News March 21, 2024

9 సార్లు విచారణకు డుమ్మా

image

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ నేతలకు ఈడీ వరుస షాకులిచ్చింది. ఇప్పటికే మాజీ డిప్యూటీ CM మనీశ్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో సీబీఐ కేజ్రీవాల్‌ను గతేడాది విచారించింది. ఈడీ నమోదు చేసిన కేసులోనూ వరుసగా సమన్లు అందుతున్నాయి. 9 సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు హైకోర్టు కొట్టేసింది.

News March 21, 2024

లద్దాఖ్‌లో నిరసనలు.. 16వ రోజుకు నిరాహార దీక్ష!

image

కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాక్‌కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ కొన్ని రోజులుగా స్థానికులు నిరసన చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ ఇంజినీర్, సంస్కరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 16వ రోజుకు చేరింది. లద్దాఖ్‌ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ (గిరిజన హక్కుల పరిరక్షణ) పరిధిలోకి తేవాలనేది నిరసనకారుల డిమాండ్. కేంద్రంతో గతంలో చర్చలు విఫలం కావడంతో వీరు ఆందోళన కొనసాగిస్తున్నారు.

News March 21, 2024

భర్తను అప్పుగా ఇస్తారా.. జ్యోతిక ఏమన్నారంటే

image

స్టార్ హీర్ సూర్య‌ భార్య జ్యోతికను ఓ అభిమాని వింత కోరిక కోరారు. భర్తతో దిగిన ఫొటోను జ్యోతిక నెట్టింట షేర్ చేశారు. ఆ పోస్టుకు ‘జ్యోతిక మేడమ్.. నువ్వు నేను ప్రేమ సినిమాలో లాగా మీ భర్తను ఒకరోజు నాకు అప్పుగా ఇస్తారా? 15 ఏళ్లుగా ఆ జెంటిల్‌మన్‌కు పెద్ద అభిమానిని’ అని కామెంట్ చేశారు. దీనికి ‘ఊప్స్.. అలాంటిదేం కుదరదు’ అని జ్యోతిక రిప్లై ఇచ్చారు.

News March 21, 2024

ప్రతి వెధవను గౌరవించక్కర్లేదు: నాగబాబు

image

AP: జనసేన నేత నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘వయసు ఎక్కువ, పెద్దవాడు అని ప్రతి వెధవను గౌరవించక్కర్లేదు. ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్లు అవుతారు’ అంటూ కన్ఫ్యూషియస్ కోట్‌ను పోస్ట్ చేశారు. దీనికి ‘ఏం మాట్లాడినా మా గురించేనేమోనని ఆపాదించుకుంటున్నారు. ఇది ఎన్నికల సమయం కాబట్టి నా ఉద్దేశాలను చెపుతున్నానే కానీ.. ఎవరినీ ఉద్దేశించి చెప్పింది కాదు’ అని వివరణ ఇచ్చారు. తాను చెప్పింది జీవిత సత్యమని తెలిపారు.

News March 21, 2024

నెక్ట్స్ టార్గెట్ కేజ్రీవాల్?

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇందులో ‘పెద్ద తలకాయలు’ ఉన్నాయంటూ మొదటినుంచీ అనుమానిస్తున్న ఈడీ.. ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది. ఇక నెక్ట్స్ టార్గెట్‌ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాలేనని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు పలుమార్లు నోటీసులు ఇచ్చిన ఈడీ త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.

News March 21, 2024

బీజేపీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాలని చూస్తోంది: అతిశీ

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చూస్తోందని ఆ రాష్ట్ర మంత్రి అతిశీ ఆరోపించారు. దీంతో తాము చట్టపరమైన అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఈడీని ఆదేశించాలంటూ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.

News March 21, 2024

హోలీలోపే అభ్యర్థుల ప్రకటన: రేవంత్

image

TG: హోలీ పండగలోపు కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మల్కాజిగిరి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను సీఎంగా ఉన్నానంటే.. ఆ గొప్పతనం మల్కాజిగిరి కార్యకర్తలదేనన్నారు. ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మల్కాజిగిరి క్యాంపెయిన్ మోడల్ రాష్ట్రమంతా అనుసరించేలా చేయాలని సూచించారు.

News March 21, 2024

BIG BREAKING: విశాఖలో 25వేల కేజీల డ్రగ్స్ పట్టివేత

image

AP: విశాఖపట్నం తీరంలో CBI భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి విశాఖకు వచ్చిన కంటైనర్‌లో 25వేల కేజీల డ్రగ్స్‌ను గుర్తించింది. డ్రైఈస్ట్‌తో మిక్స్ చేసి వెయ్యి బ్యాగుల్లో 25కేజీల చొప్పున ప్యాక్ చేశారు. ఇంటర్‌పోల్ సమాచారంతో CBI ఆపరేషన్ ‘గరుడ’ పేరుతో ఆపరేషన్ చేపట్టి డ్రగ్స్ పట్టుకుంది. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీ అడ్రస్‌తో డెలివరీ చేసేందుకు యత్నించినట్లు తేల్చింది.

News March 21, 2024

ప్రయాణికులకు GOOD NEWS

image

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. జనరల్ టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద నగదు చెల్లింపుల్లో ఇబ్బందులకు చెక్ పెడుతూ క్యూఆర్ కోడ్ అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, BHIM ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. దీంతో ప్రయాణికులకు చిల్లర కష్టాలు తొలగిపోనున్నాయి. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14 స్టేషన్లలోని 31 కౌంటర్ల వద్ద ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చారు.

News March 21, 2024

ధోనీ నిర్ణయంపై CSK యాజమాన్యం రియాక్షన్ ఇదే..

image

CSK కెప్టెన్‌గా ధోనీ తప్పుకోవడంపై ఆ జట్టు CEO కాశీ విశ్వనాథన్ స్పందించారు. కెప్టెన్ల సమావేశానికి ముందే ఈ విషయం తనకు తెలిసినట్లు చెప్పారు. ధోనీ నిర్ణయాన్ని గౌరవించామన్నారు. మిస్టర్ కూల్ ఏం చేసినా అది జట్టుకు మేలు చేస్తుందన్నారు. కాగా కెప్టెన్ల ఫొటోషూట్‌లో ధోనీ లేకపోవడంతో ఆయన సారథిగా తప్పుకున్న విషయం బయటకు వచ్చింది. ఫొటోషూట్ తర్వాత కాసేపటికే CSK కొత్త కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ప్రకటించింది.