India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఘటన జరిగినప్పుడు 2వ డ్రైవర్ శివనారాయణ బస్సు కింది భాగంలోని కార్గో క్యాబిన్‌లో నిద్రపోయారు. ప్రమాదం జరగ్గానే డ్రైవర్ లక్ష్మయ్య తన వద్దకు వచ్చినట్లు శివ తెలిపారు. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపు కాలేదన్నారు. బస్సు కుడివైపు అద్దాలు పగలగొట్టి కొందరిని రక్షించామని, ఆ ప్రయత్నం వల్ల 27మంది బతికారని చెప్పారు. ఈ ఘటనలో 19మంది చనిపోయారు.

తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్‌షిప్ అర్హత కోసం నిర్వహించే TG SET-2025 దరఖాస్తు గడువును పొడిగించారు. పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులో తప్పుల సవరణకు నవంబర్ 26 నుంచి 28 వరకు అవకాశం ఇస్తారు. డిసెంబర్ 3న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ రెండో వారంలో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: http://telanganaset.org/

AP: అమరావతి, గన్నవరంలో మెగా టెర్మినళ్లు నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. అమరావతిలో 8 రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడే ట్రైన్ల హాల్టింగ్ ఉంటుంది. భవిష్యత్తులో 120 రైళ్లు రాకపోకలు సాగించేలా దీన్ని అభివృద్ధి చేస్తారు. దీనికోసం 300 ఎకరాల అవసరముంది. అటు గన్నవరంలో ప్రస్తుతం 3 ప్లాట్‌ఫామ్స్ ఉండగా విజయవాడకు ప్రత్యామ్నాయంగా 10 లైన్లు ఏర్పాటు చేస్తారు. దీనికి 143 ఎకరాలు కావాలి.

మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో వాళ్లు సేకరించిన పార్టీ ఫండ్ ఏమైందన్న దానిపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. నిధుల సేకరణకు వారికి విస్తృత నెట్వర్క్ ఉన్నట్లు NIA గుర్తించింది. ఆ ఫండ్‌ను కొవిడ్ టైమ్‌లో బంగారంగా మార్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పార్టీ సానుభూతిపరుల పేర్లతోనూ డొల్ల కంపెనీలు పెట్టి రూ.కోట్లు మళ్లిస్తున్నారని, వారి వద్ద రూ.400 కోట్ల నిధులు, 400 KGల గోల్డ్ ఉండొచ్చని అనుమానిస్తోంది.

సబ్జా గింజలు చర్మానికే కాదు జుట్టుకు కూడా మంచి పోషకాలు అందిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ గింజలలోని విటమిన్ కె, బీటా కెరోటిన్, ప్రొటీన్లు.. వెంట్రుకలు, కుదుళ్లు దృఢంగా మారేలా చేస్తాయని, వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి కొందరికి పడకపోవచ్చు. కాబట్టి వాడే ముందు వ్యక్తిగత నిపుణులు సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

బ్రూసిల్లా అబార్టస్ బ్యాక్టీరియా వల్ల పశువులకు సోకే ప్రమాదకర వ్యాధి బ్రూసెల్లోసిస్. ఈ వ్యాధి వల్ల పశువుల్లో గర్భస్రావం, వంధ్యత్వం, పాల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల స్రావాలు తాకినా, పాలు మరిగించకుండా తాగినా మనుషులకూ ఇది సోకుతుంది. దీని వల్ల పురుషుల్లో వృషణాల వాపు, వీర్యం విడుదలలో ఇబ్బంది, మహిళల్లో అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. ✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

సెమీస్‌లో అద్భుతమైన ఆటతో భారత్‌ను WWC ఫైనల్ చేర్చిన జెమీమా రోడ్రిగ్స్ ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు. గత WC(2022)లో ఆమెను జట్టులోకే తీసుకోలేదు. ఈసారి ఫామ్‌లో ఉండటంతో తొలిసారి WC ఆడే ఛాన్స్ ఇచ్చారు. కానీ తొలి 4 మ్యాచుల్లో జెమీమా 2సార్లు డకౌట్ కాగా మరో 2సార్లు 30ల్లో ఔట్ అయ్యారు. దీంతో ENG మ్యాచులో తప్పించారు. అయినా కుంగిపోకుండా తర్వాత NZపై 76*, నిన్న సెమీస్‌లో 127* రన్స్ చేసి INDను ఫైనల్ చేర్చారు.

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 228A, లైంగిక వేధింపులకు గురైన ఉమెన్ ఐడెంటిటీని బయట పెట్టడాన్ని నిషేధిస్తుంది. ఆమె పేరు, అడ్రస్ లేదా ఇతర వివరాలను వెల్లడించకూడదు. ఏ వివరాలు బయట పెట్టాలన్నా ఆమె అనుమతి ఉండాలి. తమ గురించి బయటకు తెలిసి పోతుందనే భయం లేకుండా, ఎక్కవ మంది బాధితులు బయటకు వచ్చి కంప్లైంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ హక్కు కల్పించారు.

బ్రూసెల్లోసిస్ సోకిన పశువుల్లో గర్భస్రావమైనప్పుడు పిండం, గర్భకోశ స్రావాల ద్వారా సూక్ష్మజీవులు బయటకు వచ్చి పశువులు మేసే మేతను, నీటిని ఆశించి కలుషితం చేస్తాయి. ఈ మేతను, నీటిని ఇతర పశువులు తీసుకుంటే వాటికి వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువులు ఆరోగ్యకరమైన ఆవులు, గేదెలను దాటినప్పుడు వీర్యం ద్వారా వ్యాపిస్తుంది. గొర్రెలు, మేకలు, పందులు, ఆవులు, గేదెలు, కుక్కలు, మనుషులకు ఈ వ్యాధి సోకుతుంది.

AP: పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడే ఛాన్స్ ఉందని APSDMA అంచనా వేసింది. కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. అటు ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా, కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.