News March 20, 2024

పవన్ ఎంపీగా బరిలో ఉంటే పిఠాపురంలో నేనే పోటీ చేస్తా: వర్మ

image

AP: అమిత్ షా సూచిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని, పిఠాపురంలో ఉదయ్ బరిలో ఉంటారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీ నేత ఎస్వీఎస్‌ఎన్ వర్మ స్పందించారు. ‘పొత్తులో భాగంగా కూటమి గెలుపు కోసం పని చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు మాటకు కట్టుబడి పవన్ గెలుపు కోసం కృషి చేస్తా. ఒకవేళ ఆయన కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం అసెంబ్లీ స్థానంలో నేనే బరిలో ఉంటా’ అని తెలిపారు.

News March 20, 2024

‘ఇళయరాజా’ బయోపిక్ షూటింగ్ ప్రారంభం

image

మ్యూజిక్ మాస్ట్రో ‘ఇళయరాజా’ బయోపిక్ షూటింగ్ ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించనుండగా, అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ టీమ్ విడుదల చేసిన ఇంట్రడక్షన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

News March 20, 2024

రికార్డు స్థాయికి మారుతి సుజుకీ షేర్లు!

image

వాహన తయారీ సంస్థ మారుతి సుజుకీ షేర్లు ఈరోజు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 3శాతం మేర పెరిగిన షేర్ విలువ తొలిసారిగా ఈరోజు రూ.12వేల మార్కును టచ్ చేసింది. మధ్యాహ్నం 12.44 గంటల సమయానికి షేర్ వాల్యూ 3.14శాతం పెరిగింది. షేర్ విలువ చివరి ఐదు ట్రేడింగ్ సెషన్లలో 5శాతం, గడచిన 6 నెలల్లో 15.5శాతం, గడచిన ఏడాదిలో 45శాతం పెరగడం విశేషం.

News March 20, 2024

ఎన్నికల తర్వాత పెరగనున్న విదేశీ పెట్టుబడులు!

image

భారత మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల జోరు ఎన్నికల తర్వాత మరింత పెరుగుతుందని జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేసింది. భారత్ ఆర్థికవృద్ధి కొనసాగుతుండటం, ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్ రంగంలోనూ ఈ విదేశీ పెట్టుబడుల హవా కొనసాగుతోంది. నెల రోజుల వ్యవధిలో ఈ రంగంలో ఇంటర్నేషనల్ ఫండ్స్ 1.70% లాభాన్ని నమోదు చేశాయి.

News March 20, 2024

నేను గెలిస్తే యువరాజుపై చర్యలు: ట్రంప్

image

తాను అధికారంలోకి వస్తే బ్రిటన్ యువరాజు హ్యారీపై చర్యలు తీసుకుంటానని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 2020 నుంచి అమెరికాలో ఉంటున్న హ్యారీ, గతంలో డ్రగ్స్ వాడినట్లు ఓ పుస్తకంలో వెల్లడించారు. అమెరికా వీసాకు అప్లై చేసినప్పుడు ఆ విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. తాను గెలిస్తే హ్యారీ విషయంపై దర్యాప్తు చేసి, అతడి తప్పున్నట్లైతే చర్యలు తీసుకుంటానని ట్రంప్ స్పష్టం చేశారు.

News March 20, 2024

చావుబతుకుల్లో హీరోయిన్.. సాయం కోసం ఎదురుచూపు

image

ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఆమె చికిత్స కోసం డబ్బు సహాయం అడిగినా తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఎవరూ ముందుకు రావడం లేదని అరుంధతి ఫ్రెండ్, నటి రమ్య వాపోయారు. ‘అరుంధతికి బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. సాయం కావాలని అడుగుతున్నా నడిగర్ సంఘం నుంచి స్పందన లేదు’ అని తెలిపారు.

News March 20, 2024

తెెలంగాణలో ఒంటరిగానే సీపీఎం పోటీ

image

TG: లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని సీపీఎం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ పేరును ప్రకటించింది. త్వరలోనే మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.

News March 20, 2024

వారిపై ఆ ప్రభావం ఒక శాతం కూడా ఉండదు: మెక్ గ్రాత్

image

ఐపీఎల్ వేలంలో ఆసీస్ బౌలర్లు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. కమిన్స్‌కు సన్‌రైజర్స్ రూ.20.5 కోట్లు ఇస్తుంటే స్టార్క్‌కు కేకేఆర్ రూ.24.75 కోట్లు ఇవ్వనుంది. అయితే వారిపై ఆ ఒత్తిడి ఉండదని ఆసీస్ మాజీ బౌలర్ మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డారు. ‘వారిద్దరూ చాలా అనుభవజ్ఞులు. ధరతో సంబంధం లేకుండా గతంలో ఎలా ఆడారో అలాగే ఆడతారు. వారిపై ఒకశాతం కూడా ఒత్తిడి ఉండదు’ అని పేర్కొన్నారు.

News March 20, 2024

కాంగ్రెస్‌లో చేరిన మాజీ MLA

image

AP: ఎన్నికల వేళ కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. నిన్న నందికొట్కూరు MLA ఆర్థర్ హస్తం కండువా కప్పుకోగా.. తాజాగా కోడుమూరు మాజీ MLA పరిగెల మురళీకృష్ణ కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. ఆయనకు ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మురళీకృష్ణ 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. 2014లో మరోసారి బరిలోకి దిగగా.. ఓటమి చెందారు. తర్వాత ఆయన వైసీపీలో చేరారు.

News March 20, 2024

అభ్యర్థుల్ని ప్రకటించిన డీఎంకే

image

తమిళనాట 39 లోక్‌సభ సీట్లకు గాను అధికార డీఎంకే పార్టీ 21 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించింది. కీలక అభ్యర్థుల్లో.. కనిమొళి తూత్తుకుడి నుంచి, దయానిధి మారన్‌ చెన్నై సెంట్రల్‌ నుంచి బరిలో ఉన్నారు. మిగిలిన సీట్లను ఇండియా కూటమికి కేటాయించనుంది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. అటు అన్నాడీఎంకే కూడా 16మంది అభ్యర్థులతో కూడిన జాబితాను రిలీజ్ చేసింది.