India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ ఏడాది ఐపీఎల్‌లో పలు జట్లకు కెప్టెన్లు మారారు. గుజరాత్ కెప్టెన్‌గా గిల్, చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్, ముంబైకి హార్దిక్ పాండ్య, SRHకి కమిన్స్ బాధ్యతలు స్వీకరించారు. వీరిని ఆయా జట్లకు కెప్టెన్లుగా చూడటం ఇదే తొలిసారి. ఈ జట్లన్నీ గతంలో ఐపీఎల్ ట్రోఫీ విజేతలే కావడం గమనార్హం. మరోవైపు ఢిల్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పంత్‌కు గతంలో ఇదే టీమ్‌కు సారథ్యం వహించిన అనుభవం ఉంది.
AP: కాపులకు పవన్ కళ్యాణ్ ఏం చేశారని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. ‘కాకినాడ ఎంపీతో పాటు ఆ పార్లమెంటు నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ స్థానాల్లో కాపులకు సీట్లు ఇచ్చాం. పవన్ కళ్యాణ్ ఏం చేశారు? ఒక్క చంద్రబాబుకే న్యాయం చేశారు. రాజకీయాల్లో మెచ్యూరిటీ లేని నేత పవన్. చంద్రబాబు ఆయన్ను కరివేపాకులాగా తీసిపారేస్తారు’ అని సెటైర్లు వేశారు భరత్.
TS: మంచిర్యాల జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఓ తల్లి 8 నెలల పసికందును చేనులో వదిలేసింది. నిన్న రాత్రి చేనులో వదిలేసి వెళ్లడంతో వీధి కుక్కలు ఆ పసిపాపపై దాడి చేసి, చంపేశాయి. శరీర భాగాలను పీక్కుతిన్నాయి. తల్లి గంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమిని మండలం కేస్లాపూర్ గ్రామంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది.
ఐపీఎల్-2024 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఎంఎస్ ధోనీ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ధోనీ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో నెట్టింట ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తలా లుక్ అదిరిపోయిందంటూ CSK ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రేపు RCB, CSK మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
జపాన్ పర్యటనలో ఉన్న స్టార్ డైరెక్టర్ రాజమౌళి యానిమేపై దృష్టిసారించారు. బాగా ఫేమస్ అయిన జపనీస్ యానిమే గురించి అక్కడి నిపుణులతో చర్చించారు. ‘అద్భుతమైన జపనీస్ యానిమే ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి నేను ఎప్పుడూ ఆసక్తిగా ఉంటా. యానిమే గురించి నాకు వివరించిన రుయి కురోకి-సాన్, కజుటో నకాజవా-సాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సృజనాత్మక చర్చలను పూర్తిగా ఆస్వాదించా’ అని ఆయన ట్వీట్ చేశారు.
కొత్త ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల విషయంలో పలు మార్పులు రానున్నాయి.
* SBI కార్డుతో అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు నిలిచిపోనున్నాయి.
* ICICI కార్డులో లాంజ్ యాక్సెస్ పొందాలంటే 3నెలల్లో కనీసం రూ.35వేలు, YES బ్యాంకు కార్డుపై రూ.10వేలు ఖర్చు చేయాలి.
* AXIS కార్డు రివార్డు పాయింట్లు ఇవ్వబోమని తెలిపింది. ఎయిర్‌పోర్టు లాంజ్ యాక్సెస్ పొందాలంటే 3నెలల్లో రూ.50వేలు ఖర్చు చేయాలి.
AP: పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే టికెట్ వంగా గీతకు కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే పిండెం దొరబాబుకు సీఎంవో నుంచి పిలుపువచ్చింది. దీంతో దొరబాబు తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసుకు బయల్దేరారు. ఆయనతో సీఎం జగన్ చర్చలు జరపనున్నారు. కాగా, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో వైసీపీ వ్యూహాలకు పదునుపెడుతోంది.
TG: ‘రజాకార్’ నిర్మాత, బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డికి కేంద్రం భద్రత కల్పించింది. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో సెక్యూరిటీ కల్పించాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. నిఘా వర్గాల ద్వారా కేంద్రం దర్యాప్తు చేసి నారాయణకు 1+1 సీఆర్పీఎఫ్ భద్రత కల్పించింది. హైదరాబాద్ రాజ్యంలో రజాకార్ల అఘాయిత్యాలపై తెరకెక్కిన ‘రజాకార్’ మూవీ ఈ నెల 15న థియేటర్లలో విడుదలైంది.
ఐపీఎల్‌లో గ్రేటెస్ట్ కెప్టెన్ల శకం ముగిసింది. ముంబై కెప్టెన్‌గా రోహిత్, చెన్నై కెప్టెన్‌గా ధోనీని IPLలో చూడలేము. వీరిద్దరూ ఐపీఎల్‌లో తమ జట్లకు ఐదేసి ట్రోఫీలను అందించారు. IPL చరిత్రలో ధోనీ, రోహిత్ కలిసి 10 ట్రోఫీలు గెలవగా.. మిగతా అందరూ కెప్టెన్లు కలిపి 6 గెలిచారు. ఇక వీరి వ్యూహాలను ఇకపై మైదానంలో చూడలేమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ‘వి మిస్ యువర్ కెప్టెన్సీ’ అంటూ పోస్టులు పెడుతున్నారు.
పోస్టాఫీస్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.3 వేలు జమ అవుతాయని, ఇది మోదీ గ్యారంటీ అంటూ కర్ణాటకలో వదంతులు వ్యాపించాయి. దీంతో హుబ్బళ్లి, ఉద్యామ్‌నగర్, నవనగర్, గిర్నిచాల్ తదితర ప్రాంతాల్లోని మహిళలు పోస్టాఫీసులకు పోటెత్తారు. ఇలాంటి పథకమేదీ లేదని సిబ్బంది చెప్పినా వినిపించుకోలేదు. తమకు అకౌంట్లు ఓపెన్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మహిళలకు నచ్చజెప్పారు.
Sorry, no posts matched your criteria.