News March 23, 2024

మెగాస్టార్ ఆఫర్లు తిరస్కరించా: పృథ్వీరాజ్

image

‘సలార్’లో వరదరాజ మన్నార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన పృథ్వీరాజ్ సుకుమారన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. HYD వచ్చిన ఆయన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. సైరా నరసింహారెడ్డిలో నటించాలని, గాడ్ ఫాదర్‌కి దర్శకత్వం వహించాలని మెగాస్టార్ తనను కోరారని చెప్పారు. ఆ రెండుసార్లు తాను ‘ఆడుజీవితం’లో బిజీగా ఉండటంతో చిరంజీవికి క్షమాపణ చెప్పినట్లు వెల్లడించారు.

News March 23, 2024

రష్యా ఉగ్రదాడి.. 150కి చేరిన మృతుల సంఖ్య

image

రష్యా రాజధాని మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 150 మంది చనిపోయారు. మరికొంత మంది ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. కాగా ఇప్పటికే 11 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులకు ఉక్రెయిన్‌తో సంబంధం ఉందని అందుకే వారు ఆ దేశంలోకి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారని రష్యా సెక్యూరిటీ సర్వీస్ పేర్కొంది.

News March 23, 2024

ఉల్లి ఎగుమతులపై నిషేధం పొడిగింపు

image

ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నిషేధంపై గతంలో విధించిన గడవు ఈనెల 31న ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కాగా ఈ నిర్ణయాన్ని పలువురు నిపుణులు తప్పుపడుతున్నారు. ఈ నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని.. నిజానికి ఇప్పుడు బ్యాన్ పొడగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

News March 23, 2024

ఫలితాలు విడుదల

image

TS: ప్రభుత్వ వెటర్నరీ&ఏనిమల్ హస్బెండరీ విభాగంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. TSPSCలో పరీక్షకు హాజరైన అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాలను అందుబాటులో ఉంచారు. ఎంపికైన వారికి త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉండనుంది. డిసెంబర్ 22, 2022లో ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 185 పోస్టులు ఉన్నాయి. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News March 23, 2024

కవిత ఆడపడుచు ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు

image

TG: ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. మాదాపూర్‌లోని కవిత బంధువుల ఇళ్లలో ఇవాళ ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 11 గంటలపాటు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత మేనల్లుడు శరణ్ పాత్రపై ఆరా తీస్తున్నారు.

News March 23, 2024

హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

image

లిక్కర్ స్కాం కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ CM కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అత్యవసర విచారణ జరపాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. కాగా లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆయనకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది.

News March 23, 2024

ఏపీని డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చారు: షర్మిల

image

AP: రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని షర్మిల విమర్శించారు. ‘ఇండియాలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపీ వైపే. కేంద్ర, రాష్ట్ర నిఘా వ్యవస్థ మద్దుతు లేకుండా 25వేల కేజీల డ్రగ్స్ బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి ఎలా చేరుతాయి? డ్రగ్స్ మాఫియాతో వైసీపీ, టీడీపీ, బీజేపీలకు లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా? దీని తెర వెనుక ఎంతటి వాళ్లున్నా CBI నిగ్గు తేల్చాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.

News March 23, 2024

TDP ఎమ్మెల్యే సీటు జనసేనకు.. అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్

image

AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ టికెట్ టీడీపీ నుంచి జనసేనకు మారింది. ఇక్కడి నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తారని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాగా, తొలి విడతలోనే టీడీపీ నేత మహాసేన రాజేశ్‌కు చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. పలు కారణాలతో తాజాగా రాజేశ్ స్థానంలో సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు పవన్.

News March 23, 2024

మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

image

TS: మరో రెండు ఎంపీ స్థానాలకు BRS అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి క్యామ మల్లేశ్ పోటీ చేస్తారని వెల్లడించారు.

News March 23, 2024

‘దేవర’లో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్?

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ డ్యూయల్ రోల్ అనుకున్న ఫ్యాన్స్‌కు ఇది మంచి ట్రీట్ అనే చెప్పుకోవాలి. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శృతి మరాఠే కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.