News March 22, 2024

తస్లిమా: రీల్ VS రియల్

image

TGలోని ములుగు సబ్‌రిజిస్ట్రార్ తస్లిమా లంచం తీసుకుంటూ ACBకి చిక్కడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ అధికారిణి అయినా కూలీ పనులు చేస్తూ, పేదల మధ్య తిరుగుతూ, నిరాడంబరంగా ఉన్నట్లు వీడియోలు చేస్తూ ఆమె పాపులరయ్యారు. లంచం అనే మాట వినిపిస్తే ఆమె భద్రకాళీ అవుతుందనే అభిప్రాయమూ ఉంది. ఉత్తమ అధికారిణిగా 13సార్లు అవార్డు అందుకున్నారామె. కానీ.. ఇదంతా రీల్ లైఫ్. తాజాగా ఆమె రియల్ లైఫ్‌ గురించి తెలిసి అంతా షాకయ్యారు.

News March 22, 2024

ప్రధాని మోదీ కళ్లలో ఓటమి భయం కనిపిస్తోంది: స్టాలిన్

image

తిరుచిరాపల్లిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పీఎం కేర్స్ ఫండ్ వెనుక ఉన్న రహస్యాలను బయటపెడతాం. కేజ్రీవాల్ అరెస్ట్ కావడానికి బీజేపీకి ఓటమి భయం పట్టుకోవడమే కారణం. మోదీ కళ్లలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రం కోసం తెచ్చినట్టు ప్రధాని ఒక్క స్కీమ్ పేరైనా చెప్పగలరా?’ అని ప్రశ్నించారు.

News March 22, 2024

RCB, CSK జట్లు ఇవే

image

CSKతో మ్యాచ్‌లో RCB టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది.

RCB: డుప్లెసిస్ (C), కోహ్లీ, రజత్ పాటిదార్, మ్యాక్స్‌వెల్, గ్రీన్, దినేశ్ కార్తీక్, అనుజ్ రావత్ (WK), కరన్ శర్మ, అల్జరీ జోసెఫ్, మయాంక్ దగర్, సిరాజ్

CSK: గైక్వాడ్ (C), రచిన్, రహానె, మిచెల్, జడేజా, సమీర్ రిజ్వీ, ధోనీ (WK), దీపక్ చాహర్, ముస్తాఫిజుర్, తీక్షణ, తుషార్ దేశ్‌పాండే

News March 22, 2024

ఈనెల 26న మోదీ ఇంటి ముట్టడి: ఆప్

image

ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. తమ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈనెల 26న ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. అలాగే ఈ ఏడాది పార్టీ శ్రేణులెవరూ హోలీ జరుపుకోవద్దని నిర్ణయించింది. రేపు ఢిల్లీలోని షాహిదీ పార్కులో దేశాన్ని కాపాడతామంటూ ప్రతిజ్ఞ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

News March 22, 2024

ఎయిర్ ఇండియాకు షాక్

image

ఎయిర్ ఇండియాపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ.80లక్షల జరిమానా విధించింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్స్, సిబ్బంది నిర్వహణ అంశాల్లో నిబంధనలను ఉల్లంఘించడమే ఇందుకు కారణం. సిబ్బందితో ఓవర్‌టైమ్ పనిచేయించడం, తగిన విశ్రాంతి ఇవ్వకపోవడం, విమానాల్లో ఇద్దరు పైలట్లూ 60ఏళ్లుపైబడిన వారే ఉండటం వంటి తప్పులను గుర్తించినట్లు DGCA తెలిపింది. కాగా ఈ జనవరిలో ఎయిర్‌ఇండియాకు రూ.1.10కోట్ల ఫైన్ వేసింది.

News March 22, 2024

కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన కేసీఆర్

image

TG: ఢిల్లీ CM కేజ్రీవాల్‌ అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో చీక‌టి రోజు అని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ అన్నారు. ‘ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే సంక‌ల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. దీనికి ఝార్ఖండ్ CM హేమంత్ సోరెన్, BRS ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘ‌ట‌న‌లు రుజువు. కేంద్రం ED, CBI, IT వంటి సంస్థ‌ల‌ను పావులుగా వాడుకుంటోంది’ అని కేసీఆర్ అన్నారు.

News March 22, 2024

గంజాయి మత్తులో టెన్త్ క్లాస్ అమ్మాయిలు

image

TG: జగిత్యాలలో టెన్త్ విద్యార్థినులు గంజాయికి బానిసలయ్యారు. ఓ అమ్మాయి కొన్ని రోజులుగా వింతగా ప్రవర్తించడంతో తండ్రికి అనుమానం వచ్చింది. ఆమె గంజాయికి అలవాటు పడిందని తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా శిశు సంరక్షణ కమిటీ దర్యాప్తు చేపట్టింది. ఆ అమ్మాయితో పాటు మరో 10 మంది గంజాయికి బానిసలైనట్లు తేలింది. ఓ సెక్స్ రాకెట్ వారికి గంజాయి ఇచ్చి, HYDలో రేవ్ పార్టీలకూ తరలిస్తున్నట్లు వెల్లడైంది.

News March 22, 2024

ఈసారి RCB గెలుస్తుందని ఆశిస్తున్నా.. ఎందుకంటే?: ABD

image

కాసేపట్లో చెన్నై, బెంగళూరు మధ్య IPL-2024 సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కామెంటేటరీ అవతారం ఎత్తిన RCB మాజీ ప్లేయర్ AB డివిలియర్స్ ఈసారి తమ జట్టు ట్రోఫీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నా జెర్సీ నంబర్ 17. ఇది 17వ IPL సీజన్. కాబట్టి ఈసారి RCB గెలుస్తుందని అనుకుంటున్నా’ అని అన్నారు.

News March 22, 2024

నమ్మిన వారే గొంతు కోశారు: MLA నల్లపురెడ్డి

image

AP: తాను నమ్మిన నాయకులే గొంతు కోశారని కోవూరు MLA నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కొందరు నేతలు తనను అడ్డం పెట్టుకుని బాగా సంపాదించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు వారంతా టీడీపీ MP అభ్యర్థి వేమిరెడ్డి పంచన చేరుతున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో వారందరికీ తానేంటో చూపిస్తానని హెచ్చరించారు. తాను నోరు విప్పితే వేమిరెడ్డి జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోనే ఉండరన్నారు.

News March 22, 2024

టిల్లు స్క్వేర్ మూవీకి U/A సర్టిఫికెట్

image

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్లలో అనుపమ గ్లామర్, కొన్ని డైలాగ్స్, సీన్లు చూసి అడల్ట్ కంటెంట్ అనుకున్నారంతా. కానీ సెన్సార్ సర్టిఫికెట్‌తో అలాంటి రూమర్లకు తెరపడినట్లయింది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా టిల్లు చేరువ కానున్నాడు. కాగా ఈ సినిమా మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.