India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై విమర్శించేవారందరికీ సెన్స్ లేదని ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అన్నారు. ‘అతడి ఇన్నింగ్స్‌ను సెల్ఫిష్ అనడం దారుణం. కొంతమంది వార్తల్లో ఉండేందుకే ఇలా చేస్తుంటారు. వారు ఒక ఎజెండా ప్రకారమే కోహ్లీని విమర్శిస్తున్నారు. రాజు ఎప్పుడూ రాజుగానే ఉంటారు. కోహ్లీ కూడా అంతే’ అని ఆయన పేర్కొన్నారు.
TG: లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 15 తర్వాత ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. బహిరంగసభలకు బదులు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహణపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్ లేదా ఆదిలాబాద్ నుంచి యాత్రను ప్రారంభిస్తారని సమాచారం. కేడర్‌ను సమాయత్తం చేసేందుకు ఈ నెల 13న చేవెళ్లలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు.
TG: రాష్ట్రంలో టెట్ రాసేందుకు అభ్యర్థులు అంతగా ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 166475 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ నెల 10తో దరఖాస్తుల గడువు ముగియనుంది. దీంతో మొత్తం 2 లక్షల అప్లికేషన్లలోపే వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తు ఫీజు రూ.1000కి పెంచడంతో అభ్యర్థులు టెట్ రాసేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. మరోవైపు బోధనపై కొంతమందికి ఆసక్తి లేక దరఖాస్తు చేసుకోవడం లేదని తెలుస్తోంది.
మావోయిస్ట్ సెంట్రల్ రీజినల్ బ్యూరో ప్రతినిధి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది 50 మంది మావోయిస్టులు మరణించారని.. ఈ మారణ కాండను నిరసిస్తూ తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్రల్లో ఈ నెల 15న బంద్‌కు పిలుపునిచ్చినట్లు ప్రకటనలో తెలిపారు. గత 15 రోజుల్లోనే 22 మంది మావోయిస్టులను పోలీసులు హత్య చేశారని ఆయన ఆరోపించారు.
నిన్న KKRతో మ్యాచులో POTM విన్నర్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ‘తలా(ధోనీ)‘, ‘చిన్న తలా(రైనా)’లాగా ఇంకా టైటిల్ వెరిఫై కాలేదని అన్నారు. త్వరలోనే తనకు కూడా అభిమానులు ఏదో ఒక టైటిల్ ఇస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా నిన్నటి మ్యాచులో జడేజా 3 వికెట్లు తీయడంతోపాటు రెండు క్యాచులు అందుకున్నారు.
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 61,920 మంది దర్శించుకోగా, 17,638 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.55 కోట్లు లభించింది.
TG: ఈ ఏడాది రాష్ట్రంలో MBSS ఫైనలియర్ విద్యార్థులు రికార్డు స్థాయిలో 98 శాతం మంది పాసయ్యారు. గత ఏడాది వరకు ఉత్తీర్ణత శాతం 75-80 మధ్యే ఉండగా, ఈసారి భారీగా పెరిగింది. 6 వేల మంది విద్యార్థుల్లో కేవలం 127 మంది(2 శాతం) ఫెయిలయ్యారు. నేషనల్ మెడికల్ కమిషన్ ఎంబీబీఎస్ పరీక్షల్లో సంస్కరణలు తీసుకురావడం, ప్రశ్నలను సులభతరం చేయడంతో ఉత్తీర్ణత శాతం పెరిగినట్లు కాళోజీ హెల్త్ వర్సిటీ వర్గాలు తెలిపాయి.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని CM రేవంత్ ఇంటి సమీపంలో ప్రణీత్ రావు వార్ రూమ్ ఏర్పాటు చేశాడు. SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సూచనల మేరకే దీనిని నిర్వహించాడు. రేవంత్, ఆయన కుటుంబీకుల ఫోన్లను ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే ఓటుకు నోటు, ఎమ్మెల్యేలకు ఎర వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికల్లోనూ ట్యాప్ చేశారు.
AP: ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ వైసీపీ, టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మేనిఫెస్టో విడుదలపై మీనమేషాలు లెక్కిస్తున్నాయి. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో ప్రచారం చేసుకుంటున్నా.. ఉమ్మడి మేనిఫెస్టోపై ఇంకా కసరత్తు చేస్తున్నట్లు కూటమి వర్గాలు వెల్లడిస్తున్నాయి. వైసీపీ నుంచి ఇంకా ఎన్నికల హామీలు బయటకు రావట్లేదు. అమలు చేసేవి మాత్రమే మేనిఫెస్టోలో పెడతామని, త్వరలోనే విడుదల చేస్తామని సీఎం జగన్ చెబుతున్నారు.
TG: BRS మాజీ MLA షకీల్ కుమారుడు రహీల్‌ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన 15 మంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రజాభవన్ వద్ద యాక్సిడెంట్ జరగ్గానే ట్రాఫిక్ పోలీసులు రహీల్‌తో సహా మరో ముగ్గురు యువతులను పంజాగుట్ట PSలో అప్పగించారు. కానీ అక్కడే కేసు ఎన్నో మలుపులు తిరిగింది. MLAతోపాటు ఇద్దరు CIలు, మరో 12 మంది అతడిని తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై 19 సెక్షన్లతో కేసు రిజిస్టర్ చేశారు.
Sorry, no posts matched your criteria.