India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలో ఎన్నికల పండుగ ప్రకటనకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 10ని.లో భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయనుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను CEC రాజీవ్ కుమార్ వెల్లడించనున్నారు. అటు పలు చోట్ల ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాల బైపోల్ షెడ్యూల్ కూడా ఇందులో ఉంటుంది.
– ఎన్నికల షెడ్యూల్ లైవ్ అప్‌డేట్స్, ఆసక్తికర కథనాలు ఎక్స్‌క్లూజివ్‌గా వే2న్యూస్‌లో పొందవచ్చు.
TG: బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.
TG: రాష్ట్రానికి PM మోదీ చేసిందేమి లేదని CM రేవంత్ అన్నారు. ‘తెలంగాణను అవమానించిన మోదీకి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అవినీతి పాలనపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్. ఎన్నికల నోటిఫికేషన్ సమయానికి డ్రామాకు తెరలేపారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే ఊరుకుంటామా? బీఆర్ఎస్-బీజేపీ కుట్ర చేస్తే తప్పా.. వారు అనుకుంటున్నది సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు.
కవిత రిమాండ్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసులో కవితను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఈడీ వాదించింది. ఆమెను కస్టడీకి అప్పగించాలని కోరింది. అయితే ఇప్పటికే న్యాయస్థానంలో తన పిటిషన్ విచారణలో ఉండగానే తనను అరెస్టు చేయడాన్ని ఆమె సవాల్ చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును సాయంత్రం గం.4:30కి రిజర్వు చేసింది.
సూర్యుడి చుట్టూ పరిభ్రమణంతో భూమి వాతావరణం మారుతూ ఉంటుందనే విషయం తెలిసిందే. తాజాగా ఈ వాతావరణంపై మార్స్ ప్రభావం కూడా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. పరిభ్రమణం, కక్ష్యలో మార్పుల వల్ల ప్రతీ 24లక్షల ఏళ్లకు ఓసారి భూమి, మార్స్ దగ్గరగా వస్తాయట. ఈ క్రమంలో ఇరు గ్రహాల గురుత్వాకర్షణ శక్తి ఒకదానిపై మరోటి ప్రభావం చూపిస్తాయట. ఫలితంగా భూ వాతావరణం మారుతుందట. దీనిని గ్రాండ్ సైకిల్ అంటారు.
ఈ అరుదైన ఘటనతో 24లక్షల ఏళ్లకు ఓసారి భూ వాతావరణంలో భారీ మార్పులు సంభవిస్తాయట. ఓ గ్రాండ్ సైకిల్‌లో భూమికి ఎక్కువ సూర్యకాంతి తగులుతూ, తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటే మరో సైకిల్‌లో సూర్యకాంతి తగ్గి, శీతల ఉష్ణోగ్రతలు నమోదవుతాయట. భూ అవక్షేపాలపై పరిశోధనతో ఈ విషయాలను కనుగొన్నారు. సముద్ర గర్భాన మార్పులు, గతకొన్నేళ్లలో పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ తమ పరిశోధనకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.
TG: BSP రాష్ట్రాధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. బహుజన్ సమాజ్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ‘నిన్న బీఎస్పీ-బీఆర్ఎస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రక పొత్తును భగ్నం చేయాలని ప్రయత్నాలు(కవిత అరెస్టుతో సహా) చేస్తోంది. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. చివరివరకు బహుజన వాదాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా’ అని ట్వీట్ చేశారు.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు వైసీపీ ట్వీట్ చేసింది. ‘రెండు నెలల్లో మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తాం. సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకువెళ్లేలా అడుగులు వేస్తాం’ అని CM జగన్ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు ట్వీట్‌లో తెలిపింది. వైసీపీ ప్రకటించిన 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీల స్థానాలపై మీ కామెంట్?
వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ముగ్గురు సోదరులకు మరోసారి అవకాశం దక్కింది. ఒకే ఫ్యామిలీకి చెందిన అన్నదమ్ముళ్లు వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), వై.వెంకటరామి రెడ్డి (గుంతకల్), వై.సాయి ప్రసాద్ రెడ్డి(ఆదోని) పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో వీరు అవే స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. వీరు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి భీమిరెడ్డి కుమారులు.
AP: వైసీపీ ప్రకటించిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు ఉన్నారు. 18 మంది డాక్టర్లు, 15 మంది అడ్వకేట్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు, ఒకరు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి, ఒక జర్నలిస్టు ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. 19 మంది మహిళలకు సీఎం జగన్ అవకాశం కల్పించారు.
Sorry, no posts matched your criteria.