*గతంలోనే జీవించడం <<-se>>#Chanakyaneeti<<>>

News August 13, 2025

ఈ జిల్లాల్లో దంచికొడుతున్న భారీ వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. కొన్నిగంటల్లో సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట్, హన్మకొండ, వరంగల్, ములుగు, నల్గొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేటలో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. HYDలోనూ పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచే వర్షం కురుస్తోంది.

News August 13, 2025

నేడు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఉదయం 11గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ట్వీట్ చేసింది. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల పోలింగ్‌తో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

News August 13, 2025

పులివెందుల: 2 కేంద్రాల్లో రీపోలింగ్

image

AP: పులివెందుల ZPTC ఉప ఎన్నికల్లో భాగంగా 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. అచ్చవెల్లి, కొత్తపల్లెలో ఇవాళ రీపోలింగ్ నిర్వహించనున్నారు. 3, 14 కేంద్రాల్లో ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది. ఈ కేంద్రాల్లో 2 వేల మంది ఓటర్లు ఉన్నారు. నిన్న జరిగిన పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాశ్ సహా వైసీపీ శ్రేణులు ఆరోపించిన విషయం తెలిసిందే.

News August 13, 2025

E20 పెట్రోల్‌పై ఆ ప్రచారాలు తప్పు: కేంద్రం

image

E20 పెట్రోల్‌పై వస్తున్న <<17378231>>పుకార్లను<<>> కేంద్రం కొట్టిపారేసింది. దీని వల్ల పొల్యూషన్ తగ్గడమే కాకుండా వాహనాల పికప్ కూడా పెరుగుతుందని వెల్లడించింది. E10 పెట్రోల్‌తో పోలిస్తే 30% తక్కువ కార్బన్ ఉద్గారాలు వెలువడతాయని పేర్కొంది. మైలేజీ తగ్గుతుందన్న ప్రచారంలో నిజం లేదంది. డ్రైవింగ్ విధానం, వాహనం మెయింటెనెన్స్, టైర్ ప్రెషర్, AC లోడ్ వంటి వాటిపై మైలేజీ ఆధారపడి ఉంటుందని కేంద్రం వివరించింది.

News August 13, 2025

సెమీ కండక్టర్ రంగంలో వేగంగా అడుగులు: మోదీ

image

భారతదేశం <<17381479>>సెమీ కండక్టర్<<>> రంగంలో వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. AP, ఒడిశా, పంజాబ్‌కు సెమీ కండక్టర్ యూనిట్లు మంజూరు కావడంపై తెలుగులో ట్వీట్ చేశారు. ‘ఏపీ, ఒడిశా, పంజాబ్‌లో కొత్త యూనిట్ల ఏర్పాటుకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం తయారీ సామర్థ్యాన్ని పెంచుతుంది. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టిస్తుంది. ప్రపంచ సరఫరా వ్యవస్థలో దేశాన్ని కీలక పాత్రధారిగా ఉంచుతుంది’ అని తెలిపారు.