India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తేది: మార్చి 18, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున గం.5:10
సూర్యోదయం: ఉదయం గం.6:22
జొహర్: మధ్యాహ్నం గం.12:24
అసర్: సాయంత్రం గం.4:45
మఘ్రిబ్: సాయంత్రం గం.6:27
ఇష: రాత్రి గం.07.39
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేదీ: మార్చి 18, సోమవారం,
ఫాల్గుణము శుద్ధ నవమి: రాత్రి 10:49 గంటలకు
ఆరుద్ర: సాయంత్రం 06:10 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:39-01:27 గంటల వరకు,
మధ్యాహ్నం 03:02-03:50 గంటల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 01:40-03:22 గంటల వరకు
ఆర్సీబీ స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ ప్రతిభతో ఆ జట్టు కప్ కొట్టింది. టోర్నీలో ఆమె మొత్తం 347 పరుగులు బాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచారు. అలాగే బౌలింగ్‌లోనూ అదరగొట్టారు. టోర్నీలో 7 వికెట్లు కూడా పడగొట్టారు. ముంబైపై 6 వికెట్లు తీసి డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్‌గా పెర్రీ నిలిచారు. ఫైనల్లో కూడా తన స్వభావానికి వ్యతిరేకంగా ఆడి జట్టును గెలిపించారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
✒ AP: రాష్ట్ర మంత్రులు అవినీతిలో పోటీ: PM మోదీ
✒ రాష్ట్రంలో కూటమిదే విజయం: CBN, పవన్
✒ ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్: పేర్ని నాని
✒ AP: గ్రూప్-2.. 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
✒ TG: కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలను పీకేస్తున్నా: సీఎం రేవంత్
✒ కాంగ్రెస్‌లో చేరిన BRS ఎంపీ రంజిత్, ఎమ్మెల్యే దానం
✒ రేపు సుప్రీంకోర్టులో కవిత కంటెంప్ట్ పిటిషన్
✒ WPL ఫైనల్‌లో ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం
బల్గేరియాకు చెందిన నౌకను ఇటీవల సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ నౌకను భారత నేవీ రక్షించడంపై బల్గేరియా మంత్రి మరియా గాబ్రియేల్ భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బంది రక్షణకు కలిసి పనిచేయడాన్ని కొనసాగిద్దాం అని ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్‌పై భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పందించారు. స్నేహితులున్నది అందుకేనని పేర్కొంటూ రాజ్‌నాథ్ సింగ్, భారత నేవీని ట్యాగ్ చేశారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు WPL విజేతగా నిలిచింది. తొలిసారి ఈ జట్టు కప్పు కొట్టడంతో ఆర్సీబీ ఆటగాళ్లు, ఫ్యాన్స్, ఫ్రాంచైజీ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కాగా ఆర్సీబీ గెలవగానే ఆ జట్టు పురుషుల కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధానకు వీడియో కాల్ చేసి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు వ్యాపారవేత్త విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు. ‘మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌లో RCB పురుషుల జట్టు ట్రోఫీ గెలిస్తే అది అద్భుతమైన డబుల్ ధమాకా అవుతుంది. గుడ్ లక్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
అక్కినేని నాగార్జున ‘నా సామిరంగ’ మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ చిత్రం మార్చి 24న సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలకపాత్రలు పోషించగా.. ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించారు. థియేటర్, OTTల్లో సక్సెస్ అయిన మూవీకి బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో CUET-UG పరీక్షలు వాయిదా పడతాయన్న వార్తలను UGC ఛైర్మన్ జగదీశ్ కుమార్ ఖండించారు. గతంలో ప్రకటించిన విధంగానే మే 15 నుంచి 31 మధ్య ఎగ్జామ్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 26న దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంత మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారనే డేటాను విడుదల చేస్తామన్నారు. గత ఏడాది ఈ పరీక్షకు 14.9 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.