India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అసెంబ్లీ స్థానాల వారీగా సమన్వయకర్తలను నియమించింది. మేడ్చల్-శంబీపూర్ రాజు, మల్కాజిగిరి-నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్-గొట్టిముక్కల వెంగళరావు, కూకట్‌పల్లి-బేతిరెడ్డి సుభాశ్ రెడ్డి, ఉప్పల్-జహంగీర్ పాషా, కంటోన్మెంట్-రావుల శ్రీధర్ రెడ్డిని నియమించింది.
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇండియన్-2’. ‘భారతీయుడు’కి సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ క్రేజీ ట్వీట్ చేసింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. అవినీతికి వ్యతిరేకంగా అందరం నిలబడదామని పేర్కొంది.
దేశంలో ఎవరైనా ఉగ్రదాడులకు పాల్పడి పాకిస్థాన్‌లో తలదాచుకోవాలని ప్రయత్నిస్తే ఆ దేశంలోకి వెళ్లి మరీ హతమారుస్తామన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ‘పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలనే కోరుకుంటాం. కానీ ఎవరైనా భారత్‌లో ఉగ్రదాడులకు ప్రయత్నిస్తే సహించం’ అని తెలిపారు. కాగా 2020 నుంచి ఇప్పటివరకు పాక్‌లో 20 మందిని భారత ఏజెంట్లు చంపారన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
TG: హైదరాబాద్‌లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఫొటోలు దిగుతున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అనిల్ అక్కడికక్కడే మృతి చెందగా, మరోవ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
AP: తాను రాజకీయాల్లోకి రావట్లేదని దివంగత YS.వివేకానందరెడ్డి కుమార్తె సునీత స్పష్టం చేశారు. ‘ఈ ఎన్నికల్లో అవినాశ్‌రెడ్డిని ఓడించాలన్నదే నా ధ్యేయం. నా తండ్రి విషయంలో ఏం జరిగిందనేది నాకు మాత్రమే తెలుసు. ప్రజలకు నిజం తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది. చదువు, తెలివి, స్తోమత ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా’ అని ఆమె చెప్పారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని సునీత ప్రశ్నించారు.
సిరియాలోని తమ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో మిడిల్ ఈస్ట్‌లో హైటెన్షన్ నెలకొంది. ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఎదురుదాడులు మొదలుపెట్టొచ్చని, తమ స్థావరాలపై కూడా దాడులు చేయొచ్చని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో జోక్యం చేసుకోవద్దని ఇరాన్ అమెరికాను హెచ్చరించగా.. తమ స్థావరాలు, అధికారులపై దాడులు చేయొద్దని US కోరింది. కాగా ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ టాప్ కమాండర్ ప్రాణాలు కోల్పోయారు.
ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మూవీ ‘కల్కి 2898 AD’. మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విడుదలను మే 30కి వాయిదా వేసినట్లు టీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె సందడి చేయనున్నారు. కీలకపాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్లు నటించారు. అయితే.. పోస్ట్‌పోన్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
‘టిల్లు స్క్వేర్’ సినిమా వసూళ్లు రూ.100 కోట్లకు చేరువయ్యాయి. 8 రోజుల్లో రూ.96.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మీట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ రానున్నట్లు తెలిపింది. ఇటీవల స్టార్ బాయ్ సిద్ధూ, విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీతో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాను చూసిన సంగతి తెలిసిందే.
బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.73,081ను తాకింది. ఇది ఆల్‌టైమ్ రికార్డుగా నిలిచింది. కాగా కొంతకాలంగా బంగారం ధర వరుసగా పెరుగుతూ వస్తోంది. వెండి ధర సైతం రూ.82,975(కిలో) భారీగా పలుకుతోంది.
‘హాయ్ నాన్న’తో డీసెంట్ హిట్ అందుకున్న నాని వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ షూటింగ్‌లో బిజీగా ఉన్న నానీ.. ‘జై భీమ్’ డైరెక్టర్ జ్ఞాన్‌వేల్‌తో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారట. కథ కూడా విన్నారని టాక్. వచ్చే ఏడాది సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. కాగా.. నాని ఇప్పటికే సుజీత్, శ్రీకాంత్ ఓదెలతో సినిమాలు ప్రకటించారు. ‘బలగం’ వేణుతోనూ ఓ చిత్రం చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.