News April 5, 2024

ఇవాళ్టి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

image

AP: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా PCC చీఫ్ షర్మిల నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. YSR(D) బద్వేల్‌లోని ఆమగంపల్లి నుంచి బస్సుయాత్ర ప్రారంభించనుండగా.. కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేల్, ఆట్లూరులో యాత్ర సాగనుంది. 6న కడప, 7న మైదుకూరు, 8న కమలాపురం, 10న పులివెందుల, 11న జమ్మలమడుగు, 12న ప్రొద్దుటూరులో పర్యటించనున్నారు. షర్మిలతో పాటు సునీత కూడా ఈ యాత్రలో పాల్గొనే ఛాన్సుంది.

News April 5, 2024

UN నాకు చెప్పాల్సిన అవసరం లేదు: జైశంకర్

image

గతవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై ఐక్యరాజ్య సమితి(UN) స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా దానిపై విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. దేశంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలో తనకు చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా భారత ప్రజలే చూసుకుంటారని ఆయన అన్నారు.

News April 5, 2024

సీపీఐ పోటీ చేసే స్థానాలివే

image

AP: సార్వత్రిక ఎన్నికల్లో ఒక లోక్‌సభ, 8 అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. గుంటూరు లోక్‌సభ స్థానంతో పాటు విశాఖ పశ్చిమ, ఏలూరు, విజయవాడ పశ్చిమ, అనంతపురం, పత్తికొండ, తిరుపతి, రాజంపేట, కమలాపురం నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్, సీపీఐ మధ్య ఈ మేరకు సీట్ల ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు.

News April 5, 2024

‘భీమిలి’లో సిసలైన పోరు

image

AP: విశాఖ(D) భీమిలిలో ఎన్నికల హీట్ ఓ రేంజ్‌లో ఉంది. ఇద్దరు ఓటమెరుగని నేతలు గంటా శ్రీనివాసరావు(TDP), అవంతి శ్రీనివాస్(YCP) ఇక్కడ ఢీకొంటున్నారు. పార్టీ, నియోజకవర్గం మారినా గెలిచే రాజకీయ చతురులు వీరు. భీమిలిలో 2009లో అవంతి(PRP), 14లో గంటా(TDP), 19లో అవంతి(YCP) గెలుపొందారు. ఈసారి ఇద్దరు బలమైన కాపు నేతలు భీమిలి బరిలో ఉండటంతో లక్షకు పైగా ఉన్న కాపు ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారనేది ఉత్కంఠగా మారింది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 5, 2024

గుజరాత్‌ టైటాన్స్‌కు షాక్.. మిల్లర్‌ దూరం!

image

గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద షాక్ తగిలేలా ఉంది. పించ్ హిట్టింగ్‌తో ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించే సఫారీ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ గాయపడ్డారు. రెండు వారాలు జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం కారణంగానే అతడు పంజాబ్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగలేదని కేన్ విలియమ్సన్ వెల్లడించారు. నిన్నటి మ్యాచ్‌లో మిల్లర్‌కు బదులుగా కేన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

News April 5, 2024

‘పెనమలూరు’లో పవర్ ఎవరిదో?

image

AP: కృష్ణా(D) పెనమలూరు రాజకీయాలు ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటాయి. 2008లో ఈ సెగ్మెంట్ ఏర్పడింది. 2009లో కాంగ్రెస్, 14లో TDP, 19లో YCP గెలుపొందాయి. మంత్రి, పెడన MLA జోగి రమేశ్‌ను YCP ఇక్కడి నుంచి పోటీ చేయిస్తోంది. పథకాల లబ్ధిదారుల ఓట్లు కలిసొస్తాయని అంచనా వేస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండటం, గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి, క్యాడర్ సపోర్ట్‌తో గెలుస్తానని TDP అభ్యర్థి బోడె ప్రసాద్ ధీమాగా ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 5, 2024

తొలి సెంచరీ కొట్టేదెవరో?

image

ఐపీఎల్ 2024లో 17 మ్యాచులు ముగిశాయి. ఇప్పటివరకు ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు గిల్ చేసిన 89 పరుగులే. ఇప్పటికీ శతకం నమోదుకాకపోవడంతో మ్యాచులో అసలైన మజా రావట్లేదు. గత సీజన్‌లో రికార్డు స్థాయిలో 12 సెంచరీలు నమోదయ్యాయి. 9 మంది ప్లేయర్లు సెంచరీలు చేశారు. ఈ సీజన్‌లో ఇప్పటికైనా శతకాల ఖాతా తెరిచి ఐపీఎల్‌కు మరింత ఊపు తీసుకొస్తారో లేదో వేచి చూడాలి.

News April 5, 2024

ఎల్లుండి నుంచి వర్షాలు

image

TG: భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఎల్లుండి నుంచి రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో 30-40 కి.మీ వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News April 5, 2024

రైల్వేలో 1113 అప్రెంటిస్ పోస్టులు

image

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పలు విభాగాల్లోని 1113 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల ప్రకారం టెన్త్, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 15 నుంచి 24 ఏళ్లలోపు వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. అభ్యర్థులు మే 1వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ కోసం ఈ <>లింక్‌<<>>పై క్లిక్ చేయండి. వెబ్‌సైట్: https://apprenticeshipindia.org

News April 5, 2024

నేడు చెన్నైతో హైదరాబాద్ ఢీ

image

IPLలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌ నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. HYDలోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇరు జట్లు తమ చివరి మ్యాచుల్లో ఓడాయి. 3 మ్యాచుల్లో 2 గెలిచిన CSK 3వ స్థానంలో ఉండగా.. 3మ్యాచుల్లో 1 గెలిచిన SRH 7వ స్థానంలో ఉంది. ఈరోజు గెలిస్తే ఆరెంజ్ ఆర్మీ 5వ స్థానానికి చేరుకుంటుంది. MIపై సన్‌రైజర్స్ చేసిన విధ్వంసాన్ని నేడు రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.