India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఎన్నికల వ్యూహాలు, పోల్ మేనేజ్‌మెంట్‌పై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 23న టీడీపీ వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరై నేతలకు సూచనలు చేయనున్నారు. వచ్చే రెండు నెలల కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు. కాగా రెండు రోజుల్లో మిగిలిన అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.
TG: కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై ఇంకా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించగా, ఇవాళ మరో ఆరుగురు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇందులో పెద్దపల్లి, చేవెళ్ల, సికింద్రాబాద్, ఆదిలాబాద్, మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్ ఉన్నాయి. ఖమ్మం, WGL, కరీంనగర్, NZB, భువనగిరి, మెదక్, HYD అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. వీటిపై మరో 2 రోజుల్లో స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
జపాన్‌లో తాము ఉన్న హోటల్ వద్ద భూకంపం వచ్చినట్లు SS కార్తికేయ ట్వీట్ చేశారు. ‘జపాన్‌లో ఇప్పుడే భయంకరమైన భూకంపం వచ్చింది. మేము 28వ అంతస్తులో ఉన్నాం. భూమి కంపించడం ప్రారంభించింది. భూకంపం అని గ్రహించి భయాందోళనకు గురయ్యా. కానీ, చుట్టుపక్కల ఉన్న జపనీయులు పెద్దగా పట్టించుకోవడం లేదు. భూకంప అనుభూతిని పొందా’ అని తెలిపారు. ఆయన RRR స్పెషల్ షో వీక్షించేందుకు రాజమౌళితో వెళ్లినట్లు తెలుస్తోంది.
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లిలో ఉన్న 3 మద్యం దుకాణాలు లూటీకి గురయ్యాయి. అధిక ధరకు మద్యం అమ్ముతున్నారనే కారణంతో ప్రజలు ఈ దుకాణాలను లూటీ చేశారు. 3 షాపుల యజమానులు సిండికేట్‌గా మారి ఎమ్మార్పీ కన్నా రూ.30 అదనంగా తీసుకుంటున్నారు. దీంతో విసుగెత్తిన కస్టమర్లు మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రూ.22 లక్షల విలువైన మద్యం మాయమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన హాలీవుడ్ ‘జేమ్స్ బాండ్’ ఫ్రాంచైజీలో 26వ చిత్రం త్వరలో తెరకెక్కనుంది. జేమ్స్ బాండ్‌గా మెప్పించిన డేనియల్ క్రెగ్.. వయసురీత్యా కొత్త సినిమాలో నటించడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఆయన స్థానంలో ఆరోన్ టేలర్ జాన్సన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. గాడ్జిల్లా, అవెంజర్స్ వంటి సినిమాల్లో ఇతను నటించారు. ఈ మూవీకి క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్ చేస్తారని హాలీవుడ్ టాక్.
TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనను అరెస్ట్ చేసే విషయంలో ఈడీ రూల్స్ పాటించలేదన్న BRS MLC కవిత వాదనను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. PMLA చట్టంలోని సెక్షన్-19ను ED పాటించిందని న్యాయమూర్తి నాగ్‌పాల్ ఇచ్చిన తీర్పు బయటకొచ్చింది. అమెను సూర్యాస్తమయానికి ముందే అరెస్ట్ చేసి, 24 గంటల్లోపు తమ ముందు హాజరుపరిచారని కోర్టు పేర్కొంది. అటు సెక్షన్-19లోని నిబంధనల ప్రకారం ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదంది.
ఏప్రిల్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయసు నిండే యువత ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటు హక్కు పొందితే రానున్న ఎన్నికల్లో ఓటు వేయవచ్చని పేర్కొంది. నిన్న తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగా.. మిగతా దశల్లో జరిగే ఎన్నికల నామినేషన్ల చివరి తేదీలు ఏప్రిల్ 1 తర్వాత ఉంటాయి. దీంతో ఆ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారికి EC ఈ అవకాశం కల్పించింది. ఓటు హక్కు దరఖాస్తు కోసం ఇక్కడ <
AP: చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ మూడు సార్లు గెలిచారు. కానీ ఈ సారి ఆయనను ఓడించి తీరాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కిమిడి కళా వెంకట్రావును అక్కడ పోటీ చేయించాలనుకుంటున్నా వారు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు బొత్స తనదైన రాజకీయంతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బొత్స సేఫ్ జోన్‌లోనే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
AP: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో వచ్చే నెల 16 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. 17న శ్రీరామనవమి రోజున ధ్వజారోహణం, 22న సీతారాముల కళ్యాణం జరుగుతుందని తెలిపింది. అన్నప్రసాదాలు, తలంబ్రాల పంపిణీకి 2 వేల మంది సేవకులను సిద్ధం చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు నిర్మించాలని సూచించారు.
భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించే అవకాశం ఉంది. ఈమేరకు ఆ రెండు దేశాల అధ్యక్షులు ఆయన్ను కోరారని పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఆ దేశాల అధ్యక్షులతో ఆయన తాజాగా ఫోన్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. తమ మధ్య శాంతిని నెలకొల్పడంలో భారత్ సమర్థమైన పాత్ర పోషిస్తుందని వారు భావిస్తున్నట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి.
Sorry, no posts matched your criteria.