News April 6, 2024
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. కల్కీ రిలీజ్ వాయిదా?
ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మూవీ ‘కల్కి 2898 AD’. మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విడుదలను మే 30కి వాయిదా వేసినట్లు టీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె సందడి చేయనున్నారు. కీలకపాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్లు నటించారు. అయితే.. పోస్ట్‌పోన్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News January 19, 2025
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి
AP: వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తారనే ప్రచారాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఖండించారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలిగించే చర్యలు చేయబోదని తేల్చిచెప్పారు. గతంలో జగన్ ప్రభుత్వమే స్మార్ట్ మీటర్లతో రైతుకు ఉరితాడు వేయాలని చర్యలు చేపట్టిందని మండిపడ్డారు. అటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న 9 గంటల విద్యుత్ సరఫరాలో ఎలాంటి మార్పులు లేవని మంత్రి స్పష్టం చేశారు.
News January 19, 2025
100 మందిలో ఒకరికి క్యాన్సర్!
AP: రాష్ట్రంలో 100 మందిలో ఒకరు క్యాన్సర్ అనుమానితులుగా ఉన్నట్లు ప్రభుత్వ స్క్రీనింగ్ పరీక్షల్లో తేలింది. ఇప్పటివరకు 53.07 లక్షల మందికి టెస్టులు చేయగా 52,221 మంది క్యాన్సర్ అనుమానితులు ఉన్నారని ఆరోగ్యశాఖ గుర్తించింది. నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అనుమానితులే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఈ స్క్రీనింగ్ పరీక్షలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది.
News January 19, 2025
వచ్చే నెల 12 నుంచి మినీ మేడారం
TG: మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే మరుసటి ఏడాది నిర్వహించే మండమెలిగె పండుగను మినీ మేడారంగా భక్తులు పిలుస్తారు. వచ్చే నెల 12 నుంచి 15 వరకు ఈ జాతర జరగనుంది. దీని కోసం రూ.32 కోట్లతో అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. సుమారు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.